మా ఆయన వల్లే, కొడుకుని చూడాలన్నా ఒప్పుకోలేదు వాళ్ళు.. యాంకర్ శ్యామల!

గత కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ గురించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సీజన్1, 2 లకు మంచి రెస్పాన్స్ రావడంతో బిగ్ బాస్ 3 మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ షోని నడిపించిన విధానానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే జోరుని నాని కొనసాగించాడు. మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ 3 హంగామా మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3కి హోస్ట్ ఎవరనే చర్చ జరుగుతుంటే, కంటెస్టెంట్స్ గురించి కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

 యాంకర్ శ్యామల

యాంకర్ శ్యామల

యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న శ్యామల గత ఏడాది బిగ్ బాస్ 2 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామల తన బిగ్ బాస్ అనుభవాలని పంచుకుంది. బిగ్ బాస్ 2 లో బాగా హైలైట్ ఐన కంటెస్టెంట్స్ లో శ్యామల కూడా ఒకరు. శ్యామల ఓ సారి ఎలిమినేట్ అయినా తిరిగి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. తాజాగా శ్యామల ఈ ఏడాది జరగబోయే బిగ్ బాస్ 3పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 నేను వెళ్లను అని చెప్పా

నేను వెళ్లను అని చెప్పా

శ్యామల మాట్లాడుతూ తనకు తెలిసిన ఓ పీఆర్వో ద్వారా బిగ్ బాస్ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది అని శ్యామల తెలిపింది. ఆ పీఆర్వో నాకు ఫోన్ చేసి బిగ్ బాస్ 2 గురించి చెప్పగానే.. జోకులేయకండి.. బిగ్ బాస్ లో నేనెలా పాల్గొంటాను అని ఫోన్ పెట్టేశా. ఆ విషయం నా భర్తకు చెప్పా. మా ఆయన ఎందుకు చేయనని చెప్పావు. చేయొచ్చు కదా అని అన్నారు. బిగ్ బాస్ లో నేను పాల్గొనడం ఏంటి.. నా వాళ్ళ కాదు అని చెప్పా. లేదు.. చాలా రోజులుగా నువ్వు బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నావు. ఇది నీకు మంచి అవకాశం అని నా భర్త చెప్పారు.

బాబుని వదిలేసి ఎలా

బాబుని వదిలేసి ఎలా

నా భర్త అలా మాట్లాడగానే.. మరి మన బాబుని ఎవరు చూసుకుంటారు అని అడిగా.. మేమంతా ఇక్కడ ఉన్నాం కదా.. నువ్వు వెళ్లి ధైర్యంగా పార్టిసిపేట్ చెయ్.. బాబుని మేం చూసుకుంటాం అని అన్నారు. ఆ ధైర్యంతోనే బిగ్ బాస్ లో పాల్గొన్నానని శ్యామల తెలిపింది. బిగ్ బాస్ హౌస్ ఒక జైలు లాంటిది. కాకపోతే కాస్త మంచి సౌకర్యాలే ఇచ్చారు. కానీ మధ్యలో నా కొడుకుని చూడాలి అని అడిగినా ఒప్పుకోలేదు వాళ్ళు అని శ్యామల తెలిపింది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ గెలుస్తాడని అర్థం అయిపోయిందని శ్యామల తెలిపింది.

 ఎవరైనా పర్వాలేదు

ఎవరైనా పర్వాలేదు

బిగ్ బాస్ 3 హోస్ట్ గా వెంకటేష్, విజయ్ దేవరకొండ, నాగార్జున లాంటి హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై శ్యామల మాట్లాడుతూ నాకు హోస్ట్ ఎవరైనా పర్వాలేదు. అందరూ బాగా హ్యాండిల్ చేస్తారు. కానీ బిగ్ బాస్ 3లో పాల్గొనబోయే కంటెస్టెంట్ ఎవరో తెలుసుకోవాలని ఆతృతగా ఉందని శ్యామల తెలిపింది. ఒక ప్రేక్షకురాలిగా బిగ్ బాస్ 3 కోసం ఎదురు చూస్తున్నట్లు శ్యామల తెలిపింది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేవని తరచుగా అందరం కలుసుకుని మాట్లాడుకుంటున్నట్లు శ్యామల తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X