బిగ్ బాస్2: చిత్ర విచిత్రం.. తలపట్టుకున్న తనీష్.. గణేష్, కౌశల్ సేవ్.. ఉహించని విధంగా నామినేషన్!

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోలో ఇంటి సభ్యుల టైటిల్ వేట మొదలైంది. బిగ్ బాస్ 2 లోనే అంతంత్య కీలకమైన ఎపిసోడ్ సోమవారం జరిగిందని చెప్పొచ్చు. నిర్ణయం తీసుకోవడానికి అంత్యంత కఠిన పరిస్థితుల మహ్య నిన్న నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఊహించని విధంగా ఆరుగురు ఇంటి సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య తనీష్ తన కెప్టెన్సీ బాధ్యతలని నిన్న నిర్వర్తించారని చెప్పొచ్చు.

వారిద్దరూ స్పెషల్

వారిద్దరూ స్పెషల్

నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో తనీష్, అమిత్ కు మినహాయింపు లభించింది. తనీష్ కెప్టెన్ కాబట్టి, అమిత్ కు ప్రత్యేక రక్షణ కవచం ఉంది కాబట్టి బిగ్ బాస్ ఈ అవకాశాన్ని వారిద్దరికీ కల్పించారు.

 న్యాయ నిర్ణేతలుగా

న్యాయ నిర్ణేతలుగా

ఎలిమినేషన్ టాస్క్ లో తనీష్, అమిత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. మిగిలిన ఇది సభ్యులంతా ఇద్దరిద్దరుగా విడిపోయి నామినేషన్ లో పాల్గొన్నారు. వారి జంటలో ఎవరు నామినేట్ కావాలో ఎవరు సేవ్ కావాలో ఇద్దరూ కారణాలు చెప్పాల్సి ఉంటుంది. తుది నిర్ణయం తనీష్, అమిత్ తీసుకుంటారు.

 పూజ నామినేటెడ్

పూజ నామినేటెడ్

పూజ, సామ్రాట్ జంటగా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సామ్రాట్ మొదటి నుంచి హౌస్ లో ఉంటూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడనే ఉద్దేశంతో తనీష్ అతడిని సేవ్ చేశాడు. పూజ నామినేట్ అయింది.

మీ ముందు నేనెంత

మీ ముందు నేనెంత

నామినేషన్ ప్రక్రియలో గీత, కౌశల్ జంటగా పాల్గొన్నారు. తాను అన్నింటిలో ఉత్సాహంగా పాల్గొంటున్నానని కాబట్టి తాను సేవ్ కావాలని కౌశల్ కోరుకున్నాడు. గీత మాధురి హౌస్ లోకి రాకముందు నుంచే ఆమెకు అభిమానులు ఉన్నారు. ఆమె పాపులారిటీతో పోల్చుకుంటే తాను చాలా చిన్న అని కౌశల్ తెలిపాడు. దీనికి గీత స్పందిస్తూ మీ అనుభవం ముందు నేను ఎంత అని సమాధానం ఇచ్చింది.

 విచిత్రంగా కౌశల్ సేవ్

విచిత్రంగా కౌశల్ సేవ్

బిగ్ బాస్ హౌస్ లో తరచుగా కౌశల్, తనీష్ మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. కౌశల్ బిహేవియర్ ని చూపిస్తూ తనీష్ అతడిని నామినేట్ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. విచిత్రంగా తనీష్ కౌశల్ ని సేవ్ చేశాడు. గీత నామినేట్ అయింది.

 అనూహ్యం

అనూహ్యం

ప్రతి వారం నామినేట్ అవుతూ వచ్చిన గణేష్ ఈ వారం సేవ్ అయిపోయాడు. గతంలో తనని సేవ్ చేశాడనే కృతజ్ఞతతో రోల్ రైడ తనని తాను సెల్ఫ్ నామినేట్ చేసుకుని గణేష్ ని కాపాడాడు. బిగ్ బాస్ 2 మొదలైన తరువాత గణేష్ నామినేట్ కాని వారం ఇదే అని చెప్పొచ్చు. గణేష్ కు నాని నామినేషన్ స్టార్ అని కూడా బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే.

నూతన్ నామినేటెడ్

నూతన్ నామినేటెడ్

నూతన్ నాయుడు, దీప్తి జంటగా పాల్గొన్నారు. తనీష్ దీప్తిని సేవ్ చేసి నూతన్ నాయుడుని నామినేట్ చేయడం విశేషం. అశేషమైన అభిమానుల మద్దత్తుతో మీరు మళ్ళీ హౌస్ లోకి వచ్చారు. అదే అభిమానులు మిమ్మల్ని నామినేషన్ నుంచి సేవ్ చేస్తారని భావిస్తున్నట్లు తనీష్ తెలిపాడు.

 శ్యామల సేవ్

శ్యామల సేవ్

శ్యామల, సునైనా జంటగా పాల్గొన్నారు. తనీష్ శ్యామలని సేవ్ చేసి, దీప్తిని నామినేట్ చేశాడు. సునైనా,శ్యామల ఇచ్చిన వివరణ విన్న అనంతరం తనీష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

తనీష్ దిమ్మతిరిగేలా

తనీష్ దిమ్మతిరిగేలా

నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిసిందని అనుకున్న సమయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తనీష్ నీకు కెప్టెన్ గా ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి సేవ్ అయిన ఇంటి సభ్యులలో ఒకరిని నామినేట్ చేయాలి అని ఆదేశించాడు. తనీష్ తల పట్టుకున్నంత పనైంది. దీనిని చాలా కఠిన నిర్ణయంగా తనీష్ భావించాడు.

శ్యామల నామినేటెడ్

శ్యామల నామినేటెడ్

బిగ్ బాస్ ఆదేశం మేరకు శ్యామలని తనీష్ నామినేట్ చేశాడు. అభిమానుల మద్దత్తుతో ఆమె హౌస్ లోకి వచ్చిందని, అదే మద్దత్తు నామినేషన్ లో కూడా ఆమెకు ఉంటుందని నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకున్నానని తనీష్ తెలిపాడు.

ఈ వారం నామినేషన్

ఈ వారం నామినేషన్


దీనితో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిసింది. ఈవారం పూజ, గీత, రోల్ రైడ, సునైనా, నూతన్, శ్యామల నామినేట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X