బిగ్‌బాస్‌ షోలో కలకలం.. శ్యామల ఔట్.. రూల్స్‌కు విరుద్దంగా ముందే లీక్!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 27,28 Highlights | Emotional Elimination

బిగ్‌బాస్ రియాలిటీ షో అంటే అత్యంత సీక్రెట్‌కు పెట్టింది పేరు అని నిర్వాహకులు చెప్పుకొంటారు. అందులో జరిగిన విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. పలు రకాల సర్‌ప్రైజ్‌లను ఇస్తూ ప్రేక్షకులకు థ్రిల్ చేస్తుంటారు. అలాంటి షోకు సంబంధించిన నమ్మకాన్ని వొమ్ము చేస్తూ ఓ వార్త మీడియాలో వైరల్ కావడం సంచలనం రేపింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం జరిగే ఎలిమినేషన్ జరిగే ఇంటి సభ్యురాలు పేరు ముందే బయటకు రావడం షోకు సంబంధించిన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అయితే ఇంతకు అది నిజమా? లేక ఇంటర్నెట్‌లో తుంటరి పిల్లలు సృష్టించిన కలకలమా అనే విషయం కొద్ది గంటల్లో తేలనున్నది.

ఎలిమినేషన్‌లో ఉంది వీరే

ఎలిమినేషన్‌లో ఉంది వీరే

శనివారం ఎపిసోడ్‌లో కామన్‌ మ్యాన్‌ గణేశ్‌, సింగర్‌ గీతా మాధురి ప్రొటెక్ట్‌ జోన్‌లోకి వెళ్లినట్టు హోస్ట్‌ నాని ప్రకటించాడు. కౌశల్‌, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ, గణేశ్‌, గీతా మాధురిలు ఇలా ఎక్కువ సంఖ్యలో నామినేట్‌ అవ్వడంతో ఎవరు బయటకు వెళ్లారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఎలిమినేట్ అయ్యానని శ్యామల

ఎలిమినేట్ అయ్యానని శ్యామల

అయితే తాను బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాను అని యాంకర్ శ్యామల ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టినట్టు ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోను చూసి బుల్లితెర ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతకీ శ్యామల పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్టు వచ్చినదేమిటంటే..

ఇంటికి తిరిగివచ్చానని శ్యామల

ఇంటికి తిరిగివచ్చానని శ్యామల

నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ నా థ్యాంక్స్. ఇంటికి తిరిగి వచ్చాను. ఇషాన్‌తో ఆడుకొంటున్నాను. నాకు అండగా నిలిచిన అందరికీ ప్రేమతో అభినందనలు తెలియజేసుకొంటున్నాను అని యాంకర్ శ్యామల అకౌంట్‌లో పోస్ట్ కనిపించింది.

కనుమరుగైన యాంకర్ శ్యామల పోస్ట్

కనుమరుగైన యాంకర్ శ్యామల పోస్ట్

ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ యాంకర్ శ్యామల అకౌంట్‌లో నుంచి కనుమరుగైంది. అప్పటికే దానిని స్క్రీన్ షాట్స్ తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అది వైరల్‌గా మారింది. దీంతో శ్యామల ఎలిమినేషన్ వ్యవహారం చర్చనీయాంశమైంది.

శ్యామల పోస్టులో వాస్తవమా?

శ్యామల పోస్టులో వాస్తవమా?

యాంకర్ శ్యామల పేరుతో చేసిన పోస్టులో వాస్తవమెంత అనే విషయంపై అనేక అనుమానాలు తలెత్తాయి. కావాలనే కొందరు ఈ పోస్టు సృష్టించారా లేదా నిజంగా శ్యామల దానిని పోస్టు చేశారా అనే అంశంపై క్లారిటీ లభించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X