Bigg Boss: అకస్మాత్తుగా మారిన బిగ్ బాస్ హోస్ట్.. వచ్చేది ఎవరంటే? అతనికేం కొత్త కాదు
అమెరికాలో ప్రారంభమైన బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షోకి మంచి ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఇదే షోని భారతదేశంలో బిగ్ బాస్ పేరిట ప్రారంభించారు. ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఆ తర్వాత అనేక ప్రాంతీయ భాషల్లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే అనేక అంచనాలు, కాంట్రవర్సీల మధ్య తెలుగులోను స్టార్ట్ అయి ప్రస్తుతం ఆరో సీజన్ తో ముందుకు పోతోంది.
ఇక మొట్టమొదటిసారిగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా ప్రస్తుతం 16వ సీజన్ తో దూసుకుపోతోంది. ఈ షోకి సల్మాన ఖాన్ హోస్ట్ గా అదరగొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను మారుస్తున్నారు. అందుకు గల కారణాల్లోకి వెళితే..

చాలా రకాల నెగిటివ్ కామెంట్స్..
ప్రస్తుతం ఎంటర్టైన్ మెంట్ కు అడ్డాగా సినిమాల తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో హవా నడుస్తోంది. ఇటు తెలుగులోనూ.. అటు హిందీలోనూ ప్రసారం అవుతున్న ఈ షో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఈ షోని సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేస్తున్నాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. అయితే హిందీలో బిగ్ బాస్ షో మొదలుపెట్టినప్పుడు చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

సల్మాన్ ఖానే బెటర్ అని భావించి..
ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై కూడా పలు ట్రోలింగ్స్ వచ్చాయి. వాటిని సల్మాన్ ఖాన్ మాత్రం ఎప్పుడు పట్టించుకోలేదు. చాలా పాజిటివ్ గానే తన బాధ్యతను నిర్వర్తించాడు. అయితే మధ్యలో అతని స్థానంలో కొంతమంది వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్లీ సల్మాన్ ఖానే బెటర్ అని నిర్వాహకులు భావించి అతన్నే కొనసాగించారు. ఇక ఇప్పటివరకు 15 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ హిందీ బిగ్ బాస్ షో ప్రస్తుతం 16వ సీజన్ ను విజయవంతంగా దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ సీజన్ కు హోస్ట్ మారనున్నాడు. ఆయన స్థానంలో మరొకరు రానున్నారు. దీనికి సంబంధించిన నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే సల్మాన్ ఖాన్ గత కొద్ది రోజులుగా డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో ఆయన్ను విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. డెంగీ కారణంగా రెండు వారాల పాటు హోస్ట్ గా సల్మాన్ ఖాన్ తప్పుకోనున్నాడు.

కాఫీ విత్ కరణ్ టాక్ షోతో..
సల్మాన్ ఖాన్ స్థానంలో హోస్ట్ గా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ కనిపించనున్నారు. దీనికి సంబందించిన ప్రొమో కూడా వదిలారు. అయితే బిగ్ బాస్ కి కరణ్ జోహార్ హోస్ట్ గా చేయడం కొత్తేమి కాదు. గతేడాది ఓటీటీ వేదికగా ప్రసారమైన బిగ్ బాస్ షోకి కరణే హోస్ట్ గా చేశారు. ఈ షో అప్పుడు వూట్ లో ప్రసారమైంది. అంతేకాకుండా కాఫీ విత్ కరణ్ టాక్ షోతో హోస్ట్ గా కరణ్ సక్సెస్ ఫుల్ అయిన విషయం తెలిసిందే.

ఏకంగా రూ. 1000 కోట్ల పారితోషికం..
ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ హిందీ 16వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ. 1000 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై సల్మాన్ సైతం స్పందించాడు. ఈ వార్తలపై మాట్లాడుతూ ''ఈ బిగ్ బాస్ సీజన్ కోసం నేను రూ.1000 కోట్లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో అయితే ఎలాంటి నిజం లేదు.
కనీసం నాలుగోవంతు కూడా..
ఒకవేళ ఆ విధంగా అంత స్థాయిలో రెమ్యునరేషన్ వస్తే నేను ఇక మరో పని చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు చెప్పిన దాంట్లో నాకు వచ్చేది కనీసం నాలుగోవంతు కూడా లేదు'' అని సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో ఈ వార్తలపై వివరణ ఇచ్చాడు. ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో అలరించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











