twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ బ్యాన్ చేయాలి.. రాత్రి జరిగిన ఎపిసోడ్ మరీ నీఛం!

    |

    బిగ్ బాస్2 షో చివరి దశకు చేరుకుంటోంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో విమర్శలపాలవుతోంది. బిగ్ బాస్ పై ఆసక్తి పెంచేందుకు నిర్వాహకులు అర్థం పర్థం లేని టాస్క్ లు ఇస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గత రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ షో తీవ్ర వివాదంగా మారుతోంది. కారు టాస్క్ లో ఆడవాళ్ళకి హద్దులు మీరు ప్రవర్తించేలా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

    ఏం జరిగిందంటే

    ఏం జరిగిందంటే

    టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ పోటీ నిర్వహించారు. కారులో ముందుగా వెళ్లి 5 గురు కూర్చుకొవాలి. కారు ఎక్కిన సమయం నుంచి 24 గంటలవరకు కారు లోపలే ఉండాలి. చివరి వరకు ఎవరు కూర్చుంటారో వారే విజేత.

    నిబంధనలు

    నిబంధనలు

    మధ్యలో కారు దిగితే గేమ్ నుంచి తప్పుకున్నట్లే. ఆహారం కూడా కారు లోపలే తినాల్సి ఉంటుంది. చివరి వరకు కారులో ఒకటికన్నా ఎక్కువ సభ్యలు కారులో ఉంటే పోటీ రద్దవుతుంది. గంటల తరబడి కారులో కూర్చోలేక తరువాత గీత మాధురి ముందుగా దిగేసింది.

    దీప్తిపై బలప్రయోగం

    దీప్తిపై బలప్రయోగం

    పోటీలో గెలిచేందుకు తనీష్, సామ్రాట్.. శ్యామల, దీప్తిపై బలప్రయోగం చేశారు. ఈనేపథ్యంలో తనీష్.. దీప్తి పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తనీష్ తన బలాన్నంతా ఉపయోగించి కారులోనుంచి కిందకు తోసేశాడు. ఈ నేపథ్యంలో తనీష్.. దీప్తి గొంతు పట్టుకోవడం, ఆమెపై దారుణంగా ప్రవర్తించడం విమర్శలు చెలరేగేలా చేస్తోంది.

     నిర్భయ చట్టం

    నిర్భయ చట్టం

    బస్సుల్లో, రైళ్లలో మహిళపై జరుగుతున్న వేధింపులని, లైంగిక దాడుల్ని ఆపడం కోసమే నిర్భయ చట్టం వచ్చిందని గ్లోబల్ ఎయిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయి పద్మ అన్నారు. గత రాత్రి బిగ్ బాస్ 2 లో చూపించిన ఘటనలు పైశాచికమని ఆమె అభిప్రాయపడ్డారు.

    మహిళలపై

    మహిళలపై

    ఇలాంటి దృశ్యాలు చూపిస్తున్నారంటే మహిళలపై దాడులు చేయండి అని ఉసిగొల్పడమే అని పద్మ అభిప్రాయ పడ్డారు. ఆ ఉద్దేశం లేనప్పుడు దీప్తిపై తనీష్ దాడి చేస్తుంటే బిగ్ బాస్ ఎందుకు ఆపలేదని ఆమె ప్రశ్నించారు.

    బలహీనులపై

    బలహీనులపై

    తమకంటే బలహీనంగా ఉన్న వారిపై దాడి చేసి పోటీలో గెలవాలనుకోవడం సభ్యత కాదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ ద్వారా తనీష్, సామ్రాట్ గౌరవం కోల్పోయారని నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు.

    English summary
    Bigg Boss 2 became controversy yesterday episode. Tanish and Samrat attack on Deepthi and Shyamala
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X