బిగ్ బాస్ 12: శ్రీశాంత్‌కు షాక్... విజేతగా అవతరించిన టీవీ నటి దీపిక కక్కర్
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్ 12' టైటిల్ పాపులర్ టీవీ యాంకర్ దీపిక కక్కర్ దక్కించుకున్నారు. టైటిల్ అందున్న అనంతరం ఆమె మాట్లాడుతూ... తాను హౌస్‌లో డర్టీ గేమ్స్ ఆడకుండా నిజాయితీగా ఉండటం వల్లనే గెలుపు సాధ్యమైందని తెలిపారు. 'ససురాల్ సిమర్ కా' టీవీ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన దీపిక కక్కర్ బిగ్ బాస్ 12 షోలో అడుగు పెట్టిన తాను అనుకున్నది సాధించారు.
గతంలో టీవీ రంగం నుంచి వచ్చిన శ్వేతా తివారీ, శిల్పా శిండే, జుహీ పర్మార్ తర్వాత ఈ అవార్డ్ దక్కించుకున్న నాలుగో టీవీ సెలబ్రిటీగా దీపిక కక్కర్ నిలిచారు. ఈ షోలో విజేతగా నిలవడం ద్వారా బిగ్ బాస్ 12 ట్రోఫీతో పాటు రూ. 30 లక్షల ఫ్రైజ్ మనీ గెలుచుకున్నారు. ' ఇక ఫస్ట్ రన్నరప్‌గా శ్రీశాంత్, సెకండ్ రన్నరప్‌గా దీపక్ ఠాకూర్ నిలిచారు.

ఆనందంతో ఏడ్చేసిన దీపిక కక్కర్
చివరి వరకు ఉత్కంఠగా సాగిన షోలో.... సల్మాన్ ఖాన్ తన పేరు ప్రకటించగానే దీపిక కక్కర్ భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం సైతం భావోద్వాగానికి లోనయ్యారు. ఈ సందర్బంగా దీపిక ఫ్యామిలీని కూడా సల్మాన్ ఖాన్ స్టేజ్‌పైకి ఆహ్వానించారు.

105 రోజుల పాటు సంతోషంగా
105 రోజుల పాటు హౌజ్‌లో సంతోషంగా గడిపినట్టు ఈ సందర్భంగా దీపిక కక్కర్ తెలిపారు. నన్ను విజేతగా నిలిబెట్టిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. శ్రీశాంత్, దీపిక్ ఠాకూర్‌తో కలిసి ఫైనల్ వరకు చేరుకోవడం ఆనందంగా ఉంది. టైటిల్ దక్కించుకునేందుకు నా స్టైల్‌లో గేమ్ ఆడాను, నన్ను విజేతగా నిలబెట్టిన ఆడియన్స్‌కు థాంక్స్ అని చెప్పారు.

బిగ్ బాస్ అంటే అదీ అని నిరూపించాలనుకున్నాను
బిగ్ బాస్ షో అంటే ఒకరిపై ఆధిపత్యం చూపించడం కాదు, ఎదుటువారిని డిమాండ్ చేయడం కాదు... నిజాయితీగా, అందరితో మంచిగా ఉండటం అని నిరూపించాలనుకున్నాను. ఈ షోలో నన్ను నేను ప్రజెంట్ చేసుకున్న తీరుపై ఆనందంగా ఉన్నానని దీపిక తెలిపారు.

శ్రీశాంత్ గెలిచినా హ్యాపీ
ఒకవేళ తన సహచర కంటెస్టెంట్ శ్రీశాంత్ విజేతగా నిలిచినా తను ఇంతే హ్యాపీగా ఉండేదాన్ని, శ్రీశాంత్ నా సొంత అన్నయ్యలాంటి వ్యక్తి అని దీపిక కక్కర్ వెల్లడించారు.

ఫార్ములా ఏమీ ఉండదు
బిగ్ బాస్ లాంటి కాంట్రవర్సల్ రియాల్టీ షోలో విజయం సాధించడానికి ఫార్ములా అనేది ఏమీ ఉండదు, మీ మనసుకు రైట్ అనిపించింది చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగడమే అని దీపిక కక్కర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











