twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ 14: దడ పుట్టిస్తున్న సల్మాన్ రెమ్యునరేషన్.. భాయ్ టార్గెట్ 500కోట్లు?

    |

    స్టార్ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే సల్మాన్ ఖాన్ తరువాతే ఎవరైనా. సెలబ్రెటీ హోదాకు తనదైన శైలిలో క్రేజ్ అందిస్తూ ఏడాదికి వేల కోట్ల ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. సల్మాన్ తన దగ్గర పనిచేసే వర్కర్స్ కి లక్షకు తక్కువ కాకుండా జీతాలు ఇస్తున్నాడు అంటేనే ఆయన రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆదాయంలో అక్షయపాత్ర అయినటువంటి బిగ్ బాస్ తో మారోసారి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ స్టార్ హీరో ఒక ప్లాన్ తో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Bigg Boss Season 14 కోసం భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేస్తున్న Salman Khan! || Oneindia Telugu
     బిగ్ బాస్ కుబేరుడు..

    బిగ్ బాస్ కుబేరుడు..

    బాలీవుడ్ భాయ్ దాదాపు వాణిజ్య ప్రకటనలతోనే ఏడాదికి కావాల్సిన ఖర్చులను సెట్ చేసుకుంటాడని చెప్పవచ్చు. ఇక సినిమాలతో వచ్చే ఆదాయాన్ని బ్యాంక్ ఎకౌంట్ లో సేవ్ చేసుకుంటాడు. ఇక సల్మాన్ ని ఎక్కువగా కుబేరునిగా చేసింది మాత్రం బిగ్ బాస్ అనే చెప్పాలి. ఆ షోతోనే ఆదాయం ఎక్కువగా అందుకున్న భాయ్ ఇండస్ట్రీలో తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్నాడు.

    మెల్లమెల్లగా రేటింగ్స్ పెరగడంతో..

    మెల్లమెల్లగా రేటింగ్స్ పెరగడంతో..

    2010లో నాలుగవ సీజన్ తో హోస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టిన సల్మాన్ ఖాన్ అప్పట్లో వారానికి కేవలం 2.5కోట్లు మాత్రమే అందుకున్నాడు. ఇక మెల్లమెల్లగా రేటింగ్స్ పెరగడంతో రెమ్యునరేషన్ నెంబర్స్ కూడా పెరిగాయి. సీజన్ 9కి వచ్చేసరికి భాయ్ 7నుంచి 8కోట్ల రూపాయలకు పెంచిన సల్మాన్ అనంతరం వెనక్కి తిరిగి చూసుకోలేదు.

    టార్గెట్ 500కోట్లు?

    టార్గెట్ 500కోట్లు?

    ఒక్కో సీజన్ కి వందల కోట్ల ఆదాయాన్ని అర్జిస్తున్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సీజన్ కి టార్గెట్ 500కోట్లకు వచ్చింది. అంటే అతనికి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పైగా సల్మాన్ ఖాన్ ప్రతిరోజు కాకుండా వీకెండ్స్ లో మాత్రమే షోకి వచ్చి హడావుడి చేస్తాడు. కానీ కనిపించిన రెండు రోజులు మాత్రం షోకి మంచి బూస్ట్ ఇస్తాడు.

     16కోట్లకు టెండర్..

    16కోట్లకు టెండర్..

    ఇక నెక్స్ట్ 14వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 13వ సిజన్ కి సల్మాన్ ఒక ఎపిసోడ్ కి 12నుంచి 14కోట్లు తీసుకున్నాడని టాక్ వచ్చింది. ఇక నెక్స్ట్ సీజన్ ని అక్టోబర్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సారి ఎపిసోడ్ కి 16కోట్ల టెండర్ వేసిన భాయ్ చూస్తుంటే ఆదాయాన్ని ఒక్కసారిగా 500కోట్లకు పెంచే ఛాన్స్ ఉందట.

    బిగ్ బాస్ 14కోసం భారీ ప్లాన్స్..

    బిగ్ బాస్ 14కోసం భారీ ప్లాన్స్..

    గత సీజన్ ని 140రోజులు నడిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి కూడా అదే తరహాలో ఎవరు ఉహీంచని కంటెస్టెంట్ లతో కొనసాగించాలని అనుకుంటున్నారు. ఇక సల్మాన్ ఖాన్ వారానికి రెండు సార్లు వస్తాడు కాబట్టి ఈ సారి మరింత క్రేజ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్ బాస్ 14ఎప్పుడు ఎలా మొదలవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Salman Khan is someone who wants to cash in on the star image. Craze offers celebrity status in his own style and generates thousands of crores a year. Salman is giving salaries of less than a lakh to the workers he works with. The star hero seems to have a plan to increase his income once again with Bigg Boss, which is an integral part of the income.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X