బిగ్‌బాస్ నుంచి నూతన్ అవుట్.. కౌశల్, దీప్తిపై బిగ్‌బాంబ్.. గీతా మాధురి నోట్లో సామ్రాట్ కారం!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 86 Highlights...!

బిగ్‌బాస్ రియాలిటీ షో 86వ రోజు ముగిసింది. దాదాపు ఈ షో క్వార్టర్ ఫైనల్ స్థాయికి చేరుకోవడంతో రానున్న 20 రోజులు పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. ఈ వారం డబుల్ నామినేషన్ కావడంతో గణేష్, నూతన్ నాయుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శనివారం ఎపిసోడ్‌లో నామినేట్ అయిన గణేష్ నానితో కలిసి వేదికపై మాట్లాడాడు. అనంతరం ఇంటిలో సరదా సరదగా ఆటలు ఆడిన తర్వాత నాని ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఇంతకీ ఇంట్లో ఏం జరిగిందంటే..

లైఫ్ నేర్చుకొన్నా

లైఫ్ నేర్చుకొన్నా

ఆదివారం ఎపిసోడ్ ప్రారంభం కావడంతోనే గణేష్‌ను వేదికపైకి తీసుకొచ్చారు. తన బిగ్‌బాస్ జర్నీ చూసిన తర్వాత గణేష్ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఓ జీవితాన్ని నేర్చుకొన్నాను అని అన్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడాడు. కౌశల్ బిగ్‌బాంబ్ వేశాడు.

కౌశల్‌పై గణేష్ బిగ్‌బాంబ్

కౌశల్‌పై గణేష్ బిగ్‌బాంబ్

బిగ్‌బాంబ్ ప్రకారం కౌశల్ ప్రతీ రోజు నేలపైనే పడుకోవాలి. వచ్చే శనివారం వరకు ఈ బాంబ్ ప్రభావం ఉంటుంది. అనంతరం నానితో సెల్ఫీ దిగి బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దాంతో బిగ్‌బాస్ ఇంట్లో గణేష్ జర్నీ ముగిసింది.

ఇంట్లో సరదాగా ఆటలు

ఇంట్లో సరదాగా ఆటలు

ఆదివారం గేమ్‌లో భాగంగా నాని ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఎప్పుడు క్లాస్ పీకే నాని ఈ సారి వారితో సరదాగా ఆటలు ఆడించారు. కౌశల్ కళ్లకు గంతలు కట్టి రోల్ రైడాకు మహిళలకు వేసే వేషాన్ని వేయించారు. ఆ ప్రక్రియ చాలా సరదాగా సాగింది.

అమిత్, శ్యామల కళ్లకు గంతలు

అమిత్, శ్యామల కళ్లకు గంతలు

అనంతరం అమిత్-శ్యామల కళ్లకు గంతలు కట్టుకొని ఐస్ క్రీమ్ తినిపించుకొనే గేమ్ ఆడారు. ఒకరిపై మరొకరు ఐస్ క్రీమ్ వేసుకోవడంతో ఇంటి సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు. సామ్రాట-గీత, దీప్తి-నూతన్ నాయుడు ఇలాంటి సరదా ఆటలు జరిగాయి.

ఎలిమినేషన్‌ ప్రక్రియలో సామ్రాట్

ఎలిమినేషన్‌ ప్రక్రియలో సామ్రాట్

ఇంటిలో సరదాగా ఆటలు ముగిసిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అమిత్, సామ్రాట్, నూతన్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలుత సమ్రాట్‌ను ప్రొటెక్టెడ్ జోన్లోకి నాని పంపించండంతో అమిత్, నూతన్ మిగిలారు.

నూతన్ మరోసారి అవుట్

నూతన్ మరోసారి అవుట్

అమిత్‌ను ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించి నూతన్‌ను ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నాడు. నూతన్ ఇంటి సభ్యులను అప్యాయంగా పలుకరించి ఇంటి నుంచి నిష్క్రమించి బిగ్‌బాస్ వేదికపైకి వెళ్లారు. ఇలా నూతన్ ఎలిమినేట్ అయి వేదికపైన మాట్లాడటం రెండోసారి.

నూతన్ యూనిక్ జర్నీ

నూతన్ యూనిక్ జర్నీ

బిగ్‌బాస్ వేదికపై నూతన్ మాట్లాడుతూ బిగ్‌బాస్‌లో నా జర్నీ యూనిక్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మానవ జీవితంలో గెలుపు, ఓటములు సాధారణం. వాటిని ఎలా సానుకూలంగా మార్చుకోవాలి అనే విషయంపై దృష్టిపెట్టాలి అని నూతన్ అన్నారు. అనంతరం నానితో సెల్ఫీ దిగి బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X