బిగ్‌బాస్ ప్రోమోకు అంతా రెడి.. అతడి ఫాంహౌస్‌లోనే షూట్..భగ్గుమన్న సామాజిక కార్యకర్తలు
బిగ్‌బాస్ షో అనేది ఇండియాలో ఎంతగా ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా ప్రాంతీయ భాషల్లోకి పాకింది. ఇప్పుడు బిగ్‌బాస్ షో అనేది ప్రతీ భాషలో మొదలైంది. అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ రియాల్టీ షో బాగానే పాపులర్ అయింది. అయితే ఎన్ని భాషల్లో షో మొదలైన హిందీ బిగ్ బాస్‌కు ఉండే క్రేజే వేరు. హోస్ట్ చేసే సల్మాన్ స్టైల్ ఇంకా వేరు. అసలైన బిగ్‌బాస్‌లో వ్యవహరిస్తూ అందర్నీ కంట్రోల్ పెడతాడు. ఇప్పటికే పదమూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

వివాదమైన సీజన్..
ప్రతీ సీజన్‌లో అమ్మాయిలను అబ్బాయిలను వేర్వేరుగా ఉండాలి, బెడ్స్ వేరు, పడుకోవడం వేరు అనే నిబంధన ఉండేది. కానీ ఈ పదమూడో సీజన్‌లో మాత్రం ఆ రూల్‌ను తీసేశారు. ఎవరి ఇష్టం వారిదని, ఎక్కడ పడుకున్నా అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై భగ్గుమన్నారు.

సల్మాన్‌కు వ్యతిరేకంగా..
అయితే కంటెస్టెంట్లపై పెరిగిన అభిమానం ఒక్కో సారి అదుపుతప్పుతుంది ప్రేక్షకులకు. వారి వారి అభిమాన కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం, వారిపై పక్షపాతం చూపిస్తున్నట్టు అనిపించడంతో సల్మాన్‌పై తీవ్ర వ్యతిరేకతను కనబర్చారు. ట్వీట్ల రూపంలో వారి కోపాన్ని తీర్చుకున్నారు. చివరకు అందరూ ఊహించినట్టుగా సిద్దార్థ్ శుక్లా 13వ సీజన్ విన్నర్‌గా నిలిచాడు.

14వ సీజన్‌కు శ్రీకారం..
ప్రస్తుతం పద్నాలుగో సీజన్‌కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రోమోను కూడా రెడీ చేస్తున్నారట. అయితే సల్మాన్ మాత్రం లాక్ డౌన్‌ను పన్వేల్ ఫామ్ హౌస్‌లోనే గడిపేస్తున్నాడు. దీంతో అక్కడి నుంచి ఈ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ చేయబోతోన్నారట.
Recommended Video

అదే మెయిన్ హైలెట్..
అయితే ఈ సీజన్‌కు సంబంధించి.. సామాజిక దూరం పాటించడం అనేది మెయిన్ కాన్సెప్ట్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి పద్నాలుగో సీజన్ ప్రారంభం కాబోతోన్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











