బాగ్ బాస్ షాక్: జైల్లో బాబు గోగినేని... ఆ నేరం చేసినందుకే శిక్ష!
బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని తనదైన శైలిలో గేమ్ ఆడుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. పలు సందర్భాల్లో బిగ్ బాస్ నిర్ణయాలను సైతం వ్యతిరేకిస్తూ, బాస్ మీద విమర్శలు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అంతా బాగానే ఉంది కానీ బిగ్ బాస్ ఇంటి నిబంధనలు పాటించడంలో బాబు గోగినేని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హౌస్ రూల్స్ పాటించాలని, లేనిచో దాన్ని నేరంగా భావించి శిక్ష విధిస్తామని బిగ్ బాస్ పదే పదే హెచ్చరించినా బాబు గోగినేని చెవిన పట్టడం లేదు. ఇతడితో పాటు మరికొందరు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. దీంతో శుక్రవారం ఇంటి కొత్త కెప్టెన్ బిగ్ బాస్ ఆదేశాల మేరకు శిక్ష విధించారు.

కొత్త కెప్టెన్ రోల్ రైడా
బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్‌గా రోల్ రైడా ఎంపికయ్యారు. ఇంటి సభ్యుల అభిప్రాయాలు సేకరించిన బిగ్ బాస్ రోల్ రైడా, గణేష్, కిరీటిలను కెప్టెన్ పోటీదారులుగా ప్రకటించాడు. ‘బిర్యాని విందు' పోటీ పెట్టి ఎవరు ఎక్కువ మెక్కితే వారే కెప్టెన్ అని సూచించడంతో.... అందరికంటే ఎక్కువ బిర్యానీ తిన్న రోల్ రైడా విజేతగా నిలిచాడు.
Recommended Video


కొత్త కెప్టెన్ తడాఖా
బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్‌గా రోల్ రైడా ఎంపికయ్యారు. ఇంటి సభ్యుల అభిప్రాయాలు సేకరించిన బిగ్ బాస్ రోల్ రైడా, గణేష్, కిరీటిలను కెప్టెన్ పోటీదారులుగా ప్రకటించాడు. ‘బిర్యాని విందు' పోటీ పెట్టి ఎవరు ఎక్కువ మెక్కితే వారే కెప్టెన్ అని సూచించడంతో.... అందరికంటే ఎక్కువ బిర్యానీ తిన్న రోల్ రైడా విజేతగా నిలిచాడు.

జైలు శిక్ష విధించిన బిగ్ బాస్
ఎన్నిసార్లు చెప్పినా పదే పదే రూల్స్ అతిక్రమిస్తున్నందు వల్ల బాబు గోగినేనితో పాటు, తనీష్‌ను జైల్లో పెట్టాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఓ వైపు బిగ్ బాస్ బయటి ప్రపంచంలో బాబు గోగినేని మీద పలు కేసులు నమోదు అవ్వడం, బిగ్ బాస్ ఇంట్లో ఆయన జైల్లో పడటం కాకతాళీయమే అయినా.... ఈ రెండు అంశాల గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

బాబు గోగినేని మీద కేసులు
పౌరుల ఆధార్ వివరాలను బహిర్గతం చేయడం ద్వారా బాబు గోగినేని దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ ఆయనపై కేసు నమోదు కావడం తెలిసిందే. వీరనారాయణ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీసులు బాబు గోగినేనిపై రాజద్రోహం, దేశద్రోహం, నమ్మకద్రోహం, మోసం, మతాల మధ్య వ్యతిరేకతను రెచ్చగొట్టడం లాంటి అభియోగాలతో కేసులు పెట్టారు.

బాబు గోగినేనికి సపోర్టుగా జనవిజ్ఞాన వేదిక
బాబు గోగినేనికి సపోర్టుగా జనవిజ్ఞాన వేదిక శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘బాబు గోగినేనిపై కేసుల వెనుక మతోన్మాద వ్యాపార శక్తులు మాఫియా ఉందని, ప్రజల మూఢ విశ్వాసాలతో వ్యాపారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా బాబు గోగినేని పోరాటం చేయడం వల్లనే ఆయనపై నిరాధారమైన కేసులు పెట్టించారని, బిగ్‌బాస్ షో నుండి బయకు వచ్చాక బాబు గోగినేని పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తారు' అని జనవిజ్ఞాన వేదిక జాతీయ కమిటీ కార్యదర్శి మాదివాడ రామబ్రహ్మం తెలిపారు.


Click it and Unblock the Notifications











