For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 14 Winner: హిందీ బిగ్ బాస్‌లో ఊహించని ఫలితం.. విన్నర్‌గా సీరియల్ నటి.. ఆ సింగర్‌కు షాక్

  |

  బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. దేశ వ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ షోగా నిలుస్తోంది బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సక్సెస్ అయింది. అందుకే ఏకంగా 14వ సీజన్ వరకూ వచ్చింది. ప్రస్తుత సీజన్ కొత్త కొత్త ప్రయోగాలతో సాగింది. ఇక, ఊహించని పరిణామాలతో సాగిన ఈ సీజన్ ఫినాలేలో అనూహ్య ఫలితం వెలువడింది. ఆ వివరాలు మీకోసం!

  Bigg Boss Telugu 4 : Why Abhijeet Won The Title ? | 'Behaviour Is The Key'
  అనుమానాల ప్రారంభమైన సీజన్ 14

  అనుమానాల ప్రారంభమైన సీజన్ 14

  కరోనా ప్రభావంతో ప్రతి ఏడాదిలా ఈ సారి అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యే అవకాశాలు లేవని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా ఈ షో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఇందుకోసం షో నిర్వహకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు వైద్య పరమైన ఎన్నో సదుపాయాలు కల్పించారు.

  వాళ్లతో మొదలైన షో.. అన్నీ భారీగానే

  వాళ్లతో మొదలైన షో.. అన్నీ భారీగానే

  ఏకంగా పదమూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది హిందీ బిగ్ బాస్. గత అక్టోబర్ 14వ సీజన్ 11 మంది కంటెస్టెంట్లతోనే ప్రారంభం అయింది. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేశాడు. కరోనా ప్రభావంతో పద్నాలుగో సీజన్‌ కోసం షో యూనిట్ ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ సెట్‌ను కూడా సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో నిర్మించారు.

  ఛాలెంజర్స్.. ఫ్రెషర్స్.. తుఫానీ సీనియర్స్

  ఛాలెంజర్స్.. ఫ్రెషర్స్.. తుఫానీ సీనియర్స్


  14వ సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేశారు. ఇందులో భాగంగానే ఫ్రెషర్స్, ఛాలెంజర్స్ అంటూ కొంత మంది కొత్త పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి తీసుకొచ్చారు. వీళ్లలో రాఖీ సావంత్, వికాస్ గుప్తా తదితరులు ఉన్నారు. ఇక, సీజన్ చివర్లో తుఫానీ సీనియర్స్ అని మరికొందరిని దించారు. ఇందులో గత విన్నర్లు సిద్ధార్ద్ శుక్లా, గౌహర్ ఖాన్‌తో పాటు హినా ఖాన్ ఉన్నారు.

  ఫినాలేకు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు

  ఫినాలేకు చేరిన ఐదుగురు కంటెస్టెంట్లు


  143 రోజుల పాటు సాగిన ఈ సీజన్‌ ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో 11 మందితో పాటు ఛాలెంజర్స్‌గా కొందరు.. ఫ్రెషర్ వైల్డ్ కార్డ్ మెంబర్లుగా కొందరు.. మొత్తంగా 23 మంది ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఐదుగురు కంటెస్టెంట్లు రుబీనా దిలైక్, రాఖీ సావంత్, అలీ గోనీ, నిక్కీ తంబోలీ, రాహుల్ వైద్యాలు ఫినాలేకు చేరుకున్నారు.

  ఇద్దరు ఎలిమినేట్.. హీరోయిన్ మాత్రం

  ఇద్దరు ఎలిమినేట్.. హీరోయిన్ మాత్రం


  గత ఆదివారం బిగ్ బాస్ 14వ సీజన్ గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. సల్మాన్ ఖాన్ అదిరిపోయే హోస్టింగ్‌తో పాటు పలువురు సెలెబ్రిటీల పెర్ఫార్మెన్స్‌ల నడుమ ఇది సందడిగా సాగింది. ఐదుగురు ఫైనలిస్టులలో రాఖీ సావంత్ రూ. 14 లక్షలు తీసుకుని ముందుగా బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత అలీ గోనీ, నిక్కీ తంబోలీ ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అయిపోయారు.

  విన్నర్‌గా సీరియల్ నటి.. ఆ సింగర్‌కు షాక్

  విన్నర్‌గా సీరియల్ నటి.. ఆ సింగర్‌కు షాక్


  ముగ్గురు ఎలిమినేట్ అవడంతో సీరియల్ నటి రుబీనా దిలైక్, ప్రముఖ సింగర్ రాహుల్ వైద్యా టాప్‌లో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై చాలా సేపు సస్పెన్స్ కొనసాగింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ 14వ సీజన్‌కు రుబీనా విన్నర్ అయినట్లు సల్మాన్ ఖాన్ ప్రకటించాడు. దీంతో టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా ఉన్న రాహుల్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

  English summary
  Bigg Boss 14 finale live updates: Rubina Dilaik has won the 14th season of Bigg Boss. Salman Khan announced her as the winner, as she defeated Rahul Vaidya for the trophy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X