Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
రూ.400 కోట్ల డీల్ ఫిక్స్... బిగ్ బాస్ హోస్ట్ చేసే ఆ హీరోగారికి షాకింగ్ రెమ్యూనరేషన్!
Recommended Video
ఇండియాలో బాగా పాపులర్ అయిన, వివాదాస్పదంగా సాగే షోలలో అన్నింటికంటే ముందు ఉండే షో 'బిగ్ బాస్'. తొలుత హిందీలో మొదలైన ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ మొదలు పెట్టారు. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ వెర్సన్ 'బిగ్ బాస్' ఆల్ టైమ్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది.
ఇప్పటికే 12 సీజన్లు పూర్తవ్వగా... త్వరలో 13వ సీజన్ మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సారి షో భిన్నంగా ఉండబోతోందని, సల్మాన్ ఖాన్‌తో పాటు లేడీ హోస్ట్ కూడా షోలో సందడి చేయబోతున్నారనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.
రేటు పెంచుతూ వెళుతున్నాడు
‘బిగ్ బాస్' ప్రతీ సీజన్‌కు సల్మాన్ ఖాన్ తన రెమ్యూనరేషన్ పెంచుతూ పోతున్నారు. 2017లో ప్రసారమైన 11వ సీజన్‌కు ప్రతివారం రూ. 11 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. గతేడాది 12వ సీజన్లో రూ. 12 కోట్ల నుంచి 14 కోట్లు చార్జ్ చేశారని, ఓవరాల్‌గా రూ. 300 నుంచి రూ. 350 కోట్లు తీసుకున్నట్లు అంచనా.
నెక్ట్స్ సీజన్ రెమ్యూనరేషన్ ఎంతంటే?
త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ 13వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ప్రతీ వీకెండ్(2 రోజులు) హోస్ట్ చేసేందుకు రూ. 31 కోట్లు తీసుకోబోతున్నారట. అలా మొత్తం 13 వీకెండ్స్ హోస్ట్ చేసినందుకుగాను రూ. 403 కోట్ల రూపాయల ఫీజు అందుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఒకప్పటితో పోల్చుకుంటే ఇపుడు భారీగా
బిగ్ బాస్ 4వ సీజన్, 5వ సీజన్ హోస్ట్ చేసే సమయంలో సల్మాన్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 2.5 కోట్లు తీసుకునేవారు. 7వ సీజన్లో రూ. 5 కోట్లు, 8వ సీజన్లో రూ. 5.5 కోట్లు, 9, 10వ సీజన్ సమయంలో 8 కోట్లు, 11వ సీజన్ సమయంలో ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 11 కోట్లు చార్జ్ చేసినట్లు టాక్.
మొదలయ్యేది ఎప్పుడు?
సల్మాన్ ఖాన్ మోస్ట్ చేయబోయే బిగ్ బాస్ 13వ సీజన్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు? ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే అంశాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.