twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీప్తిని అమ్మా అంటూ అలా చేస్తావా? తనీష్‌పై కౌశల్ ఫైర్.. నామినేషన్‌లో ఆ ఐదుగురు!

    By Rajababu
    |

    Recommended Video

    Bigg Boss SEason 2 Telugu: 92 Day Telugu Highlights

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 92వ రోజు నామినేషన్ల ప్రక్రియతో సాగిపోయింది. నామినేషన్ల సందర్భంగా కౌశల్, తనీష్, దీప్తి, అమిత్ మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. అలాగే సెల్ఫీ పోటీ నిర్వహించారు. ఇంటి సభ్యుల్లో ఈ వారం నలుగురు సభ్యులు నామినేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా, షో చివరి అంకానికి చేరుకోవడంతో సభ్యుల మధ్య పోటి పెరగడంతో ఇంటి వాతావరణం వేడెక్కింది. ఇంకా ఏం జరిగిందంటే..

    వేడెక్కిన ఇంటి వాతావరణం

    వేడెక్కిన ఇంటి వాతావరణం

    ఇంటికి కెప్టెన్ లేకపోవడంతో సభ్యులు తమ పనులను షేర్ చేసుకొన్నారు. ఈ సందర్భంగా కౌశల్, దీప్తి మధ్య వాడి వేడి చర్చ జరిగింది. నేను ఇచ్చిన సలహాలను పాటించి ఉంటే బాగుండేది అని కౌశల్ అనగా.. ఇంట్లో పరిస్థితిని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది అంటూ దీప్తి జవాబిచ్చింది. అలాగే గీతా, సామ్రాట్, తనీష్, రోల్ రైడా మధ్య కూడా ఇదే చర్చ జరిగింది.

    సెల్ఫీ కోసం పరుగులు

    సెల్ఫీ కోసం పరుగులు

    సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఓప్పో సెల్ఫీ గేమ్ జరిగింది. ఓప్పో ఫోన్లను చార్జింగ్ చేసి నాలుగు రకాల ఫోటోలు దిగాలి. అందుకోసం ఇంటిలోని సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోవాలి. ఒక సెల్ఫీలు తీసుకొంటుండగా మరో వర్గం అడ్డుకోవాలి. ఈ గేమ్ ఫిజికల్‌ టాస్క్‌గా చాలా ఆసక్తిగా సాగింది. కౌశల్ గ్రూప్ సభ్యులు విజేతలుగా నిలిచారు.

    నామినేషన్‌లో ఐదుగురు సభ్యులు

    నామినేషన్‌లో ఐదుగురు సభ్యులు

    ఇక ప్రతీ సోమవారం జరిగే విధంగానే నామినేషన్ల ప్రక్రియ జరిగింది. గతంలో గీతా తనకు లభించిన హక్కుతో కౌశల్‌ను ఈ సీజన్ మొత్తానికి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కౌశల్ తర్వాత గీతా, దీప్తి, అమిత్, రోల్ రైడా ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియలో సభ్యుల మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది.

    తనీష్ నీ తీరు బాగాలేదు.. కౌశల్

    తనీష్ నీ తీరు బాగాలేదు.. కౌశల్

    తనీష్‌ను కౌశల్ నామినేట్ చేస్తూ.. కారు టాస్క్‌లో తనీష్ వ్యవహరించిన తీరు సరిగా లేదు. అలాగే కలర్స్ వేసే టాస్క్‌లో కూడా దీప్తితో వ్యవహరించిన తీరు చూడటానికి బాగాలేదు. అమ్మా అంటూనే దీప్తిపై కిందా మీద పడ్డాడు. కారులో ఆమెను తోసేసిన విధం చూడటానికి అసభ్యంగా ఉంది. అమ్మా అంటూ కాకుండా వేరే రిలేషన్ పెట్టుకొని అలా చేయాల్సింది అని కౌశల్ అన్నాడు.

    కౌశల్‌పై తనీష్ సీరియస్

    కౌశల్‌పై తనీష్ సీరియస్

    కౌశల్ చేసిన కామెంట్లతో తనీష్ హర్ట్ అయ్యాడు. ఏంటీ మీరు మాట్లేది. అమ్మ అయిన అక్క అయినా నా గేమ్ అలానే ఉంటుంది. నీవు ఆలోచించే తీరు సరిగా లేదు అని కౌశల్ అన్నాడు. దాంతో వారిద్దరి మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ వ్యవహారంతో దీప్తి కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది.

    English summary
    Bigg Boss 2 92 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 91 days of the game, Shyamala Eliminated from the house. 92nd day nominations happens in the house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X