twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గీతా మాధురికి ముద్దు.. బిగ్‌బాస్‌లో కౌగిలింత మంట.. చెంపలు వాయించారు!

    By Rajababu
    |

    బిగ్‌బాస్‌ తెలుగు షోలో 72, 73 రోజులు చాలా ఆనందంగా సాగిపోయాయి. పెళ్లి టాస్క్‌లో భాగంగా వివాహ పనులు, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు చకచకా సాగిపోయాయి. యాంకర్ అనసూయ రాకతో ఇళ్లంతా సందడి సందడిగా మారిపోయింది. బిగ్‌బాస్ విధించిన సీక్రెట్ టాస్కులు ఆట విడుపుగా మారాయి. మొత్తానికి సంపన్న కుటుంబంలో జరిగే పెళ్లి కళ బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించింది. వివరాల్లోకి వెళితే..

    హుషారుగా అనసూయ

    హుషారుగా అనసూయ

    యాంకర్ అనసూయ పెళ్లి పనుల్లో భాగమైంది. పెళ్లికి కావాల్సిన బట్టల షాపింగ్ హుషారుగా సాగింది. గణేష్ బట్టల షాపు యజమానిగా వ్యవహరించగా.. కౌశల్, శ్యామల ఓ జంటగా, అమిత్, దీప్తి ఓ జంటగా బట్టలు కొనుగోలు చేశారు. ఈ టాస్క్‌లో దీప్తి, శ్యామల తన నటనతో ఆకట్టుకొన్నారు.

    సంగీత్‌లో గీతా మాధురి హవా

    సంగీత్‌లో గీతా మాధురి హవా

    సంగీత్‌లో భాగంగా గీతా మాధురి,శ్యామల, రోల్ రైడా పాటలు పాడారు. ఆ పాటలతోపాటు సూపర్ మచ్చీ పాటకు ఇంటి సభ్యులు డ్యాన్సులతో హోరెత్తించారు. అందరూ పెళ్లి వేడుకను బాగా ఎంజాయ్ చేశారు.

    కౌగిలింతపై వివాదం

    కౌగిలింతపై వివాదం

    సంగీత ముగిసిన తర్వాత పెళ్లి కొడుకు రాధాకృష్ణ, మధులత ఇద్దరు కౌగిలించుకోవడం కొంత వివాదానికి దారి తీసింది. మొరటుగా కౌగిలించుకునేలా చేయడం మధులత తండ్రి అమిత్‌కు కోపం తెచ్చింది. పెళ్లి కొడుకు కౌగిలించుకొనేందుకు చేసిన తీరును తప్పు పట్టి చెంపలు వాయించారు. ఆ విషయం కౌశల్, దీప్తి ఇతరులకు కోపం తెప్పించింది.

    అనసూయ మెహందీ పెట్టి..

    అనసూయ మెహందీ పెట్టి..

    పెళ్ల పనుల్లో భాగంగా యాంకర్ అనసూయ అందరికి చేతులకు మెహందీ పెట్టింది. ప్రతీ ఒక్కరి చేతిపైన వారి పేర్లను రాసింది. ఆమె చక్కటి రాత అందర్ని ఆకట్టుకొన్నది. ఆ తర్వాత కొద్ది సేపటికి బిగ్‌బాస్ ఆదేశం మేరకు అనసూయ ఇంటి నుంచి నిష్క్రమించింది.

    చెంపలపై కొడుతారా అని కౌశల్ ఆగ్రహం

    చెంపలపై కొడుతారా అని కౌశల్ ఆగ్రహం

    పెళ్లి కొడుకును అమ్మాయి తరుఫు వాళ్లు చెంపలపై కొడుతారా అని కౌశల్ రాద్దాంతం చేశారు. ఏదో తెలియక తప్పు జరిగిందని అమిత్ ఒప్పుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో సామ్రాట్, రోల్ రైడాకు సీక్రెట్ టాస్క్ అప్పగించారు.

    సామ్రాట్‌, రోల్‌కు సీక్రెట్ టాస్క్

    సామ్రాట్‌, రోల్‌కు సీక్రెట్ టాస్క్

    సీక్రెట్ టాస్క్‌లో భాగంగా సామ్రాట్, రోల్ రైడా రెండు స్వీటు బాక్సులు తినాలి. గీతా మాధురిని రోల్ రైడా ముద్దు పెట్టుకోవాలి. పూజాను పెళ్లి చేసుకొనేలా అమిత్, గీతా మాధురిని సామ్రాట్ ఒప్పించాలి. గణేష్‌ను స్విమ్మింగ్ పూల్‌లో తోసేయాలి. ఇవన్నీ చేస్తే బహుమతులతోపాటు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులవుతారు అని బిగ్ బాస్ ప్రకటించారు.

    సీక్రెట్ టాస్క్‌లో గీతా మాధురికి ముద్దులు

    సీక్రెట్ టాస్క్‌లో గీతా మాధురికి ముద్దులు

    బిగ్‌బాస్ విధించిన సీక్రెట్ టాస్క్‌లను సామ్రాట్ ఎవరికీ తెలియకుండా పూర్తి చేశారు. స్వీటు బాక్సులు తిన్నారు. గీతా మాధురిని రోల్ రైడా ముద్దు పెట్టుకొన్నారు. పూజాను పెళ్లికి ఒప్పించే విధంగా కొంత మేరకు సామ్రాట్ సఫలమయ్యాడు. గణేష్‌ను రోల్ రైడా స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేశాడు. దాంతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది. గురువారం ఎపిసోడ్‌లో పెళ్లి వేడుకు రంగం సిద్ధమైంది.

    English summary
    Bigg Boss 2 Telugu 72, 73 day highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Anchor Anasuya entry create a big josh in the House.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X