తనీష్, దీప్తి ఎలా కొట్టుకున్నారో.. బిగ్‌బాస్‌లో చెండాలంగా ఫైట్.. పిచ్చిగా రెయిన్ డ్యాన్స్!
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోలో 60, 61 రోజు కెప్టెన్, లగ్జరీ బడ్జెట్ టాస్క్ భలే రంజుగా సాగింది. టాస్క్‌ల సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య అభిప్రాయ విభేదాలు, గొడవలు ఎప్పటి మాదిరిగానే సాగాయి. కాకపోతే మెజార్టీ విషయాల్లో ఇంటి సభ్యుల మధ్య సంతోషమే కనిపించింది. చాలా సరదాగా 60 రోజు గడిచిపోయింది. వివరాల్లోకి వెళితే..

కెప్టెన్ టాస్క్‌లో భాగంగా
కెప్టెన్ టాస్క్‌లో భాగంగా ఓ తెల్లటి తెరకు ఎక్కువ మొత్తంలో రంగు పూస్తారో వారిని ఈ వారం కెప్టెన్‌గా నియమించబడుతాడని బిగ్‌బాస్ సూచన మేరకు పోటీ హోరాహోరీగా జరిగింది. తనీష్, దీప్తి నల్లమోతు మధ్య టాస్క్ నువ్వా నేనా అనే విధంగా సాగింది.

దీప్తి, తనీష్ శారీరకంగా
ఇంటి సభ్యురాలు దీప్తి సునైనా పర్యవేక్షణలో కెప్టెన్ టాస్క్ ధాటిగా ముగిసింది. టాస్క్‌లో భాగంగా దీప్తి, తనీష్ శారీరకంగా తలపడ్డారు. ఓ దశలో దీప్తిపైన తనీష్ బల ప్రదర్శన చేశాడు. దీప్తి రంగు వేయకుండా బలమంతా ఉపయోగించి అడ్డుకోవడంలో సఫలమయ్యాడు.

కెప్టెన్‌గా తనీష్
కెప్టెన్ టాస్క్ ముగిసిన తర్వాత దీప్తి సునైనా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎక్కువగా రంగు వేసిన తనీష్‌ను ఈ వారం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఎర్ర రంగు కావడంతో తనీష్‌కు అనుకూలంగా మారింది. దీప్తి వేసిన బ్లూ కలర్‌ను ఎర్ర రంగు డామినేట్ చేయడంతో దీప్తి నల్లమోతు ఓడిపోకతప్పలేదు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో కూడా గీతా మాధూరి, కౌశల్ టీమ్‌కు మధ్య గట్టి పోటి జరిగింది. ఇంటిలో పెట్టిన కొన్ని బ్యాగులను ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వారికి లగ్జరీ బడ్జెట్ లభిస్తుందని చెప్పారు. గీతా మాధురి, తనీష్, రోల్ రైడా, దీప్తి సునైన, బాబు గోగినేని జట్టు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో గెలిచింది. వారికి ఇష్టమైన వస్తువులే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో లభించడంతో సంబరపడిపోయారు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో కూడా గీతా మాధూరి, కౌశల్ టీమ్‌కు మధ్య గట్టి పోటి జరిగింది. ఇంటిలో పెట్టిన కొన్ని బ్యాగులను ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో వారికి లగ్జరీ బడ్జెట్ లభిస్తుందని చెప్పారు. గీతా మాధురి, తనీష్, రోల్ రైడా, దీప్తి సునైన, బాబు గోగినేని జట్టు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో గెలిచింది. వారికి ఇష్టమైన వస్తువులే లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో లభించడంతో సంబరపడిపోయారు.

పిచ్చ పిచ్చగా రెయిన్ డ్యాన్స్
బిగ్‌బాస్ 61వ రోజు సాయంత్రం భారీ వర్షం కురియడంతో ఇంటి సభ్యులకు ఉత్సాహం వచ్చింది. అమిత్ పాటలు పాడుతు ఇంటి సభ్యులను ఆనంద పరిచాడు. పాటల పాడుతూనే కొన్ని సాంగ్స్ ప్లే చేయమని అమిత్ బిగ్‌బాస్‌ను అడిగాడు. దాంతో సినిమా పాటలను ప్లే చేయగా వానలో సెలబ్రిటీలు రెచ్చిపోయి డాన్సు చేశారు.

వానలో పాటలకు డ్యాన్స్
గ్యాంగ్ లీడర్‌లో వాన వాన వెల్లువాయే, కృష్ణార్జున యుద్ధంలో దారి చూడు దారి చూడు, గీతా గోవిందంలో ఇంకా ఇంకా కావాలి, జనతా గ్యారేజ్ చిత్రంలో నేను పక్కా లోకల్ అనే పాటలకు ఇంటి సభ్యులు ఉత్సాహంతో గెంతులేశారు. ఆనందంతో వర్షంలో తడిసి ముద్దయ్యారు.


Click it and Unblock the Notifications











