సామ్రాట్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్.. కౌశల్ తల్లి మరణం.. బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుల విషాదం!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 60 Highlights

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 58, 59 రోజు గందరగోళం నెలకొన్నది. విషాద ఛాయలతో సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. టాస్క్ విషయంలో విభేదాలు తలెత్తాయి. దాంతో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి ఇంటి సభ్యులు వెళ్లారు. టాస్క్‌లో భాగంగా కబాడ్డీ, ఇతర ఆటలను ఆసక్తికరంగా ఆడారు. సమ్రాట్, కౌశల్, గణేష్, రోల్ రైడా గుక్కపెట్టి ఏడ్వటం పలువురిని ఉద్వేగానికి గురిచేసింది.

కబడ్డీ ఆట జోష్

కబడ్డీ ఆట జోష్

బిగ్‌బాస్ విధించిన పురుషులు, మహిళల మధ్య అధిపత్యం పోరు టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల్లో మగవారు, ఆడవాళ్లు రెండు జట్లుగా విడిపోయి కబడ్డీ ఆడారు. ఇందులో పురుషుల జట్టు గెలిచింది.

పూజా, కౌశల్ ఫైర్

పూజా, కౌశల్ ఫైర్

ఆ తర్వాత ఇంటి సభ్యుల మధ్య తమకు చెందిన ఏరియాలో అధిపత్యం సాధించడానికి ఇరు వర్గాలు భారీగానే పోటీ పడ్డారు. కొన్నిసార్లు మహిళల జట్టు హద్దు మీరి రూల్స్‌ను వ్యతిరేకించడంతో కౌశల్, తనీష్ వారిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా పూజా, కౌశల్ మధ్య భారీగా మాటలు రువ్వుకొన్నారు.

కారు టైరు మార్చిన లేడీస్

కారు టైరు మార్చిన లేడీస్

అమ్మాయిలను ఛాలెంజ్ చేసే టాస్క్‌ను బిగ్‌బాస్ విధించాడు. కారు టైరు మార్చే విషయంలో అమ్మాయిలు వీక్ అంటారు. ఒకవేళ 15 నిమిషాలలో కారు టైరును మార్చితే గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. ఒకవేళ ఓడిపోతే పురుషులకు ఆ గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి అని చెప్పాడు.

పురుషులు ఏడ్చి చూపాలి

పురుషులు ఏడ్చి చూపాలి

పురుషులకు బిగ్‌బాస్ ఓ కొత్తరకం టాస్క్‌ను విధించాడు. పురుషులకు సరిగా ఏడ్వటం రాదు. అందుకే పురుషులు బాగా ఏడ్చిచూపెట్టాలనే టాస్క్ అసైన్ చేశారు. ఆ తర్వాత కారణం కూడా తెలియజేయాలి అని సూచించారు. దాంతో సమ్రాట్, కౌశల్, గణేష్, రోల్ రైడా ఏడుపు టాస్క్‌లో పాల్గొన్నారు.

విషాదంలోకి రోల్ రైడా

విషాదంలోకి రోల్ రైడా

బిగ్‌బాస్‌ విధించిన సమయంలో సమ్రాట్, కౌశల్, గణేష్, రోల్ రైడా గుక్కపెట్టి ఏడ్చారు. సమయం ముగిసిన తర్వాత రోల్ రైడా తాను కంటతడి పెట్టడానికి కారణాన్ని వివరించాడు. తనకు ఇష్టమైన ఓ పాటలోని సాహిత్యాన్ని గుర్తు చేసుకొంటే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడు గుర్తు చేసుకొన్న గానీ నేను ఏడుస్తాను అని చెప్పాడు.

తల్లి మరణాన్ని గుర్తుచేసుకొని

తల్లి మరణాన్ని గుర్తుచేసుకొని

తన తల్లి మరణాన్ని గుర్తు చేసుకొన్నప్పుడల్లా నా కళ్లలో నీళ్లు తిరుగుతాయని కౌశల్ చెప్పాడు. తన తల్లిని దహనం చేసేటప్పుడు ఆమె కాళికి ఉన్న మెట్టెను తీసుకొని ఉంగరంగా ధరించాను. అది గుర్తు వచ్చినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఏడ్చాను అని కౌశల్ చెప్పాడు.

నా వల్లే తల్లిదండ్రులకు కష్టాలు

నా వల్లే తల్లిదండ్రులకు కష్టాలు

తన తల్లిదండ్రుల మాట ఎప్పుడు వినలేదని, దాంతో వారు తన వల్ల చాలా కష్టపడ్డారని సామ్రాట్ ఆవేదనకు గురయ్యాడు. తాను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం వల్ల తన తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో చాలా దూరంగా ఉన్నాను. హాస్పిటల్‌కు చేర్చి డాక్టర్లు ఏం చెబుతారో అనే విషయం కోసం వేచిచూడటం నరకంగా మారింది. ఆ విషయాన్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకొన్నా నాకు ఏడుపు వస్తుంది అని సామ్రాట్ చెప్పాడు.

గణేష్ కంటతడికి కారణమిదే

గణేష్ కంటతడికి కారణమిదే

ఉద్యోగం దొరకపోవడంతో చాలా కష్టాలు అనుభవించాను. తన ఏడుపు కారణమదే అని గణేష్ చెప్పాడు. ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత బోడుప్పల్ నుంచి హైటెక్ సిటీకి ఇంటర్వ్యూల కోసం వెళ్లేవాడిని. దాదాపు ఎనిమిది నెలల పాటు ఆకలితో పస్తులు ఉండి చిన్న ఉద్యోగం సంపాదించాను. పది వేల రూపాయల ఉద్యోగం కోసం ఎంత కష్టపడ్డాననే విషయం గుర్తోస్తే ఏడుపు సహజంగానే వస్తుంది అని గణేష్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X