కూతురైతే ఇలా చేస్తారా, ఆయనేమైనా మహేష్ బాబా?.... బాబు గోగినేనిపై సంజన ఫైర్
Recommended Video

బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన మిస్ హైదరాబాద్ సంజన అన్నే బాబు గోగినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పైకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని, ఆయనలో జనాలకు తెలియని మరో కోణం ఉందని ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో బాబు గోగినేని తన పట్ల ప్రవర్తించిన తీరును సంజన ఎండగట్టారు. తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంచన బాబు గోగినేని అసలు రూపం ఇదే అంటూ ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు.

తన కూతురైతే ఇలాగే చేస్తారా?
ఫస్ట్ డే నేను జైల్లోకి వెళ్లినపుడు ఆ రోజు రాత్రి నన్ను బయటకు తీసుకురావాలని ఇంటి సభ్యులంతా డిసైడ్ అయ్యారట. అయితే ఉదయం బాబు గోగినేని సంజనను వద్దు, నూతన్ నాయుడును బయటకు తీసుకురావాలని చెప్పడంతో ఆయనకు అందరూ సపోర్ట్ చేశారు. ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే బాబు గోగినేని దారుణంగా ప్రవర్తించారు. ఆయన కూతురైతే ఇలాగే వదిలేస్తారా? అంటూ సంజన ఫైర్ అయ్యారు.

ఆడపిల్లపై జాలి లేదు...నువ్వేం మనిషివి?
నేను అరిచానా; గొడవ చేశానా? అనేది వేరే విషయం... అక్కడ ఒక ఆడ పిల్ల జైల్లో ఉంది. ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే సపోర్ట్ చేస్తాను. మహిళపై కొంచెం కూడా జాలి లేకుంటే నువ్వేం మనిషివి? అలాంటి మనిషి గురించి మాట్లాడటం కూడా దండగే... అంటూ సంజన అసహనం వ్యక్తం చేశారు.

డబ్బులు తీసుకునే వచ్చారు, ఆయనో డబ్బు మనిషి
బాబు గోగినేని డబ్బులు తీసుకోకుండా బిగ్ బాస్ ఇంట్లో పని చేయడం లేదు. డబ్బులు తీసుకునే ఈ రియాల్టీ షోకు వచ్చారు. ఆయన డబ్బు మనిషి, డబ్బు కోసం డాన్సులు వేస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు, నటన చేస్తున్నారు, ఇంప్రెస్ చేస్తున్నారు... అంటూ సంజన విమర్శఇంచారు.

నీకు వ్యాల్యూస్ ఉన్నాయా?
మన వ్యాల్యూస్ మనం పోగొట్టుకోకూడదు, మనం ఫైట్ చేయాలి, విప్లవం చేయాలి అంటూ మాట్లాడుతున్న ఆయనకే విలువలు లేవు. ఆయనది డాన్స్ చేయాల్సిన వయసా? నువ్వు డాన్స్ ఎందుకు చేస్తున్నావు? పక్కనున్నోడిని ఇంప్రెస్ చేయడానికే కదా.... అంటూ సంజన ఫైర్ అయ్యారు.

నేను మసాజ్ చేయమంటే ఓవరాక్షన్ చేశాడు
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారు ఇలాంటివి చేయాలి కదా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సంజన తనదైన రీతిలో స్పందించారు. అలాంటపుడు నేను మసాజ్ చేయమని అడిగితే దాన్ని ఎందుకు తప్పుగా ప్రచారం చేశారు, హైప్ ఎందుకు తీసుకొచ్చారు? అది నేను ఇచ్చిన టాస్క్, బిగ్ బాస్ ఇంట్లో అవన్నీ చేస్తున్నపుడు ఇది కూడా చేయాలి. కానీ నేను చేయను, విప్లవం సృష్టిస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అని ఓవరాక్షన్ చేయడం ఎందుకు? బిగ్ బాస్ ఇంట్లో టాస్క్ లు అన్నీ చేయడానికే కదా వచ్చింది.... మరి నేను చెప్పినట్లు మసాజ్ ఎందుకు చేయలేదు? ఎందుకు నాతో వాదించారు? అని సంజన మండి పడ్డారు.

నాకు సిగ్గు చెప్పడానికి ఆయన ఎవరు?
ఆయనే విప్లవం అంటున్నారు, సంజనకు బుద్ది రావాలి, సంజన సిగ్గు తెచ్చుకోవాలి అంటున్నారు... ఆయనెవరండీ నాకు సిగ్గు చెప్పడానికి? ముందు ఆయన్ను తెచ్చుకోమనండి, తర్వాత పక్కనోళ్లకు చెప్పాలి... అని సంజన చిటపటలాడారు.

ఆయనేమైనా మహేష్ బాబా?
ఆయనలాగా మనసులో ఏదో పెట్టుకుని పగ పెంచుకోవడం నాకు తెలియదు. ఆయన పేరు నేను ఎప్పుడూ నామినేట్ కూడా చేయలేదు. నాకు ఒక గేమ్ ఇచ్చారు, బిగ్ బాస్ చెప్పినట్లు గేమ్ ఆడాను. మేము యజమానులుగా ఉన్నపుడు సేవకులకు పని చెప్పాను. వారు సరిగా చేయకపోతే అన్ లైక్ ఇవ్వొచ్చు, అపుడు స్కోరు తగ్గిపోతుంది. బాబు గోగినేనితో డాన్స్ వేయించాం. ఆయన చేయరు అనుకున్నాం కానీ చేశారు. మసాజ్ చేయమన్నాం...ఆయన ఎలాగూ చేయరు, అందుకే 8 మంది అన్ లైక్ పెట్టాము. అంతే తప్ప ఆయనతో మసాజ్ చేయించుకుని హ్యాపీగా ఫీలవ్వడానికి ఆయనేమైనా మహేష్ బాబా ఏమిటి? ఆయన ఏజ్ ఎక్కడ? నా ఏజ్ ఎక్కడ?... అని సంజన అన్నారు.

ఆయన మనస్తత్వం అలాంటిది
విప్లవం అన్నారు, హక్కులు అన్నారు..... నేను ఏదైనా మాట్లాడితే జైలు నుండి వచ్చిన సంజన కూడా మాట్లాడుతుంది అంటూ నాపై కామెంట్స్ చేశారు. అంటే నాకు మాట్లాడే హక్కులేదా? ఆయన చెప్పినట్లు వినాలి, ఆయన ముందు చేతులు కట్టుకుని కూర్చోవాలి. అదే ఆయనకు కావాల్సింది. అవి నాకు చేతకాదు, అందుకే బయటకు వచ్చేశాను.


Click it and Unblock the Notifications











