మానసిక, భయోత్పాతమైన వాతావరణం... గాజులు తొడుక్కోలేదు: నూతన్ నాయుడు

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Day 45 Highlights

ఎలిమినేట్ అయిన వారు మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం దొరకడంతో... నూతన్ నాయుడు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం సోషల్ మీడియాను విరివిగా వాడుకుంటున్నారు. నూతన్ నాయుడికి ఓటు వేయాలని వందలాదిగా వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూఫులు క్రియేట్ కావడమే ఇందుకు నిదర్శనం. నూతన్ నాయుడికి కౌశల్ ఆర్మీ నుండి కూడా మద్దతు లభిస్తోంది. తనను మళ్లీ ఇంట్లోకి పంపించాలని ప్రేక్షకులను వేడుకుంటూ నూతన్ లైవ్ చాట్ సైతం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అపుడు టైమ్ వేస్ట్ అయింది, ఈ సారి దూసుకెళతాను

అపుడు టైమ్ వేస్ట్ అయింది, ఈ సారి దూసుకెళతాను

మనో బలానికి భగవత్ సంకల్పం తోడైనట్లు ఈ రోజు మళ్లీ నాకు బిగ్‌బాస్ షోలోకి ఎంటరయ్యే అవకాశం దక్కింది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో టైమ్ వేస్ట్ అయింది. ఆరోగ్యం సరిగా లేక వెనకబడి పోయాను. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడను, ముందుకు దూసుకెళతాను... అని నూతన్ నాయుడు తెలిపారు.

 తప్పుడు మనుషులకు అండగా ఉండను

తప్పుడు మనుషులకు అండగా ఉండను

అందరూ అంటున్నారు నూతన్ నాయుడు సైలెంట్, క్లాస్, న్యూట్రల్, జాగ్రత్తగా, పాజిటివ్ గా ఉంటారని... అవును నేను అదేరకం. కానీ ఎప్పుడూ తప్పు చేయను. తప్పుడు మనుషులకు అండగా నిలవను. మంచికి నిలబడతాను, నీతికి నిలబడతాను. నిజాయితీకి నిలబడతాను, అలాంటి వ్యక్తినైన నన్ను మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లోకి పంపుతారని ఆశిస్తున్నాను.

మాస్ మహారాజా లాగా అలరిస్తాను

మాస్ మహారాజా లాగా అలరిస్తాను

నన్ను అంతా మాస్‌గా ఉండాలని అంటున్నారు. తప్పకుండా అలా నన్ను నేను మలుచుకుంటాను. నాలోని మాస్ ఏంటో చూపిస్తాను. మాస్ మహారాజా లాగా మీ అందరినీ నేను అలరించగలను అని ఫీలవుతున్నాను. బిగ్‌బాస్ లో చాలా పర్టిక్యులర్ స్ట్రాటజీస్ ఉంటాయి. చాలా సైకలాజికల్ టెస్టులు పెడతారు. అక్కడ ఎన్విరాన్మెంట్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా వాటిని తట్టుకుని ముందుకు సాగుతాను.

కౌశల్ ఆర్మీ సపోర్ట్ స్వీకరిస్తున్నాను

కౌశల్ ఆర్మీ సపోర్ట్ స్వీకరిస్తున్నాను

కౌశల్ ఆర్మీ చేస్తున్న సహాయానికి సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. మీరంతా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే... ఇక్కడ కొన్ని డయల్యూషన్ మెకానిజమ్స్ జరుగుతున్నాయి. కౌశల్ ఆర్మీసపోర్టు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను.

భయోత్పాతమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు

భయోత్పాతమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు

బిగ్‌బాస్ ఇంట్లో కౌశల్‌ను ఒక్కడిని చేసి ఆడుకుంటున్నారు, అనవసరంగా కార్నర్ చేస్తున్నారు. గుడ్లు కొడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నారు, పరుష పదజాలం వాడుతున్నారు. మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. భయోత్పాతమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. నా స్నేహితుడికి అండగా నిలవాలనుకుంటున్నాను.

 గాజులు తొడుక్కుని కూర్చోలేదు

గాజులు తొడుక్కుని కూర్చోలేదు

కౌశల్ ద్వారా ఇంత పెద్ద ఆర్మీ మనకు తయారవుతోంది. మనం ఒక కుటుంబంలా ఉండాలనుకుంటున్నాం. మనం గాజులు తొడుక్కుని కూర్చోలేదని మరోసారి నిరూపిద్దాం. అతడి స్నేహితుడినైన నన్ను ఇంట్లోకి పంపడం ద్వారా కౌశల్ ఆర్మీ పవర్ ఏమిటో చూపిద్దాం... అంటూ నూతన్ నాయుడు వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X