For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Elimination: 13వ వారం షాకింగ్ ఓటింగ్.. మొదటి రోజు అలా ఇప్పుడిలా.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు

  |

  ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయినా.. ప్రేక్షకుల ఆదరణను అందుకుని రికార్డుల మీద రికార్డులు కొడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్‌బాస్. కాన్సెప్టు విషయంలో విమర్శలు ఎదురవుతోన్నా.. మన ప్రేక్షకుల మద్దతుతో దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోన్న షోగా నిలుస్తోంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదే రీతిలో రన్ అవుతోంది. ఇందులో ఇప్పటికే పదకొండు మంది ఎలిమినేట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో 13వ వారంలో మాత్రం ఏకంగా ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఓటింగ్‌లో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారన్న దానిపై ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  ఈ సీజన్ కూడా వాటిలాగే నడుస్తోంది

  ఈ సీజన్ కూడా వాటిలాగే నడుస్తోంది

  బిగ్ బాస్ షోకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతూనే ఉంటోంది. ఇప్పటికే ఈ షో రికార్డులను కొడుతూ దేశ వ్యాప్తంగా పేరును సంపాదించుకుంది. అలా నాలుగు సీజన్లను భారీ రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఐదో సీజన్ కూడా జనరంజకంగా సాగుతోంది. ఫలితంగా దీనికి రెట్టించిన రెస్పాన్స్ కనిపిస్తోంది. దీంతో గత సీజన్లను మించిపోయేలా విజయవంతంగా సాగుతోంది.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన భూమిక: తడిచిన అందాలతో ఘాటుగా.. ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  పన్నెండు వారాలు 12 మంది అవుట్

  పన్నెండు వారాలు 12 మంది అవుట్

  ఐదో సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవిలు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం అనారోగ్యంతో తప్పుకున్నాడు.

  చివరి దశలో కొత్త టాస్క్‌లు ఇస్తూనే

  చివరి దశలో కొత్త టాస్క్‌లు ఇస్తూనే

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. దీంతో నిర్వహకులు హౌస్‌లో ఉన్న ఏడుగురికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక, ఈ వారం 'టికెట్ టు ఫినాలే' టాస్క్ జరుగుతోంది. ఇందులో గెలిచిన వాళ్లు నేరుగా గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఈ టాస్క్ ఆద్యంతం రసవత్తరంగా సాగుతోంది. ఇందులో కంటెస్టెంట్లు బిగ్ బాస్ యూనిట్ సరికొత్త టాస్కులు ఇస్తోంది.

  Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు

  13వ వారం ఎవరు నామినేటయ్యారు?

  13వ వారం ఎవరు నామినేటయ్యారు?

  బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో సరికొత్త టాస్కులు కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్లు కూడా స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నారు. దీంతో నామినేషన్ ప్రక్రియలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇక, 13వ వారానికి సంబంధించి సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మినహా మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్రలు నామినేట్ అయిన విషయం తెలిసిందే.

  అతడు టాప్‌లోనే... రెండో స్థానంలో

  అతడు టాప్‌లోనే... రెండో స్థానంలో


  13వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. అయితే, ఇందులో ఆరంభం నుంచీ సింగర్ శ్రీరామ చంద్ర టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడని అంటున్నారు. అనధికారిక పోల్స్‌లో సైతం అతడి హవానే కనిపిస్తోంది. రెండో స్థానంలో మాత్రం ఒకరోజు మానస్.. మరో రోజు సిరి హన్మంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మాత్రం క్లారిటీ రావడం లేదట.

  బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్‌పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!

  డేంజర్ జోన్‌లో మాత్రం వాళ్లిద్దరని

  డేంజర్ జోన్‌లో మాత్రం వాళ్లిద్దరని


  ప్రస్తుతానికి శ్రీరామ చంద్ర, మానస్, సిరి హన్మంత్ ఎక్కువ ఓట్లను సాధిస్తూ సేఫ్ జోన్‌లో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ జాబితాలో మిగిలిన ఇద్దరు అంటే ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్ మాత్రం డేంజర్ జోన్‌లో ఉన్నారని అంటున్నారు. ఇందులో కాజల్‌కు కూడా మంచిగానే ఓట్లు వస్తున్నా.. ఆమె నాలుగో స్థానానికే పరిమితం అయిందని తెలిసింది.

  Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
  ఏం జరుగుతుందో.. అయోమంగానే

  ఏం జరుగుతుందో.. అయోమంగానే

  గత వారంలో ఊహించని ఎలిమినేషన్ జరగడంతో.. 13వ వారానికి సంబంధించి ఎవరు ఉంటారు? ఎవరు బయటకు వెళ్లిపోతారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికితోడు ఓటింగ్ సిస్టమ్‌పై రోజుకో వార్త బయటకు వస్తుండడంతో కంటెస్టెంట్ల ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో అయోమయం నెలకొంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియపై భారీ స్థాయిలో సస్పెన్స్ నెలకొంది.

  English summary
  Bigg Boss Recently Started 5th Season. In 13th Week Sreeram in Top.. Priyanka and Kajal Enter into Danger Zone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X