Bigg Boss: ఈసారి హౌస్‌లో ఆ కాన్సెప్ట్.. డిఫరెంట్‌గా నామినేషన్స్‌‌ ? షాకిచ్చేలా బిగ్‌బాస్ కొత్త రూల్స్!

ఏడాదిలో సగం గడిచిపోవడంతో బిగ్‌బాస్ అన్ని భాషల్లో సందడి మొదలైంది. ప్రధానంగా తెలుగు, హిందీ భాషలపైనే అందరి దృష్టి నెలకొంది. భారీ టీఆర్పీ, వ్యూయర్‌షిప్‌తో ఈ రెండు భాషల్లో బిగ్‌బాస్ దుమ్మురేపుతుంటుంది. నిర్వాహకులు కూడా ఎక్కడా తగ్గకుండా ఏర్పాట్లు, కంటెస్టెంట్స్‌ విషయంలో ఫోకస్ పెడుతుంటారు. దేశంలో అన్నింటి కంటే ముందే బిగ్‌బాస్ హిందీ 19 ప్రారంభం కానుందని మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. మరోసారి సల్మాన్ ఖాన్ తన హోస్టింగ్ స్కిల్స్‌తో దుమ్మురేపనున్నారు.

కంటెస్టెంట్స్ వీరేనా?
ప్రతి ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమయ్యే హిందీ బిగ్‌బాస్ ఈసారి నెల ముందుగానే సందడి చేయనుంది. బిగ్‌బాస్ ఓటీటీ సీజన్‌ రద్దు చేయడమే ఇందుకు కారణం. కంటెస్టెంట్స్‌గా 14 మందితో కూడిన ఈ లిస్ట్ చూస్తే.. అలీషా పనన్వార్, రాజ్ కుంద్రా, ధీరజ్ ధూపర్, కృష్ణ ష్రాఫ్, ఫ్లయింగ్ బీస్ట్, మున్‌మున్ దత్తా, కనికా మన్, ఫైసల్ షేక్, అపూర్వ ముఖర్జీయా, డైసీ షా, ఖుషీ దూబే, రామ్ కపూర్, అరిష్ఫా ఖాన్, గౌతమీ కపూర్‌లను ఎంపిక చేసినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. కానీ తుది జాబితా ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.

Bigg Boss 19 Theme Format And Changes Whats To Expect from Salman Khan s Show

బిగ్‌బాస్ థీమ్ ఏంటంటే?
బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం కాబోతోంది అంటేనే ఎన్నో అంచనాలు, ఉత్కంఠ కామన్. ప్రతిసారి ప్రేక్షకులను అలరించేందుకు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తారు బిగ్‌బాస్ నిర్వాహకులు. తాజాగా బిగ్‌బాస్ హిందీ 19 కోసం మొత్తం ఫార్మాట్‌ను మార్చివేసినట్లుగా చెబుతున్నారు. కంటెస్టెంట్స్, నామినేషన్స్ ప్రక్రియ సహా టాస్క్‌లలో కీలక మార్పులు జరిగినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. అవేంటీ? ఈసారి బిగ్‌బాస్ థీమ్ ఏంటీ? ఏయే కేటగిరీలలో బిగ్‌బాస్ నిర్వాహకులు మార్పులు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ టెలికాస్ట్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ హిందీ 19కు ఈసారి REWIND అనే థీమ్‌ను సెలెక్ట్ చేశారట నిర్వాహకులు. దీని ప్రకారం.. బిగ్‌బాస్ గత సీజన్లను తిరిగి తీసుకురావాలని భావిస్తున్నారట. ఎప్పుడూ బిగ్‌బాస్ టీవీకి ముందు ఓటీటీ వెర్షన్ ప్రారంభమయ్యేది. కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ టీవీ వెర్షన్ 3.5 నెలలు టెలికాస్ట్ అయ్యాక.. ఓటీటీ వెర్షన్ స్ట్రీమింగ్ కానుందని హిందీ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 3 నుంచి బిగ్‌బాస్ టీవీ గ్రాండ్ ప్రీమియర్ ఉంటుందని చెబుతున్నారు.. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Take a Poll

బిగ్‌బాస్‌లోకి మళ్లీ కాన్సెప్ట్
బిగ్‌బాస్ షోకే ఒకప్పుడు ఐకానిక్‌గా ఉన్న సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్నారట. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరు చొప్పున కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసేవారు. ఈసారి మాత్రం ప్రేక్షకులే కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయనున్నారు. హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలో? ఎవరు ఉండాలో ప్రేక్షకులే నిర్ణయించనున్నారు. కంటెస్టెంట్స్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్లు, యూట్యూబ్ స్టార్స్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకురాకూదని ముందు నిర్ణయించారు. అయితే ఈ ఆలోచనను నిర్వాహకులు పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్న కంటెస్టెంట్స్ లిస్ట్‌లో పలువురు సోషల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో వినిపిస్తోన్న మార్పులు ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే?

More from Filmibeat

Read more about: bigg boss salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X