బిగ్ బాస్ 2 షురూ: గీతా మాధురితో విలన్ ఎంట్రీ, షాకిచ్చిన బాబు గోగినేని, 16 మంది వీరే..

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Telugu Season 2 : Contestants Background

నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్లో... ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

నాని ఎంట్రీ అదిరిపోయింది

నాని ఎంట్రీ అదిరిపోయింది

నాని తన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగులకు డాన్స్ చేస్తూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ప్రెస్ మీట్లో మొదటి సీజన్ చూడలేదని చెప్పినందుకు నన్ను రెండు రోజులు కూర్చోబెట్టి వరుస పెట్టి ఎపిసోడ్లన్నీ చూపించారని నాని అన్నారు. బిగ్ బాస్‌కు ఇంత క్రేజ్ రావడానికి కారణమైన, మొదటి సీజన్ అద్భుతంగా హోస్ట్ చేసిన తారక్ అన్నయ్యకు థాంక్స్ అంటూ.... బిగ్ బాస్ 2 కొత్త ఇంట్లోకి ఎంటరై హౌస్ ఎలా ఉందో చూపించారు నాని.

ఫస్ట్ కంటెస్టెంట్ గీతా మాధురి

ఫస్ట్ కంటెస్టెంట్ గీతా మాధురి

ప్లేబ్యాక్ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్ట్ గీతా మాధురి బిగ్ బాస్ ఇంట్లోకి తొలి కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చారు. పక్కా లోకల్ పాట పాడుతూ ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యారు.

సెకండ్ కంటెస్టెంట్ అమిత్

సెకండ్ కంటెస్టెంట్ అమిత్

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అమిత్ బిగ్ బాస్ హౌస్‌లోకి రెండో కంటెస్టెంటుగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో విలన్‌గా చూడటంతో చాలా మంది నేను బయట కనపడినా, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినా తన వద్దకు రావడానికి భయపడుతుంటారని, తన రియల్ క్యారెక్టర్ అది కాదని నిరూపించడానికే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్లు అమిత్ తెలిపారు.

టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి నల్లమోతు

టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి నల్లమోతు

మూడో కంటెస్టెంటుగా టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి నల్లమోతు ఎంటరయ్యారు. ఈ సందర్భంగా దీప్తి ఏవీ ప్రదర్శించారు. తాను విజయవాడ అమ్మాయినని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో ఆనందకర సందర్భమని, ఒక కుమారుడు కూడా ఉన్నట్లు దీప్తి వెల్లడించారు.

నాలుగో కంటెస్టెంటుగా తనీష్

నాలుగో కంటెస్టెంటుగా తనీష్

బిగ్ బాస్ ఇంట్లోకి 4వ కంటెస్టెంటుగా హీరో తనీష్ ఎంటరయ్యాడు. తనీష్ గురించి నాని మాట్లాడుతూ... వీడు తనకు చిన్నప్పటి నుండి తెలుసని, తనకు తమ్ముడు లాంటోడని, ఇద్దరం కలిసి సినిమా కూడా చేశాం, వీడికి నేను అస్సలు రెస్పెక్ట్ ఇవ్వను, ఒరేయ్...తురేయ్ అని పిలుస్తాను అని నాని తెలిపారు.

షాకిచ్చిన బాబు గోగినేని

షాకిచ్చిన బాబు గోగినేని

ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ షోలోకి సామాజిక వేత్త, హ్యూమన్ యాక్టివిస్ట్ బాబు గోగినేని ఎంట్రీ ఇచ్చారు. సహనను తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తన కొడుకు అరుణ్‌తో ఆడుకోవడం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. కుల, మత, వర్గ బేధాలు లేని సమాజం చూడాలనేది తనకోరిక అని, మా అమ్మ చనిపోయిన తర్వాత ఆమె కోరిక మేరకు రెండు కిడ్నీలు ఒక హిందూకు, ఒక ముస్లింకు అమర్చారని, ఆమె కళ్లు కూడా మరో ఇద్దరికి చూపునిచ్చాయని తెలిపారు.

భానుశ్రీ

భానుశ్రీ

బిగ్ బాస్ హౌస్‌లోకి 6వ కంటెస్టెంటుగా తెలుగు నటి భానుశ్రీ ఎంటరయ్యారు. బాహుబలి సినిమాలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకు బాడీ డబుల్ చేయడంతో పాటు పలు తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. రంగస్థలం మూవీలోని జిగేలురాణి సాంగుకు సెక్సీగా స్టెప్పులేస్తూ భానుశ్రీ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటరయ్యారు.

రోల్ రైడా

రోల్ రైడా

బిగ్ బాస్ ఇంటోకి 8వ కంటెస్టెంటుగా హైదరాబాద్‌కు చెందిన ర్యాపర్ రోల్ రైడా ఎంటరయ్యీాడు. రాహుల్ కుమార్ వేల్పుల అలియాస్ రోల్ రైడా..... యూట్యూబ్ ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు.

ఎనిమిదో కంటెస్ట్ గా యాంకర్ శ్యామల

ఎనిమిదో కంటెస్ట్ గా యాంకర్ శ్యామల

బిగ్ బాస్2 హౌస్ లోకి ఎనిమిదో కంటెస్ట్ గా యాంకర్ శ్యామల అడుగుపెట్టారు. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు తన యాంకరింగ్ తో సుపరిచితులు. పదకొండు నెలల వయసున్న తన కుమారుడు ఇషాంత్ ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. భర్త తన కుమారుడిని చూసుకొంటానని హామీ ఇచ్చిన తర్వాతే బిగ్ బాస్ లోకి వచ్చానని హోస్ట్ నానీతో శ్యామల చెప్పారు.

