For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ముఖం కడగలేదని నామినేషన్.. ఆ కంటెస్టెంట్‌‌కు బిగ్ బాస్ వార్నింగ్.. చివర్లో భారీ ట్విస్ట్

  |

  ఎవరూ ఊహించని పరిణామాలతో ఎంతో ఆసక్తికరంగా సాగుతూ తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. అలాగే ఐదేళ్లుగా హవాను చూపిస్తూ సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న దాన్ని మరింత కొత్తగా వినోదాత్మకంగా రూపొందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకున్న ఐదో సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియకుండా ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగనున్న నామినేషన్స్ ప్రక్రియలో ఓ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

  చెప్పినట్లే చూపిస్తున్న బిగ్ బాస్ టీమ్

  చెప్పినట్లే చూపిస్తున్న బిగ్ బాస్ టీమ్

  గతంలో వచ్చిన సీజన్లు అన్నీ ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఐదో సీజన్‌పై అందరిలో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో షో నిర్వహకులు సైతం వాటికి ఏమాత్రం తీసిపోకుండా దీన్ని నడుపుతున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో మలుపులతో కూడిన సంఘటనలను చూపించారు. ఇలా మొత్తంగా మంచి కంటెంట్ ఇస్తూ మజాను పంచుతున్నారు.

  ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!

  పన్నెండు వారాలు.. పన్నెండు మంది

  పన్నెండు వారాలు.. పన్నెండు మంది


  ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వారిలో. వారిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో తప్పుకున్నాడు.

  చివరి దశకు చేరి.. ఆసక్తిగా మారిందిగా

  చివరి దశకు చేరి.. ఆసక్తిగా మారిందిగా

  బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో ఇప్పటి నుంచే నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్సీ టాస్కును కూడా తీసేశారు. అలాగే, ఎన్నో సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. ఇలా రానున్న రోజుల్లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారు. దీంతో కంటెస్టెంట్లకు కొత్త కష్టాలు మొదలు కాబోతున్నాయి.

  Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర

  బిగ్ బాస్ షోలోనే ముఖ్యమైన ఘట్టంగా

  బిగ్ బాస్ షోలోనే ముఖ్యమైన ఘట్టంగా

  బిగ్ బాస్ షోలో ఎన్నో టాస్కులు ఉంటాయి. అయితే, అన్నింటి కంటే ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారం మొదలైన రోజు అంటే ప్రతి సోమవారం దీన్ని ప్రసారం చేస్తుంటారు. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. అందుకే దీని కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు.

  ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇలానే

  ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇలానే


  13వ వారానికి సంబంధించి జరిగే నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగనుంది. ఇందులో కంటెస్టెంట్ల ఫొటోలతో బాల్స్ ఉంటాయి. ఇంటి సభ్యులు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో.. ఆ ముఖం ఉన్న బాల్‌ను బిగ్ బాస్ మెయిన్ గేట్ బయటకు కాలితో తన్నాల్సి ఉంటుంది. ఈ టాస్కులో మానస్, షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రియాంక సింగ్ గొడవ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

  అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

  ముఖం కడగలేదని నామినేషన్ అంటే

  సోమవారం జరగనున్న నామినేషన్ ప్రక్రియ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో సన్నీ.. శ్రీరామ్‌ను నామినేట్ చేసినట్లు చూపించారు. అలాగే, ప్రియాంక ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కావడం లేదని అంది. దీంతో సన్నీ 'ఇగో.. మానస్ నీతో మాట్లాడడం లేదుగా నామినేట్ చెయ్.. లేకుంటే కాజల్ ముఖం కడుక్కోవట్లేదు ఆమెను చెయ్' అంటూ తెగ నవ్వించాడు.

  Recommended Video

  Bimbisara Teaser Review | Tollywood's Future || Filmibeat Telugu
  ఆ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ వార్నింగ్

  ఆ కంటెస్టెంట్‌కు బిగ్ బాస్ వార్నింగ్


  ఇంటి చివరి కెప్టెన్ అయిన షణ్ముఖ్ జస్వంత్.. ప్రియాంక సింగ్‌ను త్వరగా నామినేట్ చేయమని అడుగుతాడు. కానీ, ఆమె టైం కావాలని అంటుంది. దీంతో బిగ్ బాస్ 'ప్రియాంక మిమ్మల్ని బిగ్ బాస్ చివరి సారి హెచ్చరిస్తున్నారు. త్వరగా మీరు ఎవరో ఒకరిని నామినేట్ చేయకపోతే.. మీరే నేరుగా నామినేట్ అవుతారు' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.

  English summary
  Bigg Boss 5th Season Running Successfully. Bigg Boss Gave Strong Warning to Priyanka Singh in 13th Week Nominations Task.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X