బిగ్ బాస్ 2కి బిగ్ షాక్, టీఆర్పీ రేటింగ్‌లో ఎన్టీఆర్ రికార్డు పదిలం.. వెనుకబడ్డ నాని!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Nani Faces Criticisms On Anchoring

జూన్ 10 న అంతా ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ 2 ఘనంగా ప్రారంభమైంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ కావడంతో బిగ్ బాస్ 2 సీజన్ పై సర్వత్రా ఆసక్తిని నెలకొని ఉంది. ఎన్టీఆర్ తరహాలో నాని ఆకట్టుకుంటాడా లేదా అనే ఉత్కఠతో అభిమానులంతా ఈ షో కోసం ఎదురుచూసారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో తొలివారం ముగిసేసరికి ఒక ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది.

సంజన బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలసిందే. ఇదిలా ఉండగా నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో పై కాస్త నెగిటివ్ ప్రచారం కూడా ఉంది. దీనికి తోడు తాజాగా విడువులైన టిఆర్పి రేటింగ్స్ బిగ్ బాస్ టీంకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.

 అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు నాని

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు నాని

బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో బిగ్ బాస్ షోకి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణే లభించింది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న రెండవ సీజన్ కూడా మంచి అంచనాలతో ప్రారంభమైంది.

బిగ్ బాస్ 2 కి బిగ్ షాక్

బిగ్ బాస్ 2 కి బిగ్ షాక్

తాజగా విడువులైన టిఆర్పిరేటింగ్స్ లో బిగ్ బాస్ 2 సీజన్ కు షాక్ తగిలిందని చెప్పొచ్చు. అంచనాలకు తగ్గట్లుగా తొలివారం ఈ షో రేటింగ్స్ సాధించలేకపోయింది. షో ఓపెనింగ్ రోజు 15.05 రేటింగ్ వచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తొలిసీజన్ ఓపెనింగ్ రోజు 16.18 రేటింగ్ రావడం విశేషం.

ఎన్టీఆర్ రికార్డు పదిలం

ఎన్టీఆర్ రికార్డు పదిలం

తొలివారం టిఆర్పి రేటింగ్స్ విషయంలో బిగ్ బాస్ తొలి సీజన్ కంటే రెండవ సీజన్ వెనుకబడిందని చెప్పొచ్చు. వీక్ డేస్ బిగ్ బాస్ 2 షో సగటున 7.93 రేటింగ్ సాధించింది. బిగ్ బాస్ తొలి సీజన్ తొలివారంలో 9.24 రేటింగ్ రావడం విశేషం. హోస్ట్ గా ఎన్టీఆర్ తన రికార్డుని పదిలం చేసుకున్నాడు.

 వెనుకబడ్డ నాని

వెనుకబడ్డ నాని

నాని హోస్టింగ్ పై జనాల్లో కొంత నెగిటివిటి కూడా ఉంది. అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ఆ అంచనాలు అందుకునే విధంగా ప్లాన్ చేసుకోవడంలో బిగ్ బాస్ టీం విఫలం చెందింది.

 మాసాలకే ప్రాధాన్యత

మాసాలకే ప్రాధాన్యత

ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎక్కువగా మసాలాకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రియాలిటీ షోలో నటిస్తున్నారని భావన కలుగకూడదు. కానీ ఆ విషయంలో చాలామంది కంటెస్టెంట్స్ తేలిపోయినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 సంజన ఎలిమినేషన్

సంజన ఎలిమినేషన్

సంజన ఎలిమినేషన్ కూడా షోకి అంతగా ప్లస్ కాలేకపోయింది. సంజన ప్లేస్ లో నందిని రాయ్ హౌస్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. రెండవ వారం రేటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X