తెరపైకి మిడ్‌వీక్ ఎలిమినేషన్: బిగ్‌బాస్ 2 నుండి నేడు ఒకరు ఔట్?

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Midweek Elimination Goes Viral In Social Media

ఈ వారాంతంతో బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షో ముగియబోతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విన్నర్ ఎవరు? అనేది ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలెలో తేలిపోనుంది. అయితే ఆదివారం వరకు ఎలాంటి షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగక పోవచ్చు అని అంతా అనుకుంటున్న తరుణంలో.... ఎవరూ ఊహించని విషయం ప్రచారంలోకి వచ్చింది. బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏమైనా జరుగవచ్చు అంటూ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే కొత్త కాన్సెప్టు బిగ్ బాస్ తెరపైకి తెచ్చారట. అందులో భాగంగా నేడు(సెప్టెంబర్ 27)న ఒకరిని ఇంటి నుండి అర్దాంతరంగా ఎలిమినేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో...

ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో...

ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఐదుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. కౌశల్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి నల్లమోతు, తనీష్... ఈ ఐదుగురిలో ఒకరు గురువారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో బయటకు పంపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎందుకు ఇలా?

ఎందుకు ఇలా?

ఉన్నట్టుండి బిగ్ బాస్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎందుకు పెట్టినట్లు? అంటే.... బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో నలుగురు మాత్రమే పోటీ పడేలా నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగా తక్కువ ఓటింగ్ ఉన్న ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు పంపబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.

విషయం బయటకు ఎలా లీకైంది?

విషయం బయటకు ఎలా లీకైంది?

అసలు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ విషయం బయటకు ఎలా లీకైందో తెలియడం లేదు. ఈ అంశం మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా బిగ్ బాస్ నిర్వాహకులే దీన్ని లీక్ చేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది అంతు పట్టడం లేదు.

ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆవిడే అంటూ ప్రచారం

ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఆవిడే అంటూ ప్రచారం

మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటకు వెళ్లేది మరెవరో కాదు.... దీప్తి నల్లమోతు అనే ప్రచారం జోరందుకుంది. మరి ఇందులో నిజం ఎంత? అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఉంటుందా? ఈ రోజు రాత్రి ప్రసారం అయ్యే షో ఫాలో అయితే తప్ప చెప్పలేం.

దీప్తి గురించి వరుస వివాదాలు

దీప్తి గురించి వరుస వివాదాలు

మరో వైపు దీప్తి నల్లమోతు గురించి రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వివాదాలు నడుస్తున్నాయి. ఆమెకు ఫేక్ ఓటింగ్ వేయిస్తున్నారనే ఆరోపణలు సైతం వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎవరైనా దీప్తి మీద కావాలని చేస్తున్న ప్రచారమే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ డ్రామా అయి ఉంటుందా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X