Bigg Boss Week 12 Nominations: టైటిల్ ఫేవరెట్లకు బిగ్ షాక్.. ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే!

తెలుగు బుల్లితెరపై వచ్చే షోలు అన్నింట్లోనూ ఎక్కువ రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఐదేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా రికార్డులను కూడా అందుకుంది.

ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో రెస్పాన్స్‌ను రాబడుతోంది. దీంతో ఇది కూడా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ షోలో ముఖ్యమైన ప్రక్రియల్లో నామినేషన్స్ ఒకటి. 12వ వారానికి సంబంధించిన టాస్క్ వివరాలు లీక్ అయ్యాయి. మరి ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం పదండి!

 ఐదో సీజన్ కొంత అలా.. కొంత ఇలా

ఐదో సీజన్ కొంత అలా.. కొంత ఇలా

తెలుగులో గతంలో ప్రసారం అయిన నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మొదలైన దీనికి ప్రేక్షకుల స్పందన మంచిగానే దక్కుతోంది. అయితే, ఒక్కోవారం సక్సెస్ అయినా.. ఒక్కో వారం మాత్రం చప్పగా సాగుతోంది. మొత్తానికి ప్రేక్షకులకు మాత్రం మజాను పంచుతూనే ఉంది.

హాట్ షోలో హద్దు దాటిన పూజా హెగ్డే: కేవలం అదొక్కటే ధరించి.. ఇలాంటి ఫొటోలు కూడా షేర్ చేస్తారా!

పది మంది అలా... ఒకరేమో మరోలా

పది మంది అలా... ఒకరేమో మరోలా

ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారంలో ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారంలో హమీదా, ఆరో వారంలో శ్వేత, ఏడో వారంలో ప్రియ, ఎనిమిదో వారంలో లోబో, తొమ్మిదో వారంలో విశ్వలు, పదకొండో వారం ఆనీ ఎలిమినేట్ అయిపోయారు. జెస్సీ పదో వారంలో అనారోగ్యంతో ఔట్ అయ్యాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచుకున్న సన్నీ

ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచుకున్న సన్నీ

గత వారంలో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్'కు సంబంధించిన టాస్క్ జరిగింది. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ టాస్కులో వీజే సన్నీ విజేతగా నిలిచాడు. తద్వారా పాస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, అతడు దీన్ని తన కోసమైనా వాడుకోవచ్చు.. లేదా మరో కంటెస్టెంట్‌కు ఇవ్వొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇలా ఒక వారం ఎలిమినేషన్ తప్పించుకునే అవకాశాన్ని అతడు అందుకున్నాడు.

ముఖ్యమైన టాస్క్.. గొడవలతో సాగి

ముఖ్యమైన టాస్క్.. గొడవలతో సాగి

బిగ్ బాస్ షోలో ఎన్నో టాస్కులు ఉంటాయి. అయితే, అన్నింటి కంటే నామినేషన్స్ ప్రక్రియే ఎంతో ముఖ్యమైనది. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతుంది. దీంతో ఈరోజు కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తారు.

12వ వారం నామినేషన్ వివరాలివే

12వ వారం నామినేషన్ వివరాలివే

12వ వారం నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఇందులో కంటెస్టెంట్లు అందరూ గార్డెన్ ఏరియాలో నిల్చోవాల్సి ఉంటుంది. వాళ్ల ముందు దిష్టి బొమ్మలు పెట్టారు. అలాగే, పక్కన కుండలు ఉంచారు. ఒక్కో కంటెస్టెంట్ నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి పగలగొట్టాల్సి ఉంటుందని తెలిసింది.

12వ వారం వాళ్లంతా నామినేషన్‌లో

12వ వారం వాళ్లంతా నామినేషన్‌లో

12వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్ ప్రక్రియ మొత్తం గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో సాగుతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ప్రియాంక, సిరి.. కాజల్, రవి మధ్య మాటల యుద్ధం జరిగిందట. ఇక, ఈ వారంలో కెప్టెన్ మానస్ మినహా మిగిలిన కాజల్, సిరి, రవి, షణ్ముఖ్, వీజే సన్నీ, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయ్యారని తెలుస్తోంది.

Recommended Video

RRR గ్రాండ్ రిలీజ్.. Bheemla Nayak పై ఆఖరి అస్త్రం | Pawan Kalyan || Filmibeat Telugu
టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో ఎలా

టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో ఎలా

12వ వారానికి సంబంధించి కెప్టెన్ మినహా మొత్తం కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఇందులో టైటిల్ ఫేవరెట్లుగా భావిస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో ఫాలోయింగ్ భారీగా ఉన్న వాళ్లు తప్పించుకుని.. తక్కువగా ఉన్న కంటెస్టెంట్ మాత్రమే బలయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఈ వారం కూడా ఆసక్తికర ఎలిమినేషన్ ఉండనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X