బిగ్‌బాస్‌లో ఉండేదవరు? ఊడేదెవరు? దీప్తి సునైనాకు మూడినట్లేనా?

By Rajababu

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతూ మరోస్థాయికి వెళ్తున్నది. ఇప్పటికే సగం షో పూర్తవ్వగా సెలబ్రీటీల మధ్య దూకుడు మరింత ఉధృతమైంది. శనివారం నుంచి ఆదివారం వరకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ఈసారి నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా మారాయి. ఈ వారం టాప్ సెలబ్రిటీలే నామినేషన్‌లో ఉండటం వలన బిగ్‌బాస్ మరింత ఇంట్రెస్ట్‌గా మారింది.

 10వ వారంలో నామినేషన్లు

10వ వారంలో నామినేషన్లు

పదవ వారంలో బిగ్‌బాస్‌ను వదిలి వెళ్లే వారి జాబితాలో గీతా మాధూరి, రోల్ రైడా, దీప్తి సునైనా, పూజా రాంచంద్రన్, శ్యామల, నూతన్ నాయుడు ఉన్నారు. వీరిలో నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై ప్రేక్షకుల్లో పెద్ద చర్చ జరుగుతుంది.

నూతన్ నాయుడు అర్ధాంతరంగా

నూతన్ నాయుడు అర్ధాంతరంగా

బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్‌లో ఉన్న నూతన్ నాయుడు అనూహ్యంగా, అర్ధాంతరంగా నిష్క్రమించాడు. కెప్టెన్ టాస్క్‌లో భాగంగా ఆడుతుండగా నూతన్ భుజానికి తీవ్రగాయమైంది. షోల్డర్ క్రిటికల్‌గా డిస్ లొకేట్ కావడంతో నూతన్‌ను చికిత్స కోసం బయటకు పంపించారు.

Recommended Video

Bigg Boss Season 2 Telugu: 67 Day Highlights
 దీప్తి, పూజాపై ఎలిమినేషన్ కత్తి

దీప్తి, పూజాపై ఎలిమినేషన్ కత్తి

బిగ్‌బాస్ ఇంటిలో గీతా మాధురి, రోల్ రైడా, శ్యామల బలమైన అభ్యర్థులుగా ఉన్నారు. మిగిలిన శారిలో దీప్తి సునైనా, పూజా రాంచంద్రన్‌పై కత్తి వేలాడుతున్నది. వీరిలో ఎవరైనా ఎలిమినేట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

 దీప్తి సునైనా ప్రవర్తనపై ఆగ్రహం

దీప్తి సునైనా ప్రవర్తనపై ఆగ్రహం

పూజా రాంచంద్రన్ కంటే దీప్తి సునైనానే ఎలిమినేట్ ముప్పు వెంటాడుతున్నది. బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్దంగా నిద్రించడంతో ఈ వారం శిక్ష కూడా పడింది. కాల్ సెంటర్ టాస్క్‌లో కంప్యూటర్ ముందే కూర్చొని భోజనం చేయడం, కాళ్లు టేబుల్ పెట్టి నీచంగా, చాలా దురుణంగా ప్రవర్తించడం చాలా మంది ప్రేక్షకులకు రుచించలేదు.

 దీప్తి సునైనాకు ముడినట్టేనా?

దీప్తి సునైనాకు ముడినట్టేనా?

అంతేకాకుండా, కాల్ సెంటర్ టాస్క్‌లో అభ్యంతరకమైన భాషను ఉపయోగించడం కూడా దీప్తి సునైనాకు మైనస్‌గా మారింది. అలాగే కౌశల్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన ముఖంపై ఉమ్మి వేయడం కూడా ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొంటే దీప్తి సునైనాకు ఈవారం మూడినట్టే అనే మాట బలంగా వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X