బిగ్ బాస్2: ఎలిమినేషన్ ఉత్కంఠ.. ఆరుగురిలో వాళ్లిద్దరూ సేఫ్, బయటకు వెళ్ళేది ఎవరంటే!
బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ఉత్కంఠ నెలకొంది. ఈ వారం ఎవరు బయటకు వెళతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో కంటే ఈ వరం ఎలిమినేషన్ పై ఆడియన్స్ లో ఎక్కువ ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పొచ్చు ఎందుకంటే నామినేట్ అయి ఉన్నవారందరూ పెర్ఫామెన్స్ లో ఆరితేరినవాళ్ళే. ఈ నేపథ్యంలో కౌశల్ ఆర్మీ గురించి కూడా ఆసక్తిగా చర్చ జరుగుతోంది.

నామినేట్ అయిన వారు
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బాబు గోగినేని, తనీష్, దీప్తి, గణేష్, శ్యామల, గీత నామినేట్ అయి ఉన్నారు. వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లో పెర్ఫామెన్స్ ఇరగదీస్తున్నవారే. హౌస్ లోనుంచి బయటకు వచ్చేది ఎవరో ఈ వీకెండ్ లో తేలిపోయింది.

వాళ్లిద్దరూ సేఫ్
శ్యామల ఇటీవలే హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి ఆమె ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. గీత మదురిపై ఎలాంటి రిమార్స్క్ లేవు. ఆడియన్స్ ఆమెపై మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. దీనితో వీరిద్దరూ ఈ వారం సేఫ్ అనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఆ లెక్కన
గతవారం హౌస్ నుంచి నందిని మహిళ ఎలిమినేట్ అయింది. అందులోనూ ప్రస్తుతం హౌస్ లో పురుషుల కంటే మహిళలు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ వారం మహిళల ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే దీప్తి కూడా సేఫ్ అయినట్లే.

అదృష్టం అడ్డం తిరిగితే
ఇక హౌస్ లో గణేష్ ప్రతి వారం నామినేట్ అవుతున్నాడు. ఎక్కువగా గణేష్ ఆడియన్స్ దృష్టిలో పడడం లేదు. కాబట్టి గణేష్ పై ఆడియన్స్ లో మంచి అభిప్రాయం కానీ, చెడు అభిప్రాయం కానీ లేవు. ప్రతి వారం అదృష్టం కొద్దీ గణేష్ ఎలిమినేషన్ నుంచి బయటపడుతున్నాడు. అదృష్టం అడ్డం తిరిగితే గణేష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కత్తి అతడిపైనే
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బాబు గోగినేని పేరు బలంగా వినిపిస్తోంది. ఆడియన్స్ లో బాబుపై వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో కౌశల్ ఆర్మీ కూడా బాబుని టార్గెట్ చేసింది. దీనితో బాబు గోగినేని బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తనీష్ కు ఇప్పటికైతే వచ్చిన నష్టం లేదని అతడి ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











