Bigg Boss: బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా గాడిద.. షాకిచ్చిన సల్మాన్ ఖాన్
బిగ్‌బాస్ హిందీ సీజన్ 18 అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో ఈసారి రసవత్తరంగా మొదలై రకరకాల సర్‌ప్రైజ్‌లను అందించి ఆశ్చర్యపరిచారు. తొలి రోజే అనేక ట్విస్టులతో ఈ రియాలిటీ గేమ్ స్టార్ట్ చేశారు. అయితే ఈ వారం సెలబ్రిటీలతోపాటు ఓ గాడిదను కూడా కంటెస్టెంట్‌గా ఇంటిలోకి తీసుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ కంటెస్టెంట్లను తనదైన శైలిలో ఇంటిలోకి ఆహ్వానించారు. మొత్తం 19 మందిని ఇంట్లోకి ఆహ్వనించారు. ఈ జాబితాలో వివియన్ డీ సేన, ఈషా సింగ్, నైరా బెనర్జీ, షెహ్‌జాదా ధామి, అవినాష్ మిశ్రా, అలైస్ కౌశిక్, ముస్కాన్ బామ్నే, కరణ్ వీర్ మెహ్రా, చాహత్ పాండే, శిల్పా శిరోద్కర్, చమ్ దారంగ్, అర్ఫీన్ ఖాన్, సారా అఫ్రీన్ ఖాన్, హేమా శర్మ, శతికా అర్జున్, తాజిందర్ బగ్గా, రజత్ దలాల్, గన్ రత్నా సదావర్తే, గద్ రాజ్ (గాడిద)ను కంటెస్టెంట్లుగా ఆహ్వానించారు.

ఇంటిలోకి గాడిదను ఆహ్వానిస్తూ.. నీవు ఈ షోలోకి రావాలని పిలిచినప్పుడు.. నర్వెస్ అయ్యావా? అని అంటే.. గట్టిగా ఆరించింది. దాంతో నర్వెస్ కాలేదా.. అయితే ఒకే.. ఈ ఇంటిలో నీవు మంచి కంటెస్టెంట్‌గా ఉండాలి. బాగా టాస్కులు ఆడాలి అని సల్మాన్ సూచించాడు. ఎవరైనా నిన్ను ఏదైనా అంటే ఏడ్వ కూడదు అని బుజ్జగించాడు.
అంతేకాకుండా గాడిదతో సల్మాన్ మాట్లాడుతూ.. ఎవరితో గొడవ పడకూడదు. ఎవరితో వాదనకు దిగకు. ముఖ్యంగా మరో విషయం ఏమిటంటే? ఎవరైనా ఏమైనా అంటే చేయెత్తి కొట్టకూడదు. అలా చేస్తే నేను ఎవరినీ సహించను. నిన్ను కూడా సహించను. జాగ్రత్త.. కప్ గెలిచి ఇంటి నుంచి బయటకు రావాలి. ఇక ఇంటిలోకి వెళ్లు అంటూ దానిని హౌస్‌లోకి సాగనంపాడు. అయితే ఈ గాడిదను కంటెస్టెంట్‌గా పంపి ఎలాంటి ఆటను ఆడిస్తాడో వేచి చూడాల్సిందే అంటున్నారు అభిమానలు.
Bigg Boss shuru hone se pehle hi aa gaya ek twist. Kya yeh donkey bhi hai in the participant list? 🫏 🤔
— JioCinema (@JioCinema) October 4, 2024
Watch #BiggBoss18 Grand Premiere 6 October raat 9 baje on @ColorsTV and #JioCinema#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss18 #BiggBoss @BeingSalmanKhan pic.twitter.com/lRvR2ljXjT
బిగ్‌బాస్‌లో ఈసారి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈమె పలు అగ్ర హీరోలతో హిందీ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోదరి. నమత్ర శిరోద్కర్‌కు సోదరి అనే విషయం తెలిసిందే.
Aa gaye hai gharwalon ke saath rehne humare pyaare Gadhraj, dekhenge kaise uthayenge yeh apni awaaz! 🫏
— JioCinema (@JioCinema) October 7, 2024
Dekhiye #BiggBoss18 @ColorsTV aur #JioCinema par.#BB18 #BiggBoss18onJioCinema #BiggBoss @BeingSalmanKhan @Shrutika_arjun pic.twitter.com/vPEJX6lhMy
బిగ్‌బాస్ 18 సీజన్‌ను సోమవారం నుంచి శుక్రవారం వరకు జియో సినిమా యాప్‌లో 10 గంటల నుంచి చూడొచ్చు. శనివారం నుంచి ఆదివారం వరకు వీకెండ్ కా వార్ పేరుతో సల్మాన్ హోస్ట్‌గా నిర్వహించే కార్యక్రమం 9 నుంచి మొదలవుతుంది. ఈ షో స్ట్రిమింగ్‌ను జియో సినిమాతోపాటు కలర్స్‌లో కూడా చూడొచ్చు.


Click it and Unblock the Notifications











