నిజమా? శివ బాలాజీ భార్యకు బిగ్ బాస్ 2 ఛాన్స్?

బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ భార్య మధుమితకు బిగ్ బాస్ 2లో అవకాశం దక్కిందట.ఇటీవలే ఆమెను బిగ్ బాస్ ప్రతినిధులు సంప్రదించినట్లు సమాచారం.

By Bojja Kumar

ఎన్టీఆర్ హోస్ట్‌గా తెలుగులో ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 14 మంది పోటీ పడగా.... శివ బాలాజీ విజేతగా నిలిచాడు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 2 కూడా ప్రారంభం కాబోతోంది.

బిగ్ బాస్ 2 ఇంకా మొదలు కాకపోయినా.... కొన్ని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 2లో శివ బాలాజీ భార్య మధుమిత పాల్గొనబోతోందంటూ ప్రచారం మొదలైంది. ఇటీవలే ఆమెను బిగ్ బాస్ ప్రతినిధులు సంప్రదించారు. అయితే ఈ విషయమై ఇటు మాటీవీ నుండిగానీ, బిగ్ బాస్ నిర్వాహకుల నుండిగానీ, మధుమిత నుండి కానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.

అలా అవకాశం ఇస్తారా?

అలా అవకాశం ఇస్తారా?

సాధారణంగా బిగ్ బాస్ షోలో ఒకసారి పాల్గొన్నవారికి మరో అవకాశం ఉండదు. అయితే ఒకే కుటుంబం నుండి ఇద్దరికి అవకాశం ఇస్తారా? అందులోనూ భార్య భర్తలైన వారికి అవకాశం దక్కుతుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

డాన్స్ షోలో సందడి చేస్తున్న శివ బాలాజీ-మధుమిత

డాన్స్ షోలో సందడి చేస్తున్న శివ బాలాజీ-మధుమిత

ప్రస్తుతం శివ బాలాజీ-మధుమిత జంట ‘నీతోనే డాన్స్' అనే రియాల్టీ షో చేస్తున్నారు. రేణు దేశాయ్, జానీ మాస్టర్, అదా శర్మ న్యాయ నిర్ణేతలుగా రన్ అవుతున్న ఈ షోలో వీరు ఈ వారాంతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

వారికి అదే ప్లస్ పాయింట్

వారికి అదే ప్లస్ పాయింట్


శివ బాలాజీ, మధుమిత ఇద్దరూ యాక్టర్లే. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ డాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ఇదే వీరికి ప్లస్ పాయింట్. అందరి కంటే బాగా చేస్తే వీరు ఈ రియాల్టీ షో విన్నర్స్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

పోటీ దారుల్లో టెన్షన్

పోటీ దారుల్లో టెన్షన్

శివ బాలాజీ, మధుమిత వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. వారి రాకతో ‘నీతోనే డాన్స్' కార్యక్రమంలో టెన్షన్ వాతావరణం ఉన్నట్లు కనపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X