Bigg Boss Elimination: ఈ వారం షాకింగ్ ఓటింగ్.. సన్నీ, షన్నూలో టాప్ అతడే.. చివర్లో బలమైన కంటెస్టెంట్

బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం అవసరం లేని షో ఇది. అంతలా ఇది ఐదేళ్లుగా అందరినీ అలరిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ సాగిపోతోంది. ఇప్పుడు ఐదో సీజన్ కూడా అదే రీతిలో ముందుకు సాగుతోంది. ఇది ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారిపోయింది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవడంతో మిగిలిన ఐదుగురు ఫినాలేకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ వారానికి సంబంధించిన ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉండగా.. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ అధికారిక ఓటింగ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

13 వారాలు.. పదమూడు మంది ఔట్

13 వారాలు.. పదమూడు మంది ఔట్

తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 13 వారాలకు 13 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వలు, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారంలో ప్రియాంక సింగ్‌లు ఎలిమినేట్ అయ్యారు. జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో బయటకు వెళ్లాడు.

 చివర్లో మరింత రంజుగా మార్చేశారు

చివర్లో మరింత రంజుగా మార్చేశారు

బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. వచ్చే వారం లాస్ట్ వీక్ కాగా.. డిసెంబర్ 19న ఫినాలే కూడా జరగబోతుంది. దీంతో నిర్వహకులు నిర్వహకులు చిత్ర విచిత్రమైన టాస్కులతో ముందుకు వస్తున్నారు. గత వారామే టికెట్ టు ఫినాలే ద్వారా శ్రీరామ చంద్ర ఫైనల్‌లో అడుగెట్టాడు. ఇక, ఈ వారం రిప్లే టాస్కును ఇస్తున్న విషయం తెలిసిందే. దీని ప్రకారం.. హౌస్‌లో జరిగిన కొన్ని గొడవలను రీ క్రియేట్ చేస్తున్నారు. అలాగే, కంటెస్టెంట్లకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారని అంటున్నారు. దీంతో ఇది మరింత రంజకంగా మారుతుంది.

 టాప్ 5లో ఎవరు ఉంటారనే ఆసక్తిగా

టాప్ 5లో ఎవరు ఉంటారనే ఆసక్తిగా

ఈ సీజన్ ఫినాలే వీక్‌కు సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆరుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరికి తోచిన పేర్లను వాళ్లు వినిపిస్తున్నారు. అదే సమయంలో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతున్నారు. ఇప్పుడున్న ఆరుగురిలో ఒకరు ఇప్పటికే ఫినాలేకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరు మాత్రం ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.

 14వ వారం నామినేట్ అయిందెవరు

14వ వారం నామినేట్ అయిందెవరు

ఎన్నో అంచనాలతో వచ్చిన ఐదో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తిని పెంచేలా సరికొత్త టాస్కులు కనిపిస్తున్నాయి. కంటెస్టెంట్లు కూడా స్ట్రాటజీలతో ముందుకు వస్తున్నారు. దీంతో నామినేషన్ ప్రక్రియలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో వీలైనంత ఎక్కువ మందినే ఉంచుతూ వస్తున్నారు. ఇక, 14వ వారానికి సంబంధించి ఫినాలే టికెట్ గెలిచిన శ్రీరామ చంద్ర మినహా మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు నామినేట్ అయిన విషయం తెలిసిందే. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఊహించలేని విధంగా ఉంది.

 ఈ వారం ఊహించని ఓటింగ్ అని

ఈ వారం ఊహించని ఓటింగ్ అని

బిగ్ బాస్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్ల అభిమానులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంతో పాటే సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఇక, 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఇందులో మిగిలిన వాళ్లు మాత్రమే ఫినాలేకు చేరుకుంటారు కాబట్టి.. వాళ్ల వాళ్ల అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో పాటు ఓట్లను భారీగా పోలయ్యేలా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్ల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోన్న విషయం తెలిసిందే.

 టాప్ ప్లేస్‌ కోసం ఇద్దరు... అతడిదే

టాప్ ప్లేస్‌ కోసం ఇద్దరు... అతడిదే

14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తోంది. బిగ్ బాస్ వర్గాల నుంచి అందులోన్న సమాచారం ప్రకారం.. ఇందులో ఆరంభం నుంచీ టాప్ ప్లేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు అంటే షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారట. కొద్దిసేపు అతడు.. కొద్దిసేపు ఇతడు టాప్ ప్లేస్‌లో ఉంటున్నారని అంటున్నారు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం వీజే సన్నీనే మొదటి స్థానంలో ఉన్నాడట. అయితే, షణ్ముఖ్‌కు అతడికి ఎంతో తేడా లేదని తెలిసింది. మరి ఈ వారం చివరికి టాప్ ప్లేస్‌లో ఎవరుంటారో చూడాలి.

Recommended Video

Bheemla Nayak : Bheemla Nayak Is Not Releasing To Pongal ? || Filmibeat Telugu
ఎవరి స్థానాలేంటి.. చివర్లో టాపర్

ఎవరి స్థానాలేంటి.. చివర్లో టాపర్

ఈ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో మొదటి రెండు స్థానాల్లో వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ కొనసాగుతుండగా.. మూడో స్థానంలో మాత్రం ఆర్జే కాజల్ ఉందని విశ్వసనీయంగా తెలిసింది. అలాగే, నాలుగో స్థానంలో మానస్ ఉండగా.. చివర్లో టాప్ కంటెస్టెంట్‌గా పేరొందిన సిరి హన్మంత్ ఉందని అంటున్నారు. అయితే, ఈ స్థానాల్లో తరచుగా మార్పులు కూడా వస్తున్నాయట. దీంతో అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ ఫినాలేను తలపించే విధంగా సాగుతోందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X