తొమ్మిదో కంటెస్టెంట్ గా కిరిటీ దామరాజు

తొమ్మిదో కంటెస్టెంట్ గా కిరిటీ దామరాజు

బిగ్ బాస్ హౌస్ లోకి 9వ సెలబ్రిటీగా కిరిటీ దామరాజు ప్రవేశించారు. ఎవడే సుబ్రమణ్యం చిత్రంల నానీతో నటించారు. ఇటీవల ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో హీరో రామ్ స్నేహితుడిగా నటించారు. పలు తెలుగు చిత్రాల్లో నటించిన కిరిటీ గుంటూరులో పెట్టారు. హైదరాబాద్ లో పెరిగారు. బెంగళూరులో జాబ్ చేస్తూ థియేటర్ లో శిక్షణ పొందారు. ప్రస్తుతం బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేశారు. బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత చెడు అలవాట్లు చేసుకొనని తల్లికి హామీ ఇచ్చినట్టు నానితో కిరిటీ చెప్పారు.

పదో సెలబ్రిటీగా సోషల్ మీడియా సెన్సేషన్ బేబి సునయన..

పదో సెలబ్రిటీగా సోషల్ మీడియా సెన్సేషన్ బేబి సునయన..

పదో సెలబ్రిటీగా సోషల్ మీడియా సెన్సేషన్ బేబీ సునయన ప్రవేశించారు. ఇన్స్ టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను సునయన కలిగి ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటారు. ఎనర్టీతో ఆకట్టుకొనడం ఆమె ప్రత్యేకత. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందే నానిని కౌగిలో బంధించి షాకిచ్చారు. 20 ఏళ్ల వయసులోనే బిగ్ బాస్ చాన్స్ కొట్టేయడం సునయన స్పెషాలిటి.

11వ సెలబ్రిటీగా కౌశల్

11వ సెలబ్రిటీగా కౌశల్

తెలుగు తెరపై తరచుగా కనిపించే నటుడు, ఫ్యాషన్ సెలబ్రిటీ కౌశల్ 11వ సెలబ్రిటీగా బిగ్ బాస్2 సీజన్ లోకి ప్రవేశించారు. పెద్దగా గుర్తింపులేని కౌశల్ ఈ రియాలిటీ షోలోకి రావడం కొందరికి ఆశ్చర్యం కలిగింది. వ్యాయమంపై మక్కువ చూపే కౌశల్.. ఆహారంపై పరిమితి ఉన్నప్పటికీ తాను ఆకలికి తట్టుకోగలనని చెప్పారు.

12వ సెలబ్రిటీగా తేజస్వి మదివా

12వ సెలబ్రిటీగా తేజస్వి మదివా

బిగ్ బాస్2 సీజన్లోకి సినీ నటి తేజస్వి మదివాడ సెలబ్రిటీగా ప్రవేశించారు. ఐస్ క్రీమ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హార్ట్ ఎటాక్, అనుక్షణం, మనం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఓ హిందీ పాటపై బ్రహ్మండమైన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.

13వ కంటెస్టెంటుగా సామ్రాట్

13వ కంటెస్టెంటుగా సామ్రాట్

13 సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్ లోకి యువ నటుడు, క్రికెటర్ సమ్రాట్ రెడ్డి ప్రవేశించారు. ఇటీవల భార్యతో విభేదాల కారణంగా ఓ వివాదాస్పద కేసు కూడా ఈయనపై నమోదైంది. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. బావ, అహ నా పెళ్లంట చిత్రాల్లో సమ్రాట్ నటించారు. మంచు లక్ష్మి ప్రసన్న నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానున్నది.

14 కంటెస్టెంటుగా సామాన్యుడు గణేష్

14 కంటెస్టెంటుగా సామాన్యుడు గణేష్

బిగ్ బాస్ లో 14వ సెలబ్రిటీకి ఓ ప్రత్యేక ఉంది. ఎందుకంటే సామాన్య ప్రేక్షకుడి ఎంపికలో భాగంగా బిగ్ బాస్ లోకి ప్రవేశించారు. విజయవాడ చెందిన గణేష్ రేడియో జాకీగా పనిచేస్తున్నారు. తెలుగు భాషలో ప్రాసలతో ఆకట్టుకోవడం ఈయన స్పెషాలిటీ.

15వ సెలబ్రిటీగా కామన్ ఉమెన్ సంజనా అన్నె

15వ సెలబ్రిటీగా కామన్ ఉమెన్ సంజనా అన్నె

కామన్ మ్యాన్ కేటగిరిలో సంజనా అన్నె బిగ్ బాస్ హౌస్2 హౌస్ లోకి ప్రవేశించారు. ఐశ్వర్యరాయ్ స్ఫూర్తిగా భావించే సంజనా మోడల్ గా రాణిస్తున్నారు. రియాలిటీ షోలో రాణించడానికి నేను ఎలా ఉంటానో అలానే వ్యవహరిస్తాను అని సంజనా అన్నారు. విజయవాడకు చెందిన సంజనా మిస్ హైదరాబాద్ గా ఎంపికయ్యారు.

16వ సెలబ్రిటీగా నూతన్ నాయుడు

16వ సెలబ్రిటీగా నూతన్ నాయుడు

బిగ్ బాస్2 సీజన్ లోకి 16వ సెలబ్రిటీగా నూతన్ నాయుడు ప్రవేశించారు. ఖాకీ డ్రస్ లో ఎంట్రీ ఇచ్చిన నూతన్ సామాజిక కార్యకర్త. పలు మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేశారు. అక్కడ సంతృప్తి లభించకపోవడంతో సామాజిక సేవకు అంకితమయ్యాడు. నలుగురికి సేవల చేయడం వల్ల వచ్చే గుర్తింపే తనకు ఇష్టమని నూతన్ చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో సామాన్యుడి సత్తా చాటుతానని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X