సామ్రాట్‌ను కౌగిలింతతో ముంచెత్తిన గీత.. రైడా చీటింగ్. షూ చూపించిన సునైన!

By Rajababu

బిగ్‌బాస్ హౌస్‌లో 67వ రోజు ఇంటి సభ్యుల మధ్య మిశ్రమ స్పందన వ్యక్తమైంది. బిగ్‌బాస్ కాల్ సెంటర్ టాస్క్‌లో భాగంగా కౌశల్ టీమ్‌కు, తనీష్ జట్టుకు పోటాపోటీగా టెలిఫోన్ గోల సాగింది. టాస్క్ వల్ల రెండు జట్ల మధ్య భారీ స్థాయిలోనే వాగ్వాదం జరిగింది. నూతన్, రోల్ రైడా మధ్య, సమ్రాట్, గీతా మాధురి నడమ కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. అవేమింటంటే..

నూతన్, రైడా వాగ్వాదం

నూతన్, రైడా వాగ్వాదం

కాల్ సెంటర్ టాస్క్‌లో నూతన్ నాయుడు, రోల్ రైడాకు మధ్య భారీగానే వాగ్వాదం జరిగింది. నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలని నూతన్ కోరగా.. నా గల్లీ భాష మాత్రమే వస్తుంది. నాకు నచ్చినట్టుగానే మాట్లాడుతా. ఇష్టమైతే వినండి.. లేదంటే ఫోన్ పెట్టేయండి. నీ భాష మాట్లాడే వారు ఇద్దరు ఉన్నారు. వారికి కాల్ చేయండి అని రోల్ రైడా అన్నారు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu: 67 Day Highlights
గల్లీ అంటూ అవమానం

గల్లీ అంటూ అవమానం

రైడా, నూతన్ మధ్య సంభాషణ ఓ దశలో తీవ్రస్థాయికి వెళ్లింది. గల్లీవాసులను అవమానించే విధంగా మాట్లాడారు. అందుకే ఫోన్ పెట్టేస్తున్నాను అని రోల్ రైడా అన్నాడు. నీవు ఫోన్ పెట్టేశావా అని నూతన్ అడిగితే తనీష్ ఫోన్‌పై పెట్టేసి నేను ఫోన్ మాట్లాడను అని చెప్పేశాడు. కానీ ఫోన్ పెట్టకుండా చీట్ చేయడంపై నూతన్, కౌశల్ సీరియస్ అయ్యారు.

 షూ చూపించిన దీప్తి సునైన

షూ చూపించిన దీప్తి సునైన

ఇక కాల్ సెంటర్ టాస్క్‌లో దీప్తి సునైనా బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. టేబుల్‌పై కాలుపెట్టి అమర్యాదగా ప్రవర్తించింది. ఓ దశలో కాలికి ఉన్న షూస్‌ను చూపించడంతో దీప్తి నల్లమోతు సీరియస్ అయింది. అలాగే కాల్ సెంటర్‌ టేబుల్‌పైనే ప్లేట్‌తో భోజనం చేయడాన్ని కౌశల్ అభ్యతరం వ్యక్తం చేశారు.

కౌశల్ టీమ్ గెలుపు

కౌశల్ టీమ్ గెలుపు

కాల్ సెంటర్ టాస్క్‌లో కౌశల్ టీమ్ 10 పాయింట్లు సాధించగా.. తనీష్ జట్టు 7 పాయింట్లు సంపాదించింది. అత్యధిక పాయింట్లు సంపాదించిన కౌశల్ జట్టును బిగ్‌బాస్ విజేతగా ప్రకటించారు.

గీతా, సమ్రాట్ కెమిస్ట్రీ

గీతా, సమ్రాట్ కెమిస్ట్రీ

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో సామ్రాట్, గీతా మాధురి మధ్య కెమిస్ట్రీ రంజుగానే కనిపిస్తున్నది. లిప్‌స్టిక్ అంటుతున్నదని గీతాను సమ్రాట్ దూరంగా పెట్టారు. దాంతో సునైనా లిప్‌స్టిక్ అంటితే హ్యాపీగా ఫీలయ్యావు. నాది అంటితే దూరం పెడుతున్నావు. అందరికి ఒకే రకంగా ప్రేమను పంచడం లేదు. ఏంటీ ఈ ఫెవరిటిజం అని గీత ఫిర్యాదు చేశారు.

 సమ్రాట్‌ను గీత లిప్‌స్టిక్‌తో

సమ్రాట్‌ను గీత లిప్‌స్టిక్‌తో

గీత అలా అంటూనే సమ్రాట్‌ను కౌగిళ్లతో ముంచెత్తారు. తన మూతికి ఉన్న లిప్‌స్టిక్‌ను శరీరమంతా సామ్రాట్ శరీరంపై రుద్దారు. సామ్రాట్‌ను ఇలా చేయడంతో వారి రొమాంటిక్ మూమెంట్స్‌ ప్రేక్షకులకు రంజుగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X