భర్తతో ఐశ్వర్య విడాకులు.. విడిపోతున్నామంటూ షాకిచ్చిన స్టార్ కపుల్

టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్ కపుల్స్ ఎప్పుడు విడిపోతారో? ఎప్పుడు కలుస్తారో? ఎవరు ఎవరితో ఉంటారో? అర్ధం కాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు. ఇటీవలి కాలంలో వరుసపెట్టి విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయి. నిత్యం ఎవరో ఒక సెలబ్రెటీ జంట డివోర్స్ తీసుకోబోతున్నారంటూ గాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో కొన్ని నిజం అవుతుండగా.. మరికొన్ని మాత్రం గాసిప్స్‌గానే మిగిలిపోతున్నాయి. తాజాగా ఓ సెలబ్రెటీ కపుల్ విడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

నీల్ భట్ - ఐశ్వర్య శర్మ విడాకులు
హిందీ బుల్లితెర పరిశ్రమలో స్టార్లుగా వెలుగొందుతున్న నీల్ భట్- ఐశ్వర్య శర్మలు విడాకులు తీసుకున్నట్లుగా బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి గురించి విడాకుల పుకార్లు ఇప్పుడే తొలిసారి కాదు.. గత కొన్నేళ్లుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం అధికారికంగానే ఈ జంట విడిపోయినట్లుగా జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. నీల్ భట్ - ఐశ్వర్య శర్మలు అధికారికంగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. త్వరలోనే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణాలు ఏంటన్నది ఇంత వరకు తెలియరాలేదు.

Bigg Boss 17 fame Neil Bhatt and Aishwarya Sharma file for divorce

సీరియల్స్, రియాలిటీ షోలతో పాపులర్
గుజరాత్‌లోని వడోదరాకు చెందిన నీల్ భట్.. కబూమ్ అనే డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు నీల్ భట్. 2023లో హిందీ బిగ్‌బాస్ 17లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నాడు. మర్ద్ కా నయా స్వరూప్, ఘుమ్ హై కిసికే ప్యార్ మైన్ తదితర సీరియల్స్‌తో నీల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మేఘా బర్సెంగే సీరియల్‌లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. సీరియల్స్‌లో పాటు గులాల్, ఫాస్ట్ ఫార్వార్డ్, బన్వార్ తదితర హిందీ సినిమాలలో నీల్ నటించారు.

ఆ సీరియల్ షూటింగ్‌లో ప్రేమాయణం
ఇక ఐశ్వర్య శర్మ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్‌‌లోని ఉజ్జయినికి చెందిన ఈ ముద్దుగుమ్మ కోడ్‌రెడ్ అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత సూర్యపుత్ర కర్ణ, జన్‌బాజ్ సింద్‌బాద్, బాల్ కృష్ణ, మేరి దుర్గా, లాల్ ఇష్క్, ఘుమ్ హై కిసికే ప్యార్ మైన్ తదితర సీరియల్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. స్మార్ట్ జోడి, ఫియర్ ఫ్యాక్టర్: ఖాత్రూన్ కే ఖిలాడీ 13, బిగ్‌బాస్ హిందీ 17లలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఘుమ్ హై కిసికే ప్యార్ మైన్ సీరియల్‌ కోసం పనిచేస్తున్న సమయంలో నీల్‌భట్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో 27 జనవరి 2021న వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగింది. ఆ తర్వాత ఉజ్జయినిలో 2021 నవంబర్ 30న నీల్- ఐశ్వర్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

విడాకుల రూమర్స్‌పై ఐశ్వర్య సీరియస్
వీరిద్దరి కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. బిగ్‌బాస్‌లోనూ జంటగానే పాల్గొన్నారు. అయితే ఆ తర్వాతే వీరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతో నీల్ - ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నట్లుగా ఈ ఏడాది జూన్‌లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఐశ్వర్య మండిపడ్డారు. తాను చాలా రోజులుగా ఈ విషయంపై సైలెంట్‌గా ఉంటున్నానని, అది కేవలం నా ప్రశాంతతను కాపాడుకోవడానికే. నేను అధికారికంగా చెప్పని విషయాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు. నా జీవితం మీకు కంటెంట్ కాదు.. నా మౌనం మీకు అనుమతి ఇచ్చినట్లుగా కాదని.. విడాకులపై నేను ఎలాంటి ప్రకటన చేయలేదని ఐశ్వర్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే ఈసారి ఐశ్వర్య - నీల్‌భట్‌లు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు రావడం, వీటిపై ఇద్దరూ మౌనం దాల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా ఈసారి ఐశ్వర్య శర్మ - నీల్ భట్‌లు అధికారికంగానే విడిపోవడానికి సిద్ధమయ్యారని బీటౌన్ మీడియా అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X