Bigg Boss: బిగ్‌బాస్‌కు లాంచ్ డేట్ ఫిక్స్.. కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే? ఓపెనింగ్ డేకు గెస్ట్‌లు ఎవరంటే?
భారతదేశంలో నెంబర్ వన్ రియాలిటీ షో అంటే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్‌బాస్. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా ఈ షో కోసం ఒక్కచోట చేరుతారు. విదేశాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇండియాలో తొలుత హిందీలో అడుగుపెట్టి.. అక్కడి నుంచి ప్రాంతీయ భాషల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ బిగ్‌బాస్ సీజన్లు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తి
హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తి చేసుకుని త్వరలో 19వ సీజన్ ప్రారంభమయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హిందీ బిగ్‌బాస్ టెలివిజన్ సీజన్ కంటే ముందే బిగ్‌బాస్ ఓటీటీ 4 స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో దానిని రద్దు చేశారు. దీంతో టెలివిజన్ షో కూడా రద్దు అవుతుందనే వార్తలు వైరల్ అయ్యాయి.

నిర్మాతలతో స్ట్రీమింగ్ సంస్థకు విభేదాలు
బిగ్‌బాస్ నిర్మాతలు ఎండెమాల్ షైన్ ఇండియాతో పాటు ప్రసార హక్కులు పొందిన కలర్స్ ఛానెల్‌కు ఒప్పందంపై విభేదాలు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కథనాలు వచ్చాయి. చివరికి కలర్స్ ప్లస్ ఛానెల్ నుంచి బిగ్‌బాస్ ప్రసార హక్కులు సోనీ టీవీకి మారనున్నదనే ప్రచారం కూడా జరిగింది. బిగ్‌బాస్ ఓటీటీ రద్దు కావడంతో టీవీ బిగ్‌బాస్‌ను కాస్త ముందుగానే స్ట్రీమింగ్ చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
హోస్ట్ ఎవరు?
ఎప్పుడు బిగ్‌బాస్ మొదలైనా హోస్ట్ మార్పిడి ఖాయమంటూ గాసిప్స్ రావడం కామన్. అందుకు తగినట్లుగానే హిందీ బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ గురించి కూడా వార్తలు వైరల్ అయ్యాయి. లారెన్స్ బిష్షోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ ఎప్పటిలాగే సల్మాన్ భాయ్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని క్లారిటీ వచ్చింది. ఇక ఈ సీజన్ కోసం అనేక మార్పులు, చేర్పులు కూడా జరుగుతున్నట్లుగా ఇన్‌సైడ్ టాక్. సోషల్ మీడియా స్టార్స్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాట్లుగా తెలుస్తోంది.
బిగ్‌బాస్ 19 ఎప్పుడంటే?
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఆగస్ట్ 3 నుంచి బిగ్‌బాస్ హిందీ 19 ప్రసారం కానుందట. గత సీజన్లను బట్టి చూస్తే ఈసారి బిగ్‌బాస్ చాలా ముందుగానే ప్రారంభమవుతున్నట్లు లెక్క. గతంలో సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ మెగా షో లాంచ్ అయ్యేది. కొత్త సీజన్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలైనట్లుగా బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. ఈసారి కూడా సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టి.. నామినేటైన కంటెస్టెంట్స్‌ని అక్కడ ఉంచుతారు. కొత్త సీజన్‌లో ఎలిమినేషన్స్‌ని టాస్క్‌ల ద్వారా కాకుండా ప్రేక్షకుల ఓటింగ్ బట్టి నిర్ణయిస్తారు. అలాగే కంటెస్టెంట్స్‌కు టాస్క్‌ల ద్వారా మాత్రమే వారపు రేషన్ లభించనుంది. ఇక బిగ్‌బాస్ 19 ప్రారంభోత్సవ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరు కానున్నారని టాక్.
కంటెస్టెంట్స్ వీరేనా?
ఇకపోతే.. బిగ్‌బాస్ హిందీ 19 కంటెస్టెంట్స్‌గా పలువురు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం 14 మందితో కూడిన ఈ లిస్ట్ చూస్తే.. అలీషా పనన్వార్, రాజ్ కుంద్రా, ధీరజ్ ధూపర్, కృష్ణ ష్రాఫ్, ఫ్లయింగ్ బీస్ట్, మున్‌మున్ దత్తా, కనికా మన్, ఫైసల్ షేక్, అపూర్వ ముఖర్జీయా, డైసీ షా, ఖుషీ దూబే, రామ్ కపూర్, అరిష్ఫా ఖాన్, గౌతమీ కపూర్. మరి ఈ లిస్ట్ నిజమేనా? లేక పుకారు మాత్రమేనా? ఆగస్ట్ 3న బిగ్‌బాస్ హిందీ 19 స్ట్రీమింగ్ అవుతుందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











