Don't Miss!
- News భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్‌బాస్ నుంచి గణేష్ ఔట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. రెండో వ్యక్తి ఎవరంటే!
బిగ్‌బాస్‌లో వీకెండ్ కావడంతో నాని అడుగుపెట్టాడు. ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని షాకిచ్చాడు. సాధారణంగా ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. కానీ శనివారం ఒక ఎలిమినేషన్, ఆదివారం రెండో ఎలిమినేషన్ ఉంటుంది అని నాని చెప్పడంతో శనివారం ఆటపై ఆసక్తి కలిగింది. ఏన్నో వారాలు ఎలిమినేషన్ కింగ్‌గా పేర్కొంటున్న కామన్ గణేష్ అందరూ ఊహించినట్టే ఇంటి నుంచి బయటకు వెళ్లడం జరిగింది. శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.
గీతా, కౌశల్ గొడవ
శనివారం ఎపిసోడ్ ప్రారంభం కాగానే గీతా పడుకోవడంతో కుక్కలు మొరిగాయి. దాంతో నిద్ర నుంచి లేచి ఏదో అనబోగా.. వెంటనే కౌశల్ మాటలు అందుకొన్నాడు. బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేయనని చెప్పి ఎలా పడుకొంటారు అని కౌశల్ నిలదీశాడు. దాంతో వారి మధ్య గొడవ జరిగింది.
కంటతడి పెట్టిన గీత
కౌశల్ నన్ను ఎందుకు సాధిస్తాడు అని గీతా మాధురి కంటతడి పెట్టింది. తనకు సంబంధం లేకున్నా ఏదో కల్పించుకొని వచ్చి నన్ను సూటి పోటి మాటలు అంటుంటాడు అని కన్నీళ్లు పెట్టుకొంది. గీతా మాధురిని తనీష్, గణేష్, అమిత్ ఓదార్చాడు.
నూతన్‌కు డబుల్ ధమాకా
ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటిలో ఒక సభ్యుడికి ఏ సభ్యుడు మద్దతుగా ఉంటాడో చెప్పాలని సూచించాడు. శ్యామల పేరును గీతా మాధురి, తనీష్ పేరును సామ్రాట్, నూతన్ పేరును కౌశల్ , కౌశల్ పేరును నూతన్, నూతన్ పేరును దీప్తి చెప్పారు. నూతన్ ఒక్కడికే రెండు ఓట్లు రావడం గమనార్హం.
బోనులో పెట్టి ప్రశ్నలు
ఆ తర్వాత నాని ఇంటి సభ్యులను కలిశాడు. కొన్ని కార్డులు ఇచ్చి ఇంట్లో సభ్యుడిపై కొన్ని ఆరోపణలు చేసి కార్డుపై రాయమన్నాడు. అలా ఒక్కొక్కరు చేసిన ఆరోపణలను ఆధారంగా వారిని బోనులో పెట్టి ప్రశ్నలు అడిగారు. ఎవరికి తోచినట్టుగా వారు తమ సమాధానాలు ఇచ్చారు.
ఎలిమినేషన్ నుంచి కౌశల్ సేఫ్
చివర్లో ఇంటి సభ్యులతో ఎలిమినేషన్ ప్రక్రియను నాని ప్రారంభించాడు. ముందుగా కౌశల్‌ను ఎలిమినేషన్ నుంచి రక్షిస్తూ ప్రొటెక్షన్ జోన్లోకి పంపాడు. దాంతో కౌశల్ ఊరట చెందడంతోపాటు సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
హౌస్ నుంచి గణేష్ అవుట్
ఎలిమినేషన్ ప్రక్రియలో గణేష్ పేరును చెబుతూ ప్యాక్ యువర్ బ్యాగ్ అని చెప్పడంతో ఆయన కంగుతిన్నాడు. కాసేపు ఏం జరిగిందో అర్థం కానీ షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఇంటి సభ్యులతో కాసేపు మాట్లాడి సెల్ఫీ దిగాడు. అనంతరం ఇంటి నుంచి నిష్క్రమించాడు.
గణేష్‌తో రేపు బిగ్‌బాంబు
శనివారం ఎపిసోడ్ పూర్తి కావడంతో వేదికపైన గణేష్ జర్నీ చూపించలేకపోతున్నాను. ఆదివారం ఎపిసోడ్లో గణేష్ ఎలిమినేషన్, బిగ్‌బాంబు ప్రక్రియను కొనసాగిస్తానని నాని సెలవు తీసుకొన్నాడు. దాంతో శనివారం ఎపిసోడ్ గణేష్ ఎలిమినేషన్‌తో ముగిసింది.