కౌశల్‌ని మించిపోయిందే.. శ్రీలంకలో కూడా ఆమెకు ఆర్మీ ఉందంట!
Recommended Video

తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ రెండవ సీజన్ ముగిసింది. తెలుగులో రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తమిళంలో తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన లోకనాయకుడు కమల్ హాసనే రెండవ సీజన్ కు కూడా హోస్ట్ గా షోని నడిపించాడు. తెలుగులో కౌశల్ విజేతగా నిలిచాడు. తమిళంలో యంగ్ బ్యూటీ రిత్విక విజేతగా నిలిచింది. షో నుంచి బయటకు వచ్చిన తరువాత రిత్విక ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

తీవ్రమైన పోటీ ఎదుర్కొని
బిగ్ బాస్ లో ఇంటి సభ్యుల నుంచి రిత్వికకు తీవ్రమైన పోటీ ఎదురైంది. అయినా కూడా తట్టుకుని నిలబడి విజేతగా నిలిచింది. దీనితో ట్విట్టర్ వేదికగా రిత్విక అభిమానులకు, తనకు మద్దత్తు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.
శ్రీలంక నుంచి కూడా
రిత్విక ఫ్యాన్స్, రిత్విక ఆర్మీ, రిత్విక వారియర్స్, రిత్విక శ్రీలంక ఫ్యాన్స్ పేరుతో తనకు సోషల్ మీడియా నుంచి అద్భుతమైన మద్దత్తు అందించారని వారందరికీ రుణపడి ఉంటానని రిత్విక తెలిపింది. ఇంటి నుంచి బయట వచ్చాక మీ అభిమానం గురించి పూర్తిగా తెలుసుకున్నానని రిత్విక తెలిపింది.

ఆలస్యానికి కారణం
ఇంటి నుంచి బయటకు వచ్చాక పరిస్థితులు చక్కబెట్టడానికి ఒకవారం సమయం పట్టింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చానని రిత్విక తెలిపింది. త్వరలోనే సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటానని రిత్విక తెలిపింది. అందరూ తనకు ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరింది.

కౌశల్ ఆర్మీ తరహాలో
బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు విజేత కౌశల్ కు కౌశల్ ఆర్మీ పేరుతో ఎలాంటి మద్దత్తు లభించిందో అందరికి తెలిసిందే. బిగ్ బాస్ జరిగినన్ని రోజులు అతడి నామస్మరణతో సోషల్ మీడియా మోతెక్కిపోయింది. అదే తరహాలో తమిళంలో రిత్వికకు మద్దత్తు లభించింది.


Click it and Unblock the Notifications











