Bigg Boss 14 సోనాలి పోస్టుమార్టం తరువాత న్యూ ట్విస్ట్.. బలవంతంగా కూల్ డ్రింక్ ఇచ్చి..

హిందీ బిగ్ బాస్ 14వ సీజన్ కంటెస్టెంట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రముఖ సినీనటి రాజకీయ నాయకురాలు సోనాలి ఫోగాట్ ఇటీవల మృతి చెందడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గోవా ట్రిప్ కోసం వెళ్లిన ఆమె హఠాత్తుగా మృత్యువాత పడటం ఆమె కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొల్పింది. అయితే ఆమె మొదట గుండెపోటుతో మరణించింది అని తెలిపినప్పటికీ కూడా సోదరుడు కేసు నమోదు చేయడంతో ఇందులో మరికొన్ని అనుమానిత కోణాలు ఉన్నాయి అని తెలుస్తోంది. ఇక పోలీసులు కూడా ఈ కేసు విషయంలో మరొక కీలకమైన అంశాన్ని బయటకు తీశారు పూర్తి వివరాలలోకి వెళితే..

మొదట గుండెపోటు అని..

మొదట గుండెపోటు అని..

ఆగస్టు 22వ తేదీన సోనాలి తన సన్నిహితులతో కలిసి గోవాకు వెళ్ళింది ఆమె మేనేజర్ తో సుధీర్ సాంగ్వాన్ తో పాటు మరొక వ్యక్తి కూడా గోవా ట్రిప్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొదట సోనాలి మృతికి గుండెపోటు కారణమని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సోనాలి సోదరుడు తన సోదరి మృతి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తెలియజేయడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.

ఇద్దరు అనుమానితులు

ఇద్దరు అనుమానితులు

ఇక పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితులను అయితే గుర్తించారు. మేనేజర్ సుదీర్ తో పాటు అతని సహచరుడు సుక్వేందర్ కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఆమె చనిపోయే ముందు ఒక డ్రగ్స్ లాంటి రసాయనాన్ని ఆమెకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొదట ప్రత్యేకమైన ఒక పదార్థాన్ని తినమని వాళ్లు ఫోర్స్ చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు.

 కూల్ డ్రింక్ లో డ్రగ్స్

కూల్ డ్రింక్ లో డ్రగ్స్

అయితే ఆమె అందుకు నిరాకరించడంతో ఆ తర్వాత కూల్ డ్రింక్ లో ప్రత్యేకంగా ఒక పదార్థాన్ని కలిపి ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఆమె ట్రావెల్ చేసిన ఒక ట్యాక్సీ డ్రైవర్ ను కూడా విచారించిన పోలీసులో ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు సమాచారం. అయితే ప్రత్యేకంగా వీడియో ఫ్యూటేజ్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమెకు కొన్ని గాయాలు అయినట్లు కూడా కనుగొన్నారు.

 గాయాలు కారణం కాదు

గాయాలు కారణం కాదు

అయితే ఆమె మృతికి మాత్రం ఆ గాయాలు కారణం కాదు అని మరొక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు. తేలికపాటి గాయాలు మాత్రమే ఆమెకు అయినట్లు వివరణ ఇచ్చారు. ఇక తోపులాట లోనే ఈ గాయాలు తగిలి ఉండవచ్చు అని కూడా అనుమానిస్తున్నారు. ఇక మేనేజర్ సుధీర్ అలాగే అతని అనుచరుడు ఏదైనా ఆర్థికమైన కారణాల వలన సోనాలిపై చర్యకు పాల్పడి ఉండవచ్చు అని మరొక కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

 సోనాలి ఫ్యామిలీ డిమాండ్

సోనాలి ఫ్యామిలీ డిమాండ్

ఇంకా ఈ విషయంలో అయితే పూర్తిగా ఒక నిర్ణయానికి ఇప్పుడే రాలేము అని త్వరలోనే అన్ని విషయాలు బయటకు తెలుస్తాయని అసలు మృతికి గల కారణాన్ని కూడా కచ్చితంగా కనుగొంటామని గోవా పోలీసులు వివరణ ఇచ్చారు. అసలైతే సోనాలి గుండెపోటుతో మరణించినట్లుగా పోలీసులు చెప్పారు అని సోనాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.. ఇక వివిధ కోణాల్లో అనుమానిస్తూ ఈ కేసును సిబిఐకు అప్పగించాలి అని కూడా కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X