కౌశల్ దర్శకత్వంలో..... బిగ్‌బాస్ ఫ్యామిలీతో రోల్ రైడా భారీ ప్లానింగ్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Roll Rida Plans Music Album With All Contestants

తెలుగు రాపర్ రోల్ రైడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరవ్వడానికి ముందే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 'పతంగ్', 'శంకర్ కా బేటా' లాంటివి మంచి ఆదరణ పొందాయి. గతవారం బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన రోల్ రైడా....ఈ రియల్టీ షో పూర్తయిన తర్వాత 16 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఓ మ్యూజిక్ ఆల్బం ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్నపుడే తాను ఈ విషయమై కౌశల్, ఇతర ఇంటి సభ్యులతో ఈ విషయమై చర్చించినట్లు రోల్ రైడా వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 2, అందులోని సభ్యులు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోవాలనే ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

కౌశల్ దర్శకత్వంలో...

కౌశల్ దర్శకత్వంలో...

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంతా కలిసి చేసే ఈ మ్యూజిక్ ఆల్బంకు దర్శకత్వం వహించడానికి కౌశల్ ఆసక్తిగా ఉన్నారని, తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడే ఈ విషయమై చర్చించుకున్నామని రోల్ రైడా వెల్లడించారు.

నాని అన్నను కూడా ఇన్వైట్ చేస్తాం

నాని అన్నను కూడా ఇన్వైట్ చేస్తాం


మేము చేసే మ్యూజిక్ ఆల్బంకు నాని అన్నను కూడా ఇన్వైట్ చేయాలనే ఆలోచన ఉంది. ఇది మా అందరికీ ఎప్పటికీ ఒక మొమెరీగా ఉండేట్లు దీన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నామని రోల్ రైడా తెలిపారు.

కాంట్రవర్సీలున్నాయి కాబట్టి... ఏం జరుగుతుందో?

కాంట్రవర్సీలున్నాయి కాబట్టి... ఏం జరుగుతుందో?


బిగ్ బాస్ ఇంట్లో ఉన్నపుడు కొందరి మధ్య కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. అయితే బయటకు వచ్చిన తర్వాత అందరూ వస్తారా? లేదా? అనే విషయంలో ఓ చిన్న అనుమానం అయితే ఉంది. ఏం జరుగుతోందో చూడాలి. గేమ్ ను గేమ్ లాగా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా కలిసి ఉంటే మంచిది అని నా ఉద్దేశ్యం అన్నారు రోల్ రైడా.

అపుడు అందరూ హ్యాపీ ఫీలయ్యారు

అపుడు అందరూ హ్యాపీ ఫీలయ్యారు

బిగ్ బాస్ హౌస్‌లో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. కొందరు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తర్వాత షూటింగ్ మిస్సవుతున్నట్లు ఫీలయ్యారు. ఆ సమయంలో బిగ్ బాస్ ఫిల్మ్ తీయాలని టాస్క్ ఇవ్వడంతో అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు, ఆ షూటింగును చాలా ఎంజాయ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X