కుట్రలు, కుతంత్రాలు భరించలేను.. బయటకు పంపు.. భోరుమన్న గణేష్ .. గీతా సీరియస్...ఐదుగురికి ముప్పు

By Rajababu

బిగ్‌బాస్ రియాలిటీ షోలో 36 రోజు ఆసక్తికరంగా నడిచింది. సెలబ్రిటీల్లో చాలా మందిని బిగ్‌బాస్ ఎమోషన్‌తో ఆడుకొన్నారు. ఇంటిలో అసలే మాట్లాడటానికి ఇష్టం లేని వ్యక్తి ఎవరో చెప్పమని సభ్యులకు సూచించాడు. అలాగే ఇష్టం ఉన్న ఇద్దరు వ్యక్తులు జంటగా ఉండాలని సూచించారు. అదృష్య వ్యక్తిగా అమిత్, కెప్టెన్‌గా గీతా మాధూరిని మినహాయించి ఐదు జంటలను సంకెళ్లతో బంధించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో కామన్ మ్యాన్ గణేష్ ఓ దశలో ఆవేశంతో ఊగిపోయాడు. వివరాల్లోకి వెళితే..

నామినేషన్ ప్రక్రియ మొదలు

నామినేషన్ ప్రక్రియ మొదలు

ఆ తర్వాత ప్రస్తుత వారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అందులో ఇంటి సభ్యుల్లో ఎవరితోనైన అసలే మాట్లాడం ఇష్టం లేని వ్యక్తి పేరు చెప్పమనగా.. మెజారిటి సభ్యులు అమిత్ పేరు చెప్పగా.. అతడిని ఎలిమినేషన్‌కు నామినేట్ చేసి అతడిని అదృష్య వ్యక్తిగా పరిగణించాడు. అతడిని ఎవరూ పట్టించుకోవద్దని సూచించారు.

ఐదు జంటలకు సంకెళ్లు

ఐదు జంటలకు సంకెళ్లు

ఇంటి సభ్యుల్లో ఒకరిని తనకు నచ్చిన మరో వ్యక్తిని తమ జంటగా చేసుకోవాలని సూచించాడు. దాంతో బాబు గోగినేని, రోల్ రైడా ఒక జంటగా, దీప్తి- గణేష్, దీప్తి సునైన-తనీష్, సామ్రాట్-కౌశల్, తేజస్వి-నందిని ఓ జంటగా రూపొందారు. ఒకరికొకరు సంకెళ్లు వేసుకోవాలని వారికి సూచించాడు. ఐదు బజర్లు మోగుతాయని, ప్రతీ బజర్‌కు ఒక వ్యక్తి సంకెళ్ల నుంచి విముక్తి కావాలని సూచించాడు. జంటలోని ఒక వ్యక్తి అవగాహన మేరకు ఒకరు సంకెళ్లు తొలగించుకొంటే.. మరొకరు నామినేట్ అవుతారని గేమ్ రూల్స్ చెప్పాడు.

అమిత్‌కు సీక్రెట్ టాస్క్

అమిత్‌కు సీక్రెట్ టాస్క్

ఎలిమినేషన్, నామినేషన్ ప్రక్రియ ఓ వైపు కొనసాగుతండగానే అమిత్‌కు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో ఐదు టాస్క్‌లను ఇచ్చాడు. 1 ఏదైన వంటను పాడు చేయాలి. 2. ఎవరి బట్టలనైనా స్విమ్మింగ్ ఫూల్ వేయాలి. 3. ఎవరి నెత్తిమీదనైనా గుడ్డు కొట్టాలి. 4 ఎవరినైనా హగ్ చేసుకోవాలి. 5 డైనింగ్ టేబుల్‌పై ఎవరితోనైనా డ్యాన్స్ చేయించాలి. ఇవి పూర్తి చేస్తే నామినేషన్ ప్రక్రియను నుంచి బయటపడుతావని అమిత్‌కు బిగ్‌బాస్ సూచించాడు.

గణేష్ గుడ్డుకొట్టిన అమిత్

గణేష్ గుడ్డుకొట్టిన అమిత్

సీక్రెట్ టాస్క్‌లో భాగంగా గణేష్‌ నెత్తిపై గుడ్డుకొట్టి.. నన్ను నామినేట్ చేసినందుకు ఇది శిక్ష. నా కోపాన్ని ఇలా తీర్చుకొంటున్నాను అని అమిత్ అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అమిత్ చేసిన పనికి గణేష్‌కు పిచ్చ కోపం వచ్చింది. ఇంటిలోకి వచ్చింది కొట్టించుకోవడానికి అంటూ ఊగిపోయాడు.

నన్ను బయటకు పంపించండి

నన్ను బయటకు పంపించండి

తన తలపై అమిత్ కొట్టడంపై గణేష్ సీరియస్ అయ్యాడు. నామినేట్ చేస్తే భౌతికంగా దాడి చేస్తాడా? కొట్టించుకోవడానికి రాలేదు? గట్టిగా కొడితే తల నొప్పిగా ఉంది. ఈ కుట్రలు, కుతంత్రాలు భరించలేను. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించండి అని గట్టిగా అరిచాడు. గణేష్‌పై దాడికి దిగినందుకు గీతామాధురీ సీరియస్ అయ్యారు.

గణేష్ బాధను చూడలేక అమిత్

గణేష్ బాధను చూడలేక అమిత్

గణేష్ పడుతున్న బాధను చూడలేక అమిత్ కంటతడి పెట్టుకొన్నాడు. గుక్కపెట్టి ఏడ్చాడు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగానే నేను ఈపని చేశాను. నాది ఎవరికి హానీ తలపెట్టని గుణం.. అలాంటిది టాస్క్ కోసం అలా చేయాల్సి వచ్చింది ఆవేదన చెందాడు. అలాగే గణేష్ వ్యవహారం సీరియస్ కావడంతో సీక్రెట్ టాస్క్‌ను బయటపెట్టాడు.

ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేట్

ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేట్

ఇదిలా ఉండగా, సాయంత్రం నామినేషన్ ప్రక్రియ ముగిసిందని, సీక్రెట్ టాస్క్‌లో అన్ని పనులు సక్రమంగా పూర్తి చేసినందున అమిత్‌ను నామినేషన్‌ నుంచి తప్పించాడు. అలాగే సంకెళ్ల నుంచి విముక్తి కాని వారిని నామినేషన్ తప్పించాడు. సంకెళ్లతో బందీ అయిన వారి తేజస్వి, సామ్రాట్, తనీష్, రోల్ రైడా, దీప్తి నల్లమోతు ఈ వారం నామినేట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X