Bigg Boss కంటెస్టెంట్ మరణంపై అనేక అనుమానాలు.. పోస్టు మార్టంపై అధికారుల నజర్

హిందీ బిగ్ బాస్ 14వ సీజన్లో బలమైన కంటెస్టెంట్ గా కనిపించిన సోనాలి ఫోగాట్ ఇటీవల మృతి చెందడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిరంతరం టెలివిజన్ సీరియల్స్ ద్వారా జనాల్లో ఎంతగానో గుర్తింపు అందుకుమాటు వచ్చిన ఆమె ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఎవరు కూడా నమ్మలేకపోయారు.

అయితే ఆమె మరణం పై కొన్ని ఆరుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల గోవాకు ఎంతో సంతోషంగా వెళ్లిన సోనాలి గుండెపోటుతో మరణించినట్లుగా సన్నిహితులు తెలియజేశారు. అయితే ఈ విషయంపై మరికొన్ని అనుమానాలు రాక వెంటనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించాలి అని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ప్రత్యేకంగా సోనాలి మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

నటి సోనాలి ఫోగట్ ఆగస్టు 23న తుది శ్వాస విడిచింది. సోనాలి తన సన్నిహితులతో కలిసి ఆగస్టు 22న గోవాకు వెళ్లారు. ఆమె ఆ రాత్రి పార్టీకి వెళ్లి మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చింది. అయితే కొన్ని గంటల తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఆగస్టు 24న బుధవారం ఆమెకు పోస్ట్‌మార్టం నిర్వహించి, పోలీసుల ఆదేశాల మేరకు వీడియో తీయనున్నారు.

Bigg boss 14 Contestant Sonali Phogat postmortem update

ఇద్దరు వైద్యులతో కూడిన బృందం ఈ పోస్ట్ మార్టంలో పాల్గొననుంది. పోలీసుల ఆదేశాల మేరకు ప్రక్రియను వీడియో తీయనున్నారు. అనంతరం పూర్తి రిపోర్ట్ గోవాలో ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపబడుతుంది. సోనాలి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు మరికొద్దిసేపట్లో గోవా మెడికల్ కాలేజీకి చేరుకోనున్నారు.

సోనాలి సింగ్ ఫోగట్ ఫతేహాబాద్ జిల్లాలోని భూథాన్ గ్రామానికి చెందినవారు. ఇక ఆమె హరిత, హిసార్‌కి చెందిన దివంగత సంజయ్ ఫోగట్‌ను వివాహం చేసుకుంది. అయితే 2016 అతను తన ఫామ్ హౌస్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. సోనాలికి ఏడేళ్ల కూతురు కూడా ఉంది. నిత్యం మంచి నటిగా కొనసాగాలి అని సోనాలి ఎప్పుడూ కోరుకుంటుంది అని సన్నిహితులు చెబుతున్నారు.

ఇక ఆమె ఎనిమిదేళ్ల క్రితం దూరదర్శన్ లో హర్యాన్వి షోలకు యాంకరింగ్ చేయడం ద్వారా తన టెలివిజన్ కెరీర్‌ను ప్రారంభించింది. జీ టీవీ అమ్మా సీరియల్ ద్వారా పెద్ద బ్రేక్ వచ్చింది. అలాగే సోనాలి బిజెపి మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. సోనాలి సింగ్ ఫోగట్ 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అడంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X