బిగ్‌బాస్ దెబ్బకు సామ్రాట్ గడ్డం, మీసం ఔట్.. తేజస్వికి షాక్.. గణేష్ గ్రేట్.. పాపం దీప్తి!
Recommended Video

తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షో రోజు రోజుకు కొత్త టాస్క్‌లతో రచ్చ రచ్చగా మారుతున్నది. మంగళవారం (జూలై 9న) నాటి ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ నిర్వహించాడు. టెలిఫోన్ బూతు పెట్టి ఆటను మరింత రక్తి కట్టించాడు. సెలబ్రిటీల మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా సామ్రాట్ రెడ్డి మీసాలు, గడ్డాన్ని సమర్పించుకోవడం జరిగింది. ఎంతకీ ఏమి జరిగిందంటే...

తేజస్వికి బిగ్‌బాస్ షాకిచ్చాడు.
సోమవారం ఉదయమే ఇంటి ఆవరణలో ఉన్న టెలిఫోన్ బూత్‌లో బెల్ మోగింది. ఉత్సాహంతో వెళ్లి ఫోన్ లేపిన తేజస్వికి బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఈ వారం మీరు నామినేట్ అయ్యారు. ఒకవేళ మీరు నామినేషన్ నుంచి బయటపడాలంటే సామ్రాట్ క్లీన్ షేవ్ చేసి గడ్డం, మీసాలు తీసేయాలి అని తేజస్వికి బిగ్‌బాస్ సూచించారు.

సామ్రాట్ తన గడ్డాన్ని, మీసాలను
సామ్రాట్ పిలిచి బిగ్‌బాస్ చెప్పిన విషయాన్ని తేజస్వి చెప్పింది. దాంతో సామ్రాట్ తన గడ్డాన్ని, మీసాలను తీసేసి క్లీన్ అయ్యాడు. దాంతో వెంటనే తేజస్విని నామినేషన్ నుంచి తప్పించుకొన్నది. వెంటనే బయటకు వచ్చి సామ్రాట్‌ను కౌగిలించుకొన్నది.

బాబు గోగినేని రెండు కట్టల కోత్తి మీర
ఆ తర్వాత గణేష్‌ను బిగ్‌బాస్ నామినేట్ చేశాడు. అయితే నామినేషన్ నుంచి బయటపడాలంటే బాబు గోగినేని రెండు కట్టల కోత్తి మీర తినాలి. అలా తినకపోతే నామినేట్ అవుతావు అని గణేష్‌కు బిగ్‌బాస్ సూచించాడు. గణేష్‌ను నామినేషన్ నుంచి తప్పించడానికి బాబు కొత్తిమీర తిన్నాడు.

దీప్తి నల్లమోతును బిగ్‌బాస్ నామినేట్
గణేష్ తర్వాత దీప్తి నల్లమోతును బిగ్‌బాస్ నామినేట్ చేశాడు. నామినేషనల్ నుంచి తప్పుకోవాలంటే కౌశల్ ఈ సీజనంతా తనను తాను నామినేట్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని నందిని చేత కౌశల్‌కు చెప్పగా అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ వారం దీప్తి నామినేట్ అయింది.

తేజస్విని దుప్పటిని
ఈవారం గీతా మాధురిని బిగ్‌బాస్ నామినేట్ చేశాడు. ఒకవేళ తేజస్విని తనకు ఇష్టమైన దుప్పటిని ముక్కలు ముక్కలుగా కత్తిరిస్తే నామినేషన్ నుంచి బయటపడుతావు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ విషయాన్ని తేజస్వినికి చెప్పగా ఆమె తనకు ఇష్టమైన దుప్పటిని ముక్కలు ముక్కలు చేసి గీతాను నామినేషన్ నుంచి తప్పించింది.

జుట్టు కత్తిరించుకొన్న దీప్తి సునైన
ఆ తర్వాత తనీష్ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. దీప్తి సునైన జుట్టు కత్తిరించుకొంటే నామినేషన్ నుంచి తప్పించుకొంటావు. లేకపోతే నామినేట్ అయిపోతావు అని సూచించాడు. అయితే కొంత తటపాటాయించిన దీప్తి.. తనీష్ కోసం జుట్టు కత్తిరించుకొన్నది. దాంతో నామినేషన్ నుంచి తనీష్ బయటపడ్డాడు.

బాబు కోసం గీతామాధురి ట్యాటు
బాబు గోగినేని నామినేషన్ ప్రక్రియలో మంచి ట్విస్ట్ ఉంచాడు. బిగ్‌బాస్ ట్యాటును పర్మనెంట్‌గా వేయించుకోంటే నామినేషన్ నుంచి ఫ్రీ అవుతావు. లేదంటే నామినేట్ అవుతావు. అదే విషయాన్ని గీతా మాధురికి చెప్పగా.. బాబు గోగినేని కోసం ట్యాటూ వేసుకొన్నది. దాంతో బాబు గోగినేని నామినేషన్ నుంచి తప్పించుకొన్నాడు.

గణేష్ స్వయంగా నామినేట్
రోల్ రైడా కోసం గణేష్ నామినేట్ స్వయంగా నామినేట్ చేసుకోవడం అద్భుతమైన విషయంగా కనిపించింది. ఇంట్లో వీక్ కంటెస్టెంట్ అయిన గణేస్ ఈ సాహాసానికి ఒడిగట్టడం అందర్నీ ఆకట్టుకొన్నది. వారం పాటు పండ్లు మాత్రమే తినడం కాకుండా స్వయంగా నామినేట్ చేసుకోవడంతో ఈ వారం గణేష్ బలమైన అభ్యర్థిగా మారాడు.

అమిత్ కోసం రోల్ రైడా
అమిత్ నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించడానికి రోల్ రైడా తన జుట్టును సమర్పించుకోవాల్సి వచ్చింది. తలకు రెండు వైపుల జట్టును షేవ్ చేసుకొని ఎర్రటి రంగును వేసుకొన్నాడు. దాంతో ఈ వారం అమిత్ నామినేషన్ నుంచి తప్పించుకొన్నాడు.
భాను శ్రీ నామినేషన్
భాను శ్రీకి ఈ వారం కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తున్నది. నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించడానికి అమిత్ ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో నామినేట్ అయింది. అమిత్ తన తలకు కట్టుకొనే స్కార్ఫ్ ను తొలగించుకోవడానికి ఒప్పుకోకపోవడం, అలాగే ఈ సీజన్‌లో కెప్టెన్ పదవిని చేపట్టబోనని అంగీకరించకపోవడంతో భానుశ్రీ నామినేట్ కావాల్సి వచ్చింది.

కొత్త విభేదాలు
బిగ్‌బాస్ కొత్త రకం నామినేషన్‌తో విభేదాలు ఉన్న సెలబ్రిటీలు దగ్గరయ్యారు. ఇప్పటి వరకు క్లోజ్‌గా ఉన్నవారి మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఈ వారం బిగ్‌బాస్ రసవత్తరంగా మారబోతున్నదని బిగ్‌బాస్ షో చెప్పకనే చెప్పింది. తనను రక్షించకపోవడంపై అమిత్‌పై భాను శ్రీ గుర్రుగా ఉంది.


Click it and Unblock the Notifications











