Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్ బాస్2: ఇదేమి టాస్క్ బాబోయ్.. తన్నుకుంటున్న తనీష్, అమిత్!
Recommended Video
బిగ్ బాస్ షోలో ఇక ఫైనల్స్ కు రంగం సిద్ధం అయిపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీలు, ఎలిమినేట్ అయి మళ్ళీ హౌస్ లోకి తిరిగి వచ్చిన వాళ్ళు ఇక ఎవరూ లేరు. ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారంతా మొదటి రోజు నుంచి ఉన్నవారే. ఆదివారం రోజు శ్యామల ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఇక ఏడు మంది మాత్రమే మిగిలారు. మరి కొద్ది రోజుల్లోనే ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ లోపు ఇక ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.
కొత్త టాస్క్
సోమవారం జరగబోయే ఎపిసోడ్ రసవత్తరంగా సాగనుంది. ఓ విభిన్నమైన టాస్క్ ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చారు. టాస్క్ పేరు ఫుల్లీ ఛార్జ్డ్ అప్. తాజగా విడుదల చేసిన ప్రోమో ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన్నుకునేలా
ప్రోమో చూస్తుంటే ఇంటి సభ్యులు దేని కోసమో తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు మీదపడి పోట్లాడుకుంటున్నారు. తనీష్, అమిత్ ఇద్దరూ బలప్రయోగం చేసుకుంటున్నారు. ఈ వ్యయప్రయాసలన్నీ దేనికోసమో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
మిగిలింది వాళ్లే
శ్యామల ఎలిమినేట్ కావడంతో ఇక హౌస్ లో మిగిలింది 7 గురు సభ్యులు మాత్రమే. కౌశల్, తనీష్, గీత మాధురి, సామ్రాట్, దీప్తి, రోల్ రైడ, అమిత్ హౌస్ లో ఉన్నారు. ఫైనల్స్ కు చేరే సమయానికి ఇంటిలో 5 గురు సభ్యులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది.
గట్టి పోటీ
టైటిల్ బరిలో కౌశల్, గీత, తనీష్ హాట్ ఫెవరెట్స్ గా ఉన్నారు. దీప్తి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఇక సీజన్ మొత్తానికి నామినేట్ అయి ఉండడం కౌశల్ కు ప్రతికూలాంశం అయితే, అతడికి ఆడియన్స్ నుంచి మద్దత్తు లభిస్తుండడం అనుకూలాంశం. గీత, తనీష్ లని కూడా తక్కువగా అంచనా వేయలేం.
ఈవారం ఎవరు
ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయినా కూడా ఆడియన్స్ లో ఎలిమినేషన్ గురించి ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవేళ అమిత్, రైడ, సామ్రాట్ లలో ఎవరైనా నామినేట్ అయితే వారు ఎలిమినేట్ కావడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.