Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఆడ, మగ ఒకే బెడ్‌పై.. అది రియాల్టీ షోనేనా..? బ్యాన్ చేయాలంటూ ధర్నా.. 20 మంది అరెస్ట్
అన్ని భాషలో విజయవంతమై క్రేజీగా మారిన రియాల్టీ షో బిగ్‌బాస్. ప్రస్తుతం తమిళంలో మూడో సీజన్ పూర్తి కాగా.. తెలుగులో మూడో సీజన్ నడుస్తోంది. రీసెంట్గా హిందీ బిగ్‌బాస్ పదమూడో సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే అన్ని భాషల్లో కంటే హిందీలో ప్రసారమయ్యే ఈ షోకే ఎక్కువ పాపులారిటీ ఉంటుంది.
మొదలైన 13 సీజన్..
సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షోను ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. ఉత్తరాదిన సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ షోకు ఆదరణ ఎక్కువగానే ఉంటుంది. బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లి ఇప్పటికే ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అయితే ప్రతీ సీజన్‌పై ఎన్నో రకాల వివాదాలు వచ్చి పడుతూ ఉంటాయి.
తమిళంలో వివాదాల బారిన..
తెలుగులో ఈ వివాదాలు కాస్త తక్కువే అయినా..తమిళ సీజన్లో మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని, కించపరిచారని ఇలా ఏదో రకంగా వివాదాస్పదంగా మారుస్తూ ఉంటారు. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. వారు అనుకున్నదే చేసుకుంటూ పోతారు.
బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్...
అలాగే ఇటీవలె హిందీలో ప్రారంభమైన పదమూడో సీజన్ మరో కొత్త వివాదానికి తెరలేపింది. ఈ సీజన్‌ను కొత్తగా ఉంచాలనే ఆలోచనలతో ఉన్న బృందం.. ఆడ, మగవారిని ఒకే బెడ్‌పై పడుకునే అవకాశమిచ్చాడు..పైగా దీనికి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్.. అంటూ చెప్పిన కాన్సెప్ట్‌పై అందరూ భగ్గుమన్నారు.
సల్మాన్ ఇంటి ముందు ధర్నాలు..
సామాజిక సంఘాలు, కర్ణిసేన ఇలా అందరూ సల్మాన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రాజకీయ నాయకులు కూడా.. ఈ వివాదంపై మద్దతు పలుకుతున్నారు. భారతీయ సంప్రదాయాలను భగ్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ నిర్వాహకులపై మండి పడుతున్నారు. దీంతో ఆందోళనలు ఉద్రిక్తతం అవ్వడంతో పదిమందిని అరెస్ట్ చేశారు. మరి ఈ నిర్ణయంపై బిగ్ బాస్ వెనక్కి తగ్గుతాడా లేదా అన్నది చూడాలి.