అన్నపూర్ణ స్టూడియో వద్ద కౌశల్ ఆర్మీ రచ్చ, భారీగా పోలీస్ బందోబస్తు!

బిగ్‌బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలె ఆదివారం ఎపిసోడ్‌తో ఈ రెండో సీజన్ రియాల్టీ షోకు తెరపడనుంది. వివిధ భాషల్లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సీజన్ 2లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి షోలో కంటెస్టెంటుగా ఉన్న కౌశల్ తరుపున ఆయన అభిమానులు 'కౌశల్ ఆర్మీ'గా ఏర్పడి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున కాంపెయిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. కౌశల్‌కు మద్దతుగా 2కె రన్‌ ఈవెంట్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం సైతం అందరూ ఆశ్చర్య పడేలా చేసింది. అయితే బిగ్ బాస్ ఫైనల్ సమీపించిన తరుణంలో బిగ్ బాస్ సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియో వద్ద కౌశల్ ఆర్మీ రచ్చ చేయడం హాట్ టాపిక్ అయింది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Koushal Talks About The Show
రాత్రి పూట 300 మంది కౌశల్ అభిమానులు

రాత్రి పూట 300 మంది కౌశల్ అభిమానులు

ఆదివారం ప్రసారం అయ్యే గ్రాండ్ ఫినాలె షోకు సంబంధించి ఎపిసోడ్ శనివారం రాత్రి షూట్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే దాదాపు 300 మంది కౌశల్ అభిమానులు బిగ్ బాస్ సెట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని.... కౌశల్ కౌశల్ అంటూ బిగ్గరగా నినాదలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ గోడలకు కౌశల్ విన్నర్ అంటూ పోస్టర్లు అంటించినట్లు సమాచారం.

షూటింగ్ నిలిపివేత

షూటింగ్ నిలిపివేత

కౌశల్ అభిమానులు రచ్చ ప్రారంభించడంతో శనివారం రాత్రి జరుగాల్సిన బిగ్ బాస్ తెలుగు 2 గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్ షూట్ వాయిదా వేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం నుండి ఈ షూట్ మొదలైనట్లు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా పోలీసులు

అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా పోలీసులు

కౌశల్ అభిమానుల అత్యుత్సాహం నేపథ్యంలో నిర్వాహకులు పోలీసుల సహాయం కోరినట్లు తెలుస్తోంది. దీంతో అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా పోలీసుల బందోవస్తు పెట్టారు. కౌశల్ అభిమానులు కానీ, ఇతర కంటెస్టెంట్స్ అభిమానులు ఎవరూ స్టూడియో లోనికి రాకుండా ఈ ఏర్పాటు చేశారట.

విన్నర్ ఎవరో బయటకు పొక్కకుండా

విన్నర్ ఎవరో బయటకు పొక్కకుండా

బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ ఎవరు? అనేది ఈ రోజు రాత్రి ప్రసారం అయ్యే షోలో తేలనుండి. అయితే ఈ విషయం ముందే బయటకు పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. విన్నర్ ఎవరు అని ప్రకటించే ఎపిసోడ్ రహ్యంగా చిత్రీకరించబోతున్నారని. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దాన్ని చిత్రీకరిస్తారని టాక్.

 కౌశల్ విన్నర్ అంటూ జోరుగా ప్రచారం

కౌశల్ విన్నర్ అంటూ జోరుగా ప్రచారం

అయితే బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ అని... అతడికే అత్యధికంగా ఓట్లు వచ్చాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గీతా మాధురి రన్నరప్‌గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఇది నిజమా? కదా? అనేది ఆదివారం సాయంత్రం ప్రసారం అయ్యే షోలో తేలనుంది. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు గ్రాండ్ ఫినాలె షో ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X