Bigg Boss 15 promo.. ఓటీటీలో ఆరువారాల ముందే.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా సల్మాన్ రెమ్యునరేషన్
దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎదురే లేకుండా పోతున్నది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ 14 కొద్ది నెలల క్రితం ముగిసింది. ఈ క్రమంలో చిన్న గ్యాప్ ఇచ్చి బిగ్‌బాస్ సీజన్ 15కు ఎండెమాల్ షైన్ ఇండియా రంగం సిద్ధం చేసింది. రంజాన్ పండగను పురస్కరించుకొని షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఆ ప్రోమోకు సంబంధించిన, అలాగే సీజన్ 15 చెందిన విషయాల్లోకి వెళితే...

రంజాన్ కానుకతో సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే... ప్రతీ ఈద్‌కు అభిమానులకు కానుక ఇవ్వడం తెలిసిందే. వచ్చే రంజాన్ పండుగకు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవడంతో బిగ్‌బాస్ 15 రూపంలో గిఫ్ట్‌ను ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ప్రోమోను రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు. ప్రస్తుతం ప్రోమో వైరల్‌గా మారింది.

బిగ్‌బాస్ ఓటీటీలో
బిగ్‌బాస్ 15 సీజన్ విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండెమాల్ షైన్ ఇండియా ప్లాన్ చేస్తున్నది. ఈ షోను ప్రసారం చేయడానికి ప్రత్యేకంగా ఓటీటీని ప్రారంభించడానికి సిద్ధమైంది. బిగ్‌బాస్ 15ను బిగ్‌బాస్ ఓటీటీలో ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ షోను 24 గంటలపాటు ప్రసారం చేయనున్నారు. దాంతో అభిమానులకు మరింత ఉత్సాహంగా మారింది.

ఆగస్టు 8 నుంచి బిగ్‌బాస్ 15
తాజా బిగ్‌బాస్ 15 ప్రోమోలో సల్మాన్ ఖాన్ చేసిన హంగామా భారీ రేంజ్‌లో ఉంది. ఆగస్టు 8వ తేదీన ప్రసారం కానున్న ఈ సీజన్‌కు సంబంధించిన విషయాలను పంచుకొన్నారు. సల్మాన్ ఖాన్ ఆనందంలో మునిగిపోతూ కనిపించారు. మీకు సరిగా అర్ధం కాలేదా.. ఈ సారి మీ మనసులను దోచుకోవడానికి వూట్ ఓటీటీలో బిగ్‌బాస్ వస్తున్నది అంటూ సల్మాన్ కామెంట్ చేశారు.

ఆరు వారాలకు ముందే అంటూ
బిగ్‌బాస్ 15 తాజా సీజన్‌లో ఈసారి నేను సూట్‌లో బూట్‌లో కనిపించడమే కాదు.. మీరు అంతకు ముందు ఓటీటీలో బిగ్‌బాస్‌ను చూడండి. ఈ సారి ఓవర్ ది టాప్ (ఓటీటీ)లో బిగ్‌బాస్ టాప్ లేపుతుంది. బీబీ ఓటీటీ ఆగస్టు 8వ తేదీన ప్రారంభం. ఆరు వారాలకు ముందే టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది అంటూ సల్మాన్ వ్యాఖ్యానించడం కనిపించింది.
సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతంటే
లాక్‌డౌన్‌లో టెలివిజన్ ఇండస్ట్రీ కుదేల్ అయిన సమయంలో కూడా సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బిగ్‌బాస్ షోలో ప్రతీ ఎపిసోడ్‌కు సల్మాన్ ఖాన్ 605 కోట్ల రూపాయలు, వారానికి 13 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోనున్నారు. బిగ్‌బాస్ సీజన్ మొత్తానికి సుమారు 200 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకొనే అవకాశం ఉంది. బిగ్‌బాస్ సీజన్ 15 కోసం 15 శాతం ఫీజును పెంచినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆయన రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











