తండ్రిని కావాలనుంది... నా భార్య సహకరించడం లేదు.. హీరో షాకింగ్ కామెంట్స్
పెళ్లయిన తర్వాత ఎంత త్వరగా తల్లిదండ్రులం అవుతామా? అని కొత్త జంట ఎదురు చూస్తుంటుంది. ఏళ్లు గడుస్తున్నా ఆ పిలుపుకు నోచుకోకపోతే ఆ బాధ వర్ణనాతీతం. కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందుల పడేవారు కొందరైతే... కావాలని పిల్లలను కననివారు మరికొందరు. అందం పోతుందనో, లేక కెరీర్‌లో స్థిరపడాలనో.. ఏదో ఒక కారణంతో పిల్లలను ఇప్పట్లో వద్దు అంటారు కొందరు. సినీరంగంలోకి చాలామంది జంటలు ఇదే కోవలోకి వస్తారు. తాజాగా పిల్లలపై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టి ఆవేదన వ్యక్తం చేశారు ఓ నటుడు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమవుతోన్న బిగ్‌బాస్ హిందీ 19 విజయవంతంగా దూసుకెళ్తోంది. అతి త్వరలోనే ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. 18 మంది కంటెస్టెంట్స్‌తో ఆగస్ట్ 24న ఈ సీజన్ మొదలైంది. వీరిలో ప్రస్తుతం 9 మంది ఎలిమినేషన్ అవ్వగా.. 9 మంది హౌస్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో టాప్ 5లో ఉండేవారిలో వినిపిస్తోన్న పేరు గౌరవ్ ఖన్నా. తన ఆటతీరు, మైండ్ గేమ్, వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు గౌరవ్.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన గౌరవ్.. ఇండియన్ పాపులర్ టెలివిజన్ షో సీఐడీలో ఇన్స్‌పెక్టర్ కావిన్‌గా ప్రేక్షకులకు సుపరిచితం. ఆ తర్వాత అనుపమ, యే ప్యార్ నా హోగా కమ్, ప్రేమ్ యే పహేలి చంద్రకాంత, సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా తదితర కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు గౌరవ్. వీటితో పాటు జీవన్ సాథీ.. హమ్‌సఫర్ జిందగి కే, డ్యాన్సింగ్ క్వీన్, దిల్ సే దియా వచన్, క్యా హమారి బహు కా తదితర సీరియల్స్‌తో మహిళా ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు.
బుల్లితెర నటి ఆకాంక్ష చమోలాతో ప్రేమలో పడిన గౌరవ్ ఖన్నా.. ఆమెతో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఓ రోజున ఈ విషయం రివీల్ చేసి ఇండస్ట్రీకి షాకిచ్చారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2016 నవంబర్ 24న కాన్పూర్‌లో ఆకాంక్ష - గౌరవ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లయి దాదాపు 9 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు ఈ జంట గుడ్‌న్యూస్ చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బిగ్‌బాస్ హిందీ 19లో వీకెండ్ వార్ షోలో సెలబ్రిటీ జ్యోతిష్యుడు జై మైదాన్‌ను తాను, తన భార్య ఆకాంక్ష ఎప్పుడు తల్లిదండ్రులం అవుతామని ప్రశ్నించింది. దానికి మైదాన్ స్పందిస్తూ.. ఆమె దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారని చెప్పారు. అయితే తనకు పిల్లలు ఎందుకు కలగలేదు... అన్నదానిపై గౌరవ్ ఖన్నా గతంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం.. కానీ నా భార్యకు మాత్రం ఇప్పటికీ పిల్లలు వద్దు. అయితే ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా అని చెప్పారు.
ఇక గౌరవ్ గుప్తా వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఆకాంక్ష చమోలి స్పందించారు. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు ఆకాంక్ష. నాకు తల్లిని కావాలని లేదు.. భవిష్యత్తులో కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలని లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. బిడ్డకు జన్మనివ్వడం అంటే ఏదో కిచెన్‌లో వంట చేసినట్లు కాదు.. అదో పెద్ద బాధ్యత, దానికి నేను న్యాయం చేయలేను. ఇకపైనా పిల్లలను కనాలని లేదు.. ప్రస్తుతానికి నాకు కెరీరే ముఖ్యమని తేల్చిచెప్పడంతో గౌరవ్ ఖన్నా, బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











