Bigg Boss: అనుకొన్న డేట్ కంటే ముందుగానే బిగ్‌బాస్ షో.. హోస్ట్ మార్పుపై షాకింగ్‌ న్యూస్!

బిగ్‌బాస్ రియాలిటీ షో అంటే దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఫేవరేట్ షో. అత్యంత వివాదాలు, వినోదం కలబోసి ఉండే ఇలాంటి షో కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వాళ్లుంటారు. అయితే ఈ షో గురించి రకరకాల ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి. అయితే వాటన్నింటిని అధిగమించి ఈ షో మొదలు పెట్టడానికి నిర్వాహకులు సంసిద్దమవుతున్నారు. అయితే ఈ షో ప్రారంభానికి ముందే అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆ వివాదాలను పరిష్కరించుకొని రావాల్సిన డేట్ కంటే ముందే ప్రసారం కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ షో ప్రారంభం ఎప్పుడనే వివరాల్లోకి వెళితే...

ఉత్తరాదిలో హిందీలో బిగ్‌బాస్ షో గత 18 సీజన్లు రికార్డు స్థాయిలో పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం 19వ సీజన్ కోసం ముస్తాబవుతున్నది. అయితే ఈ షో కంటే ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సిన బిగ్‌బాస్ ఓటీటీ 4 (Bigg Boss OTT 4) రద్దు చేశారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే బిగ్‌బాస్ 19 కూడా రద్దు అవుతుందనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. దాంతో బుల్లితెర అభిమానులు కంగారు పడిపోయారు.

Bigg Boss 19

బిగ్‌బాస్ రియాలిటీ షో రద్దు వార్త వెనుక కారణానికి ఓ వాస్తవం ఉంది. ఈ షోను నిర్వహించే ఎండెమాల్ షైన్ ఇండియా, ఈ షోను కొన్ని సీజన్లుగా నిర్విరామంగా ప్రసారం చేస్తున్న కలర్స్ వారికి ఒప్పంద విషయాల్లో విభేదాలు నెలకొన్నాయి. దాంతో ఈ షో రద్దు పడటం ఖాయమనే వార్త వినిపించింది. అయితే ఈ షోను టెలివిజన్ సంస్థ మార్పిడి ద్వారా మరో బుల్లితెరకు తరలించారు. కలర్స్ ప్లస్ చానెల్ నుంచి సోనీ టీవీకి మారనున్నదనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

అయితే ఈ రియాలిటీ షో మాత్రం వాస్తవానికి అక్టోబర్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఓటీటీ షో క్యాన్సిల్ కావడంతో ఇంకాస్త ముందుగానే ఈ షోను ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. దాంతో బిగ్‌బాస్ 19 షోను జూన్ చివరి వారంలో గానీ, జూలై మొదటి వారంలో గానీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు సంకేతాలు ఇస్తున్నారు. ఈ మేరకు పింక్ విల్లా వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

అయితే మాఫియా గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్‌కు ముప్పు ఉండటం వల్ల ఈ షోకు హోస్ట్‌ బాధ్యతల నుంచి సల్మాన్ ఖాన్ తప్పుకొంటున్నారనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేసింది. ముంబైలో సల్మాన్ మిత్రుడు, ఎమ్మెల్యే దారుణ హత్యకు గురైన తర్వాత ఆయనకు కూడా బెదిరింపుల లేఖలు వచ్చాయి. దాంతో తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున్న ఈ షో హోస్ట్‌గా తప్పుకోవాలని సల్మాన్ నిర్ణయించారు. కానీ ఎండెమాల్ షైన్ అతడిని ఒప్పించిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, జూన్ లేదా జూలైలో బిగ్‌బాస్ 19ను ప్రారంభించాలని నిర్ణయించుకొన్న నేపథ్యంలో కంటెస్టెంట్ల ఎంపిక ఊపందుకొన్నది. ఈ షో కోసం ఇప్పటికే కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూలు కూడా ముగిసాయి. పలువురు కంటెస్టెంట్ల ఎంపికను ఇప్పటికే పూర్తి చేశారు. వారికి అధికారికంగా సమాచారం అందించాల్సి ఉంటుంది అని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

More from Filmibeat

Read more about: salman khan sony tv Bigg Boss 19
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X