బిగ్‌బాస్ విన్నర్‌కు కరోనావైరస్ పాజిటివ్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు
టెలివిజన్ నటి, బిగ్‌బాస్ 14 విజేత రుబీనా దిలైక్ కరోనావైరస్ బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆమె ఇటీవల రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
నా జీవితంలో మెరుపు తీగను చూడాలనుకొంటున్నాను. నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ఒక నెల తర్వాత నేను ప్లాస్మా డొనేషన్‌కు అర్హురాలిని అవుతాను అని ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
రుబీనా దిలైక్ ఇన్స్‌టాగ్రామ్‌లో.. నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలగానే 17 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకొన్నారు. నాతో సన్నిహితంగా ఉన్నవారు కూడా దయచేసి కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నాను. నాకు నెగిటివ్ వచ్చిన తర్వాత నేను ప్లాస్మా డొనేట్ చేస్తాను అని తన పోస్టులో పేర్కొన్నారు.

రుబీనా దిలైక్ విషయానికి వస్తే.. హిందీలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ సీరియల్ చోటి బహు: సింధూర్ బిన్ సుహాగన్, పునర్ వివాహ్, శక్తి: అస్తిత్త కే ఏహసాస్ లాంటి సీరియల్స్ నటించి ప్రేక్షకులకు చేరువైంది.
ఇటీవలే బిగ్‌బాస్ రియాలిటీ షోలో తన సత్తాను ప్రదర్శించారు. చివరకు వరకు కంటెస్టెంట్లకు పోటీగా నిలిచి బిగ్‌బాస్ 14 విన్నర్‌గా నిలిచారు.


Click it and Unblock the Notifications











