బిగ్‌బాస్ భామకు 150 మంది బాడీగార్డ్స్ ? అసలు విషయం ఇదేనా?

బుల్లితెర ప్రేక్షకులు ఎంతోగానో ఆదరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ (Bigg Boss).. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆలరిస్తుంది. ఇప్పటికే పలు కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొని, ఎనలేని పాపులర్టీ సంపాదించుకున్నారు. అలాగే, బిగ్ బాస్ హిందీ 19 సీజన్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఓ కంటెస్టెంట్ వార్తల్లో నిలిచారు. ఆ బ్యూటీకి ఏకంగా 150 మందికి పైగా బాడీగార్డ్స్ ఉన్నారన్న ప్రచారం నెట్టింట హల్‌చల్ చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఆ కథేంటీ?

ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్‌బాస్ 19 (Bigg Boss) కంటెస్టెంట్ తాన్య మిట్టల్ (Tanya Mittal). నిత్యం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తే ఈ అమ్మడు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ అంశంలో తెగ వైరల్ అవుతోంది. అదేంటో కాదు.. తాన్య మిట్టల్‌కు ఏకంగా 150 మందికి పైగా బాడీగార్డ్స్ ఉన్నారన్న ప్రచారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ప్రచారంపై తాజాగా తాన్య స్పందించారు.

Bigg Boss 19 Fame Tanya Mittal Breaks Silence on 150 Bodyguards Rumours

బిగ్ బాస్ 19లో తనదైన స్టైల్, లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది తాన్య మిట్టల్. ఫైనల్ వరకు వెళ్లి ఈ అమ్మడు మూడో రన్నరప్ గా నిలిచారు. షోలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో హౌస్‌లోనే కాకుండా బయట కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా 'నాకు 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారు', 'టిఫిన్ చేయడానికి దుబాయ్ వెళ్తాను' వంటి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే షో ముగిసిన తర్వాత ఈ రూమార్స్‌కు, తనపై వస్తున్న విమర్శలకు తాన్య ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన ఫ్యాక్టరీని చూపిస్తూ అసలు నిజాన్ని బయటపెట్టారు. 'నేను ఎప్పుడూ 150 మంది బాడీగార్డ్స్ ఉన్నారని చెప్పలేదు. అలాంటి వీడియో గానీ, క్లిప్ గానీ ఎక్కడా దొరకదు. అదంతా కావాలనే సృష్టించిన తప్పుడు ప్రచారం' అంటూ తాన్య స్పష్టంగా చెప్పింది.

అసలు విషయం ఏంటంటే, తాను తన వ్యాపారాల గురించి మాట్లాడుతున్న సమయంలో 150 మందికి పైగా స్టాఫ్ పనిచేస్తున్నారని సరదాగా చెప్పానని వివరించారు. అదే మాటను హౌస్‌మేట్ జైషాన్ ఖాద్రీ జోక్‌గా బాడీగార్డ్స్‌గా మార్చాడని, అక్కడినుంచే ఈ అపోహ మొదలైందని తాన్య తెలిపింది. 'నాకు వ్యక్తిగత భద్రత ఉంది. అది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ, 150 మంది బాడీగార్డ్స్ అన్నది పూర్తిగా అబద్ధం' అని ఆమె క్లారిటీ ఇచ్చారు.

తన సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్‌పై వస్తున్న విమర్శలకు కూడా తాన్య గట్టిగానే స్పందించారు. తాను టెక్స్‌టైల్స్, ఫార్మా, గిఫ్ట్ ఫ్యాక్టరీలు నిర్వహిస్తున్నానని, వాటిలో వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. 'అవన్నీ చూపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను అబద్ధాలు చెప్పానని అనేవారికి నిజం చూపించేందుకే ఈ ఫ్యాక్టరీ టూర్ చేశాను' అంటూ వ్యాఖ్యానించారు.

బిగ్ బాస్ షో తర్వాత తాన్య మిట్టల్ క్రేజ్ మరింత పెరిగింది. స్పిరిచ్యువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమెకు, ఇప్పుడు నటిగా కూడా అవకాశాలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ దక్కినట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. త్వరలోనే తాన్య నటిగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారని సమాచారం.

More from Filmibeat

Read more about: bigg boss tanya hindi bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X