For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination: లీకైన 12వ వారం అఫీషియల్ ఓటింగ్.. మారిన టాప్ పొజిషన్.. ఆ ఇద్దరిలో ఒకరు బయటకు!

  |

  కంటెంటె విషయంలో విమర్శలు వస్తున్నా.. ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ రికార్డుల మీద రికార్డులు కొడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. కాన్సెప్టు ఎలాంటిదైనా ప్రేక్షకుల మద్దతు దొరికిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనడానికి ఇదే ఉదాహరణ అని చెప్పొచ్చు. మన ప్రేక్షకుల మద్దతుతో దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోన్న షోగా నిలుస్తోంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదే రీతిలో రన్ అవుతోంది. ఇందులో ఇప్పటికే పదకొండు మంది ఎలిమినేట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో 12వ వారంలో మాత్రం ఏకంగా ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఓటింగ్‌లో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారన్న దానిపై ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ఆరంభం నుంచే ప్రయోగాలు చేస్తూ

  ఆరంభం నుంచే ప్రయోగాలు చేస్తూ


  తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు నిర్వహకులు ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. వీటికి మంచి స్పందన వస్తుండడంతో ఈ ఉత్సాహంతోనే షోను మరింత రంజుగా మార్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌ రోజు రోజుకూ మరింత రక్తి కడుతోంది.

  మళ్లీ రెచ్చిపోయిన అషు రెడ్డి: ఎద అందాలు మొత్తం కనిపించేలా.. వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకుంటారా!

  బిగ్ బాస్ షో నుంచి 11 మంది ఔట్

  బిగ్ బాస్ షో నుంచి 11 మంది ఔట్

  ఐదో సీజన్‌లోకి గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 11 వారాలకు పదకొండు మంది సభ్యులు ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ ఎలిమినేట్ అయిపోయారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది.

  చివరి దశకు చేరడంతో కొత్త కష్టాలు

  చివరి దశకు చేరడంతో కొత్త కష్టాలు

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. దీంతో నిర్వహకులు నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు హౌస్‌లో ఉన్న ఎనిమిది మందికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక, ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ చివరి టాస్క్ కావడంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్ అయ్యాడు. వచ్చే వారం నుంచి హౌస్‌లో ఎవరూ కెప్టెన్ ఉండడు కాబట్టి బిగ్ బాస్ మరిన్ని కొత్త టాస్కులు ఇచ్చి రంజుగా మార్చబోతున్నాడు. ఇక, ఇప్పటికే హౌస్‌లోకి కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో మంచి రెస్పాన్స్ వస్తోంది.

  హాట్ షోతో హీటు పెంచేసిన అనుపమ పరమేశ్వరన్: అమాంతం పైకి లేపి రచ్చ చేసిన హీరోయిన్

  12వ వారం వాళ్లంతా నామినేషన్‌లో

  12వ వారం వాళ్లంతా నామినేషన్‌లో


  12వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ మొత్తం గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగింది. మరీ ముఖ్యంగా ప్రియాంక, సిరి.. కాజల్, రవి, సన్నీ, శ్రీరామ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక, ఈ వారంలో కెప్టెన్ మానస్ మినహా మిగిలిన కంటెస్టెంట్లు ఆర్జే కాజల్, సిరి హన్మంత్, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో దీనిపై ఎన్నో రకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

  లీకైన ఓటింగ్.. మారిపోయిన టాపర్

  లీకైన ఓటింగ్.. మారిపోయిన టాపర్

  12వ వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆరంభం నుంచే ఓటింగ్ పొజిషన్స్ మారుతుంటాయి. కానీ, ఈ వారం టాస్కుల కంటే ఫ్యామిలీ మెంబర్ల ఎంట్రీలు హైలైట్ అవడంతో స్టార్టింగ్ ఎలాంటి రిజల్ట్ ఉందో.. ఇప్పటికీ అదే కొనసాగుతుందని తెలుస్తోంది. బిగ్ బాస్ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. ఈ వారం వీజే సన్నీ టాప్ పొజిషన్‌లో ఉన్నాడని తెలిసింది. ఎప్పుడూ షణ్ముఖ్ జస్వంత్ టాప్‌లో ఉండేవాడు. అయితే, ఈ వారం మాత్రం ఈ స్థానం మారిందట. దీనిపై సన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  Drushyam 2: వెంకటేష్‌కు భారీ షాక్.. రిలీజైన గంటల్లోనే ఫుల్ మూవీ లీక్.. ఆ సైట్లలో డౌన్‌లోడ్ లింక్

  వాళ్లంతా సేఫ్ జోన్‌లోనే ఉన్నారట

  వాళ్లంతా సేఫ్ జోన్‌లోనే ఉన్నారట

  ఈ వారంలో మానస్ మినహా మిగిలిన సభ్యులంతా నామినేషన్‌లో ఉన్నారు. దీంతో ఎవరి అభిమానులు వాళ్లకు ఓట్లు చేస్తున్నారు. సన్నీ, షణ్ముఖ్ ఒకటి రెండు స్థానాల్లో ఉండగా.. మిగిలిన స్థానాల్లోనూ పెద్దగా మార్పులు కనిపించడం లేదని అంటున్నారు. వారం ఆరంభం నుంచే సేమ్ పొజిషన్లలో కొనసాగుతున్నారట. ఈ సమాచారం ఆధారంగా సింగర్ శ్రీరామ చంద్ర మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, నాలుగో స్థానంలో యాంకర్ రవి ఉన్నాడట. ఇక, ఐదో స్థానంలో ఆర్జే కాజల్ ఉన్నట్లు తెలిసింది. దీంతో వీళ్లంతా సేఫ్ అయినట్లు అని టాక్.

  Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
  ఆ ఇద్దరిలో ఒక కంటెస్టెంట్ అవుట్

  ఆ ఇద్దరిలో ఒక కంటెస్టెంట్ అవుట్

  12వ వారానికి సంబంధించి మొత్తం ఏడుగురు సభ్యులు నామినేషన్‌లో ఉన్నారు. ఇందులో వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ చంద్ర, యాంకర్ రవి, కాజల్‌లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారని ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక, మిగిలిన ఇద్దరు అంటే సిరి హన్మంత్, ప్రియాంక సింగ్ మాత్రం డేంజర్‌ జోన్‌లో ఉన్నారట. అంటే ఈ వారం వీళ్లిద్దరి నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న మాట. ఇందులో పింకీ కంటే సిరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయని అంటున్నారు. అంటే ఈ వారం దాదాపుగా ఆమెనే బయటకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

  English summary
  Bigg Boss Recently Started 5th Season. In 12th Week Sunny in Top.. Priyanka and Siri Enter into Danger Zone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X