టాస్క్ ఎలా ఉన్నా మోనాల్ అదే రొమాన్స్.. మరోసారి రెచ్చిపోయిన అవినాష్.. ఈ కక్కుర్తి ఏంటో?
బిగ్ బాస్ షోలో గొడవలు కాంట్రవర్సీలు ఎన్ని ఉన్నా కూడా ఒక విషయంలో మాత్రం మార్పులు రావడం లేదు. మసాలా పక్కా అన్నట్లుగా రొమాన్స్ తో కొందరు ఊహించని షాక్ ఇస్తున్నారు. బుధవారం ఎపిసోడ్ లో రాక్షసులు ఒకొక్కరికి చుక్కలు చూపించారు. ఉన్నది ముగ్గురే అయినప్పటికీ టాస్క్ లతో పరుగులు పెట్టించారు. మంచి మనుషులు కూడా రాక్షసులు అయ్యేలా ప్రవర్తించారు అరియానా, మెహబూబ్.

హీటెక్కించిన మోనాల్
అరియానా చాలా వరకు తనకు రాక్షస పాత్ర బాగా నచ్చేసింది అంటూ ఆ పాత్రలోనే జీవించేసింది. మరోవైపు మెహబూబ్ మాత్రం కాస్త సీరియస్ గానే మంచి మనుషుల ఓపికను గట్టిగానే టెస్ట్ చేశాడు. వీరిదంతా ఒకలా ఉంటే అవినాష్ మాత్రం కామెడీ ట్రాక్ లోనే తన సరసాన్ని చూపించాడు. ఇక మోనాల్ లాంటి బ్యూటీ పక్కన చేరి అతన్ని మరింత హీటెక్కించింది.

టాస్క్ ఎలా ఉన్నా మోనాల్ అదే రొమాన్స్
టాస్క్ ఎలా ఉన్నా మోనాల్ మాత్రం అదే తరహాలో రొమాన్స్ డోస్ పెంచుతోంది. కంటెస్టెంట్స్ కనెక్ట్ అయితే చాలు వారి పక్కన చేరిపోయి లిమిట్స్ లేకుండా క్లోజ్ అవుతోంది. ఈ విషయంలో చాలా సార్లు అభిజిత్, అఖిల్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినా మోనల్ మాత్రం తన రొమాంటిక్ చూపులతో కెమెరాలను తనవైపుకు తిప్పుకుంటోంది. ఇక బుధవారం ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది.

ఆమె కౌగిలిలో బందీని అయిపోతా
అందరు బెడ్ లను తీసి పారేస్తున్నపుడు మెహబూబ్ ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వచ్చాడు. అరియానా కూడా అఖిల్ కి చుక్కలు చూపించింది. అయితే అవినాష్ మాత్రం కామెడీ ట్రాక్ లోనే తనలోని రొమాంటిక్ బాయ్ ని మరోసారి బయటకు తీసాడు. మోనాల్ పక్కనే చేరి ముద్దొస్తోంది అంటూ పదే పదే ఆమె కౌగిలిలో బందీని అయిపోతా అంటూ హౌజ్ లో అందరికి షాక్ ఇచ్చాడు.
Recommended Video

టాస్క్ ను ఉపయోగించుకొని.. కక్కుర్తి పనులు
మోనాల్ ఏ మాత్రం ఫిలింగ్స్ ని దాచుకోకుండా అడిగిన వారికి హగ్స్ ఇచ్చేసింది. మెహబూబ్ వచ్చినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. కానీ ఎందుకో ఈ రోజు మోనాల్, అఖిల్ ల మధ్య ఎక్కువ సీన్స్ కనిపించలేదు. అయితే అవినాష్ మాత్రం టాస్క్ ను ఉపయోగిఎంచుకొని మోనాల్ తో తెగ సరసాలు ఆడాడు. అరియానాను కూడా మరోవైపుకు పిలిచి మరొక విధంగా పరవశించిపోయాడు. పక్కనే ఉన్న లాస్య తట్టుకోలేక సెటైర్స్ వేయగా మా మీదే పంచ్ లు వేస్తావా అంటూ ఆమె బట్టలు తీసి బయటపడేయలని చూశారు కానీ లాస్య కాళ్ళ బేరానికి వచ్చి వారిని కూల్ చేసింది.


Click it and Unblock the Notifications











